జగన్ ములాఖత్‌లపై అన్నీ అపోహలే: ఆమోస్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ములాఖత్‌లపై అన్నీ అపోహలే: ఆమోస్

జగన్ ములాఖత్‌లపై అన్నీ అపోహలే: ఆమోస్

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌లపై వస్తున్న ఆరోపణలన్నీ అపోహలేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ పేర్కొన్నారు. ములాఖత్‌ల పేరిట ఇష్టమొచ్చినట్లుగా కలిసే అవకాశమే ఉంటే చంచల్‌గూడ జైలులోని టైస్టులు, నక్సలైట్లు అదే పనిచేసే వారు కదా? అని ప్రశ్నించారు. కారాగార వ్యవస్థపై తీసుకురావలసిన వూర్పులపై చర్చించేందుకు గురువారం శాసనసభ అంచనాల కమిటీ సమావేశం జరిపింది. అనంతరం ఆమోస్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో అంచనాల కమిటీ తరపున తాము చంచల్‌గూడ జైలును సందర్శించామన్నారు. అధికారులు, ప్రభుత్వం జైల్లోని జగన్‌కు సహకరిస్తుందన్నట్లుగా కొందరు నేతలు మాట్లాడటం సరికాదన్నారు. జగన్ పార్టీలో చేరేందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, ‘‘జగన్ పార్టీ ఎట్లుంటదో కూడా నాకు తెలవదు. నేను మొదటి నుంచి కాంగ్రెస్‌వాదిని. నిజాలు మాట్లాడుతున్నా’’అని ఆమోస్ అన్నారు.
Share this article :

0 comments: