ఆయనది అవినీతి కాదా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆయనది అవినీతి కాదా ?

ఆయనది అవినీతి కాదా ?

Written By news on Tuesday, April 23, 2013 | 4/23/2013

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. మధిర నియోజకవర్గం వల్లభి గ్రామంలో తనకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు.

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

ఈ ఖమ్మం జిల్లాలోనే ఉన్న బయ్యారం గనులను తవ్వుకునే హక్కును వైఎస్సార్‌గారు రక్షణ స్టీల్స్‌కు ఇవ్వలేదు. బయ్యారం గనులు ఎప్పటికీ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎండీసీకే చెందాలని ఆకాంక్షించారు. ఏపీఎండీసీ లాభాలు చూసుకొని బయ్యారం ఖనిజాన్ని రక్షణ స్టీల్స్‌కు అమ్మాలని, రక్షణ స్టీల్స్ కంపెనీ తెలంగాణ ప్రాంతంలోనే ఉక్కు పరిశ్రమను కట్టించి అందులోనే బయ్యారం ఖనిజాన్ని ఉపయోగించాలని వైఎస్సార్ సంకల్పించారు. ఆమేరకే ఒప్పందం చేశారు. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు, గిరిజనులకు ఉపాధి కల్పించడం కోసం, బయ్యారానికి సమీపంలోని వరంగల్ జిల్లా రాజోలి గ్రామంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలని వైఎస్సార్ సంకల్పించారు. 

బయ్యారం గనులను వైఎస్సార్ ప్రైవేటుపరం చేయబోతే, తాను విశాఖ ఉక్కుకు ఇచ్చానని ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశారు. కిరణ్‌కుమార్ రెడ్డిగారు, తెలుగుదేశం నాయకులారా..! ఒక్కసారి రాజోలి వెళ్లి అక్కడి గిరిజనులను అడగండి. వాళ్లు చెప్తారు.. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రాకపోతే తెలంగాణ ప్రజలకెంత అన్యాయం జరుగుతుందో తెలుస్తుంది. ఇదే చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాల వజ్రాల గనులను ఓ ప్రైవేటు కంపెనీకి కేటాయించారు. అది సక్రమమే అయినప్పుడు వైఎస్సార్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి లాభం వచ్చేలా చేసి తెలంగాణ ప్రాంతంలో ఒక పరిశ్రమ పెట్టేలా చేస్తే అక్రమమెలా అవుతుందని అడుతున్నా.

చంద్రబాబుగారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఐఎంజీ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాలు కేటాయించారు. అప్పుడు దాని విలువ రూ. 2,500 కోట్లు. ఈరోజు దాని విలువ రూ,10 వేల కోట్లు. కానీ.. చంద్రబాబునాయుడు కేవలం రూ.4 కోట్లకు ఆయన బినామీ సంస్థకు కట్టబెట్టారంటే ఆయనది అవినీతి కాదా అని అడుగుతున్నాం. చంద్రబాబునాయుడుగారి అవినీతి ఈ సీబీఐకి కనిపించడంలేదా అని అడుగుతున్నాం. మీకు కనపడదు. ఎందుకంటే చంద్రబాబు, కాంగ్రెస్, సీబీఐ కుమ్మక్కయ్యారు కనుక. వారు ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు.

చైతన్యం రావాల్సింది ఈ ప్రభుత్వంలో..
కరెంటు లేక, నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. వేసిన ప్రతి పంటలో నష్టమొచ్చి రైతులంతా అప్పులపాలై అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ ‘రైతు చైతన్య యాత్రలు’ అంటూ బయల్దేరింది. నిజానికి చైతన్యం కావాల్సింది రైతులు కాదు. ఈ ప్రభుత్వంలో చైతన్యం రావాలి. రైతును ఇంత దుస్థితికి దిగజార్చిన ఈ కాంగ్రెస్ పాలకులు ఈరోజు ఏ మొఖం పెట్టుకోని రైతు చైతన్య యాత్రలని వెళ్తున్నారు? ఈ కాంగ్రెస్ పాలకులకు చెప్తున్నాం.. మీరు రైతు చైతన్య యాత్రలు చేయండి.. కానీ జాగ్రత్త. ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారేమో.. చూడండి.

కృష్ణా జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర
షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం 128వ రోజు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం షేక్ మహ్మద్‌పేట నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి గండ్రాయికి చేరుకుంది. అకాల వర్షానికి తడిసిన మిరపను, రాలిపోయిన మామిడి తోటలను షర్మిల పరిశీలించారు. నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. గండ్రాయి గ్రామంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారు కొరివి సీతమ్మ తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. అక్కడి నుంచి మధిర నియోజకవర్గం వల్లభి గ్రామం ద్వారా షర్మిల ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించారు. 

తెలంగాణ సంప్రదాయక నృత్యం కోలాటం, గిరిజన సంప్రదాయక నృత్యం కొమ్ముడోలు నృత్యంతో అక్కడి ప్రజలు ఆమెకు స్వాగతం పలికారు. వల్లభి శివారులో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 9 గంటలకు చేరుకున్నారు. సోమవారం మొత్తం 13.6 కిలోమీటర్లు నడిచారు. ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సామినేని ఉదయభాను, మచ్చ శ్రీనివాసరావు, వంగవీటి రాధ, రమేష్‌బాబు, ప్రసాదరాజు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మ, గోనె ప్రకాశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, తలశిల రఘురాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చందా లింగయ్య, యడవెల్లి కృష్ణ, గౌతంరెడ్డి, తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.

నాయకుడు ప్రజల నుంచి పుట్టాలి
‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి గారు రాజమండ్రిలో దళితుల కోసం అని ఒక సభ పెట్టి ఆయనకు ఆయనే దళిత బాంధవుడని బిరుదు ఇచ్చుకున్నారట. దళితుల మీద, పేదల మీద ప్రేమ ఉండాలంటే ఆ నాయకుడు ప్రజల నుంచి పుట్టాలి. కానీ ఎవరో ఖాళీ చేసిన కుర్చీ మీద కూర్చున్న ఈ ముఖ్యమంత్రిగారికి దళితుల మీద ప్రేమ ఉందని చెప్తే నమ్మటానికి ప్రజలు అమాయకులు కాదు. మూడేళ్లుగా కిరణ్‌కుమార్‌రెడ్డిగారు సీఎంగా ఉన్నారు. దళితుల మీద ఈ మూడేళ్లలో పుట్టని ప్రేమ ఎన్నికలు వచ్చే వేళ ఈ ఆఖరి సంవత్సరంలో ఎందుకు కలిగిందో చెప్పాలని అడుగుతున్నాం. వైఎస్సార్ దళితులను ప్రేమించి చూపించారు. దళితులకు, గిరిజనులకు 20 లక్షల ఎకరాలు భూమి పంపిణీ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో వైఎస్సార్ తీర్మానం పెట్టారు. 18 లక్షల దళిత కుంటుబాలను వైఎస్సార్ రుణ విముక్తులను చేశారు. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డిగారు ఏమీ చేయకుండానే ఆయనకు ఆయనే బిరుదులు ఇచ్చుకుంటున్నారు. ఆయన్ని చూసి జనం నవ్వక మరేమి చేస్తారు’’ 
- షర్మిల

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
సోమవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 128, కిలోమీటర్లు: 1,730.3
Share this article :

0 comments: