రానున్నది జగన్ కాలం...జనమే పాలకులయ్యే కాలం! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రానున్నది జగన్ కాలం...జనమే పాలకులయ్యే కాలం!

రానున్నది జగన్ కాలం...జనమే పాలకులయ్యే కాలం!

Written By news on Tuesday, April 23, 2013 | 4/23/2013

బతుకునిచ్చిన దీపం ఆరిపోయింది. బతుకులను బాగు చేయాలనుకుంటున్న దీపాన్ని వెలగనివ్వకూడదు అనుకుంటున్నారు! జైలు ఊచల మధ్య కాలం గడపమని శాసిస్తున్నారు. కానీ గంధపు చెట్టు నుంచి వచ్చేది గంధపు చెక్కే కానీ గంజాయి కాదనే విషయం తెలియనంత మూర్ఖులు ప్రస్తుతం మన ప్రభుత్వాన్ని పాలిస్తున్న నాయకులు. ఎందరో నిరుపేదల, నిర్భాగ్యుల జీవితాల్లో వెలుగు నింపిన మహానేత మన వైయస్ రాజశేఖరరెడ్డిగారు. ఆ మహనీయుడి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి... అవినీతికి, అక్రమాలకు పాల్పడతారని వీరంతా ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెలు ఆగిపోయినవారి కుటుంబాలను ఓదారుస్తానని ఇచ్చినమాటను నిలబెట్టుకున్నందుకే జగన్‌పై కాంగ్రెస్ అధిష్టానం కన్నెర్ర చేసింది.

దాంతో పార్టీని వీడి వైయస్సార్‌సీపీ అనే సరికొత్త పార్టీకి ప్రాణం పోసి ‘వైయస్సార్ స్వర్ణయుగాన్ని’ మళ్లీ తీసుకువద్దామనుకుంటున్న ఆ యువనేతను అర్థం చేసుకోకుండా ఎందుకు ఈ కక్షాపూరిత రాజకీయాలు?! తన చదువు, తెలివి, పెట్టుబడులతో సంపాదించిన ఆస్తిని అన్యాయం, అవినీతి, అక్రమం అని ఆరోపించడాన్ని మించిన అన్యాయం, అక్రమం ఉంటుందా? జైల్లో నిర్బంధించడం అధర్మం. బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవడం అక్రమం. కాని జగన్ ఎల్లకాలం నిర్బంధంలో ఉండిపోరు. ప్రజలే తమ నాయకుడిని విడిపించుకుంటారు. రానున్నది ‘జగన్’ కాలం. అంటే జనం కాలం. జనమే పాలకులయ్యే కాలం. జగన్ పార్టీ గుర్తు అయిన రెక్కల ఫ్యాన్ గాలిలో స్వార్థ నాయకత్వాలు, నీచరాజకీయాలు కొట్టుకుపోతాయి.

- కర్రోతు స్వర్ణకుమారి, పాతబగ్గాం, విజయనగరం 

ఆత్మావలోకనం చేసుకోవాలి!

నాణేనికి ఒకవైపు బొమ్మ, రెండోవైపు బొరుసు ఉంటాయి. ‘సాక్షి’ ఆవిర్భవించేవరకు వై.ఎస్.పైన, ఆయన కుటుంబంపైన ఏకపక్షవార్తలు రాస్తూ, ఆ వార్తలే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చాయి ఆ రెండు ఎల్లో పత్రికలు. అయితే అదృష్టవశాత్తూ ‘సాక్షి’ ఆవిర్భావంతో నాణేనికి రెండో వైపు కూడా ఉంటుందనే సత్యం లక్షలాది పాఠకుల దృష్టికి వచ్చింది. సాక్షి పేపరు గానీ, టీవీ గానీ లేకపోయుంటే ఈ రోజుకీ తెలుగు ప్రజలు ఇంకా ఎల్లో మీడియా రాసే అబద్ధపు ప్రచారాలనే నమ్మే పరిస్థితి వుండేది. 

తాము రాసిన తప్పుడు వార్తల్ని సాక్షి ఎప్పటికప్పుడు నిగ్గు తేల్చుతుంటే తట్టుకోలేక, తమ రంగు బయటపడిపోయిందనే అక్కసుతో... రాసిన విషయాలనే మళ్లీ మళ్లీ మళ్లీ రాస్తూ ఆ రెండు పత్రికలు నైతికంగా బలహీనపడిపోయాయని పాఠకులు ఎప్పుడో గుర్తించారు. అందుకు నిదర్శనం.... రెండు ఎల్లో మీడియాల రీడర్‌షిప్ గణనీయంగా పడిపోవడం! తెలుగు పాఠకులకు విశేషమైన సేవలు అందించిన ఎడిటర్ మహాశయులు ఎందరో ఉన్నారు. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, నీలం రాజు వెంకటశేషయ్య, నార్ల వెంకటేశ్వరరావు వంటి దిగ్గజాలు నడిపిన విలువలతో నడుస్తున్నామా అని ఎల్లో మీడియా ఆత్మావలోకనం చేసుకోవాలి.

ఉదాహరణకు: ఎల్లో చానెల్ ఎం.డి. ప్రతి ఆదివారం తన పరిపూర్ణమైన అజ్ఞానంతో, మూసుకుపోయిన కళ్లతో ‘ఓపెన్ హార్ట్’ అంటూ తానే స్వయంగా నిర్వహించే ప్రోగ్రామ్‌లో ఆ మధ్య తారాచౌదరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా మధ్యమధ్య జగన్‌ను చూపించి చర్చ నడపడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. జగన్‌పై సదరు ఎం.డి.కి ఏ స్థాయిలో అసూయాద్వేషాలు ఉన్నాయో దీన్ని బట్టే అర్థమైపోయింది. అలాంటి వ్యక్తులు నడిపే చానల్‌పైన గానీ, పేపర్‌పైన గానీ విశ్వసనీయత ఏముంటుంది? అందుకే జగన్‌పై ఎల్లో మీడియా చేసే దుష్ర్పచారాన్ని ప్రజలు నమ్మడం లేదు. ఈ వాస్తవాన్ని ఆ రెండు పత్రికలు గమనిస్తే మంచిది.

- యస్.పి.రెడ్డి, విశ్రాంత ఉద్యోగి, ఖమ్మం

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: