సీబీఐ కీలుబొమ్మేనని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలతో వెల్లడ.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ కీలుబొమ్మేనని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలతో వెల్లడ..

సీబీఐ కీలుబొమ్మేనని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలతో వెల్లడ..

Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013

కర్నూలు: కేంద్ర ప్రభుత్వ చేతిలో సీబీఐ కీలుబొమ్మేనని కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలతో వెల్లడైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత శోభానాగిరెడ్డి అన్నారు. జగన్ ఇప్పట్లో రారని కేంద్రమంత్రే ప్రకటించడం ఇందుకు నిదర్శనమని శోభానాగిరెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లో జరుగుతుందని కోట్ల వ్యాఖ్యలతో స్పష్టమైందని ఆమె అన్నారు. జగన్ కేసుపై తాము మొదటి నుంచి చెప్పిన విధంగానే కాంగ్రెస్ కనుసన్నల్లో సీబీఐ ఉందనే విషయం అర్ధమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత శోభానాగిరెడ్డి తెలిపారు. 
Share this article :

0 comments: