'బెజవాడకు లగడపాటి చేసిందేమీలేదు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'బెజవాడకు లగడపాటి చేసిందేమీలేదు'

'బెజవాడకు లగడపాటి చేసిందేమీలేదు'

Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013

ప్రకాశం బ్యారేజీ గేట్ల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధ, పడమటి సురేష్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరి స్వార్థం కోసం ప్రకాశం బ్యారేజీ గేట్లను పెంచారని వంగవీటి రాధ శనివారమిక్కడ ప్రశ్నించారు. రైతుల కోసం గేట్లను పెంచమన్నప్పుడు కుదరదన్న అధికారులు ఇప్పుడు... లగడపాటి రాజగోపాల్ ల్యాంకో అవసరాల కోసం ఎలా పెంచారని మండిపడ్డారు. ఎంపీగా లగడపాటి రెండుసార్లు గెలిచినా బెజవాడ ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకు వెళతామని రాధా తెలిపారు.
Share this article :

0 comments: