పునాదులు లేని పిరికిపందలా జగనన్న గురించి మాట్లాడేది?! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పునాదులు లేని పిరికిపందలా జగనన్న గురించి మాట్లాడేది?!

పునాదులు లేని పిరికిపందలా జగనన్న గురించి మాట్లాడేది?!

Written By news on Wednesday, April 17, 2013 | 4/17/2013


పునాదులు లేని పిరికిపందలా జగనన్న గురించి మాట్లాడేది?!
ఏ విధంగానూ పరిపాలనా వ్యవహారాలలో తలదూర్చకుండా, ఏ అధికారిని గానీ ఏ ఒక్క మంత్రిని గానీ తన స్వప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా ఎక్కడో తన మానాన తను వ్యాపార రంగంలో ఉన్న జగన్‌ని జైలుపాలు చేసి ఏదో ఘనకార్యం సాధించామని కాంగ్రెస్ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారు. పునాదుల్లేని ఈ పిరికిపందలు... ఇంత పెద్ద ప్రజావాహిని ‘మేం జగనన్న పక్షమే’’నని తీర్పు చెబుతున్నా కూడా, కన్నులుండీ కనలేని కబోదులవుతున్నారు.

2009 ఎన్నికలలో అన్ని పార్టీలూ కూటమిగా ఏర్పడి, పద్మవ్యూహాలు పన్ని, వైఎస్సార్‌ని ఓడించాలని పన్నాగాలు పన్నినప్పటికీ ఆయనకున్న ప్రజాబలం ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. అయినా నేటికీ ఆ గుణపాఠాలు వారి నెత్తికెక్కినట్లు లేదు. 2014 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కపట ఆలోచనలు చేస్తూ, కుయుక్తులు పన్నుతూ, జగన్‌ని నిరోధించడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నీచ రాజకీయాలు నడుపుతున్నాయి. ప్రజానాయకుడైన వై.ఎస్. రాజశేఖరరెడ్డి వారసుడిగా విల్లంబులు చేపట్టిన యువనేత జగన్... శత్రుసైన్యాలను సంపూర్ణ వినాశనం గావించి రాజ్యాన్ని చేపట్టిననాడు గాని ఈ దుష్టకూటమికి కనువిప్పు కలగదేమో.

రాజకీయానికి పునాది ప్రజాసంక్షేమం అని తేటతెల్లం చేసిన రాజకీయ చతురుడు, ప్రజాహృదయ చోరుడు మన రాజన్న. మాట తప్పక, మడమ తిప్పక, వెన్ను చూపక, ధీరుడిగా, ప్రజాహితుడిగా మార్గనిర్దేశం చేసి మాయమైపోయాడు. ప్రజాసంక్షేమాన్ని చూసుకొమ్మని, ఆంధ్రరాష్ట్రాన్ని ఆదుకొమ్మని జగన్‌కి బాధ్యతలు అప్పజెప్పి పరమాత్మలో లీనమైపోయాడు. అందుకే జగనన్న వైపు నిలబడడం ఇప్పుడు మనందరి విధి. తక్షణ కర్తవ్యం.
- కె.ఆశా, హైదరాబాద్
Share this article :

0 comments: