చీకటిని చీల్చుకుంటూ సూర్యుడొస్తాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చీకటిని చీల్చుకుంటూ సూర్యుడొస్తాడు

చీకటిని చీల్చుకుంటూ సూర్యుడొస్తాడు

Written By news on Saturday, April 27, 2013 | 4/27/2013

ఇది నేను ఒక్కడిని మాత్రమే రాస్తున్న ఉత్తరం కాదు. రాష్ట్రంలో ఉన్న కొన్ని కోట్లమంది ప్రజల మనసులోని మాట. ఏదో అభిమానంతో రాయడం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి, రాజకీయ నాయకుల్లో మానవత్వం అనేవి ఆ రారాజు రాజశేఖరుడితోనే పోయాయనే బాధతో రాస్తున్నా. 

అవి చంద్రబాబు నాయుడుగారు పరిపాలించే రోజులు... మానాన్న పెద్ద వ్యవసాయదారుడు. కానీ ఆ పాలనలో పంటలు కాదు కదా, తినే తిండికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అదే సమయంలో కరెంటు బిల్లులనీ, బ్యాంకు రుణాలని కరెంటోళ్ళు, బ్యాంకులోళ్లు ఇళ్ల మీద పడి ఇంటి తలుపులు, బిందెలు, గిన్నెలు... ఏవి కనిపిస్తే అవి లాక్కెళుతున్నారు. ఇంట్లో మనుషులుంటే పరువు తీసినట్టుగా మాట్లాడుతున్నారు. మా నాన్న, మేము కనిపించకుండా బావిలోకి దిగి దాక్కున్నాం. అప్పుడు నాకు అనిపించింది రజాకారుల రోజుల్లో ఇలాగే ఉండేదేమో అని.

అయితే ఎప్పుడూ చీకటే ఉండదు. దానిని చీల్చుకుంటూ సూర్యుడు వస్తాడు. అలాగే వచ్చాడు. రాజాధిరాజు రాజశేఖరుడొచ్చాడు. మంచినాయకుడి కోసం చూస్తుంటే మనసున్న మంచి నాయకుడొచ్చాడు. మా లాంటి కొన్ని లక్షల కుటుంబాలని రుణ విముక్తుల్ని చేశాడు. కాని ఆయన పాలనలో ఆనందంగా ఉన్న ప్రజలను చూసిన దేవుడు... చివరికి వీళ్లు తనను కూడా మరిచేలా ఉన్నారే అనుకున్నాడో ఏమో, లేదా ఎవరు ఏ కుట్రలు పన్నారో గానీ 2009 సెప్టెంబరు 2 న తేదీనసూర్యుడు అస్తమించాడు. 

ఓదార్పు యాత్రను చూసి ‘పులి కడుపున పులి పుట్టిందిరా, మళ్లీ మన భరతం పడుతుందిరా’ అనుకున్న సోనియా గాంధీ, అమె తొత్తులు అందరూ కలిసి, అంతటి ప్రజాదరణను చూసి ఓర్వలేక జగన్‌ను జైలుకు పంపి రాష్ట్ర ప్రజలకు మళ్లీ చంద్రబాబు హయాం నాటి కటిక చీకటిని తెచ్చిపెట్టారు. ఒక్క వ్యక్తిని ప్రజలకు దూరం చేయడానికి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తితో సహా రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం, కొన్ని దర్యాప్తు సంస్థలు... అన్నీ కలిసి దేని పాత్రను అది పోషిస్తూ ప్రయాసపడడం బహుశా ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. కానీ, ఆ మూర్ఖులకు తెలియదు... పడిన సముద్ర కెరటం పడినట్లుగానే ఉండదనీ, అది ఉవ్వెత్తున పైకి లేస్తే దాన్ని చూస్తూ నవ్వుకుంటున్న వారందరూ కనుమరుగై పోతారనీ, మళ్లీ చీకటిని చీల్చుకుంటూ సూర్యుడొస్తాడనీ, ప్రజాభీష్టం నెరవేరుతుందనీ, ప్రజల హృదయాలలో ఉన్న యవనేత జగనే వారి నాయకుడిగా ఆవిర్భవిస్తాడనీ.

విజయమ్మగారూ... మీరు మీ కొడుకు కోసం, భారతిగారూ... మీరు మీ భర్తకోసం, షర్మిలమ్మా... మీరు మీ సోదరుడి కోసం ఎదురు చూస్తున్నారేమో కానీ... రాష్ట్రంలో బడుగు, బలహీన, మధ్య తరగతి కుటుంబాల నుండి కొన్ని కోట్ల మంది జనం రాజన్న పాలను కొనసాగించే నాయకుడైన జగనన్న కోసం ఎదురుచూస్తున్నారు. మా నిరీక్షణ త్వరగా ఫలించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.

- మహేశ్, వరంగల్ 

చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: