అసమర్థ పాలన వల్లే అత్యాచారాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసమర్థ పాలన వల్లే అత్యాచారాలు

అసమర్థ పాలన వల్లే అత్యాచారాలు

Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013

 కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్థత వల్లే మహిళలపై రోజురోజుకూ అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల సమస్యలపై ఏమాత్రం శ్రద్ధ పెట్టడంలేదని దుయ్యబట్టా రు. ఆయన అసమర్థ పాలన వల్లే మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. ఎంత సేపూ తన గద్దెను కాపాడుకోవడంలోనే కిరణ్ తలమునకలై ఉన్నారని మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు నిద్ర లేచినప్పటి నుంచీ నిద్రపోయే వరకూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించే ఆలోచిస్తున్నారు తప్ప మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి పట్టించుకోవడంలేదు. పాలకులు అసమర్థులైనపుడే నేరస్థులకు భయం తగ్గుతుంది. అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయి. తామేం చేసినా శిక్షలు పడడంలేదని చెలరేగిపోతున్నారు’’ అని రోజా నిప్పులు చెరిగారు. ఢిల్లీలో నిర్భయ ఉదంతం తర్వాత కఠిన చట్టాలు తెచ్చినా ఐదేళ్ల అభంశుభం తెలియని బాలికపై అత్యాచారం జరిగిందంటే ఆ వైఫల్యం ఎవరిదని ఆమె ప్రశ్నించారు. అసలు ఆ చట్టాల్లో బల మే లేద నేది స్పష్టమవుతోందన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై చర్చించి నివారణకు చర్యలు చేపట్టడానికి తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చాలని రోజా డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: