పేదవాడి గడప తొక్కడమే.... ఈ కడప బిడ్డ చేసిన నేరమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదవాడి గడప తొక్కడమే.... ఈ కడప బిడ్డ చేసిన నేరమా?

పేదవాడి గడప తొక్కడమే.... ఈ కడప బిడ్డ చేసిన నేరమా?

Written By news on Saturday, April 13, 2013 | 4/13/2013

తండ్రి చనిపోయిన బాధలో ఉన్నా, తండ్రి కోసం చనిపోయిన కుటుంబాల్ని పరామర్శించేందుకు, ఆ బడుగుజీవులకు నేనున్నానంటూ ధైర్యం చెప్పేందుకు పేదవాడి గడప తొక్కడమే ఈ కడప బిడ్డ చేసిన నేరమా! అందుకే కదా ఈ శిక్ష.
ఏది ఏమైనా, నమ్మిన సిద్ధాంతం కోసం... ఇచ్చిన మాట తప్పలేక, తలవంచలేక, మడమ తిప్పలేక జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. ఇవన్నీ నా కెందుకులే అనుకుని ఉంటే పదవులు దక్కేవే కదా. కానీ అన్నింటినీ త్యజించి పూలబాట నుండి ముళ్ళబాట వైపు పయనించేందుకు, చరిత్ర తిరగరాసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన జగన్మోహనుని యావత్ ఆంధ్రరాష్ట్రం అభినందిస్తోంది. శిరస్సు వంచి సలాం చేస్తోంది. 

ప్రజాస్వామ్య దేశంలో ప్రజలెన్నుకున్న వాడే నాయకుడు, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నవాడే నాయకుడు. ప్రజల మనసు దోచినవాడే అధినాయకుడు. అటువంటి నాయకుడు జగన్ వచ్చాడని ప్రజలంతా సంబరపడుతున్నారు. మా యువనేతా.. కష్టనష్టాలెన్ని ఎదురైనా దరిచేరే వరకు పోరాటాన్ని విడువకు. ప్రజలంతా నీ వెంటే. మంత్రులైతేనేమి, మంత్రాంగం నడిపేవారైతేనేమి ఎందరో కలిసికట్టుగా కుట్ర పన్నినా, ఎన్ని కుతంత్రాలు, వెన్నుపోట్లు ఎదురైనా విజయం నీదే. ఢంకా బజాయించడం ఖాయం. ఎండనక వాననక, పగలనక రేయనక, తిండనక నిద్రనక, కష్టపడ్డ నీ వెంటే జనమంతా. రాజు వెంట ఉన్న జనం యువరాజుని కూడా ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆశీర్వదిస్తారు.

- డాక్టర్ కె. గౌతమ్ నాగిరెడ్డి, మార్కాపురం, ప్రకాశంజిల్లా

జగన్ బయటికి వస్తేనే రాష్ట్రానికి వెలుగు

రాజకీయాలంటే నాకు సదభిప్రాయం లేదు. అవకాశవాదులు, స్వార్థమే పరమావధిగా భావించేవారు ప్రజాసేవకులుగా ముసుగు వేసుకుని రాజకీయనాయకులుగా అవతారం ఎత్తుతారని నా నమ్మకం. కానీ, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నా అభిప్రాయంలో మార్పు వచ్చింది. రాజకీయ నాయకులపై ఉన్న తేలిక భావం పూర్తిగా సడలింది. ఆయన తనయుడు జగన్మోహనరెడ్డిని చూసిన తర్వాతైతే లీడర్ అంటే ఇలా ఉండాలనిపించింది. కారణం... జగన్ అహర్నిశలు ప్రజల కోసమే శ్రమించారు. అరెస్టు అయ్యేవరకు ప్రజల మధ్యలోనే ఉన్నారు. నేను విశ్రాంత ఉపాధ్యాయుడిని. రాజశేఖరరెడ్డిరైతులకు ప్రాణం పోసేందుకు ప్రారంభించిన జలయజ్ఞం కార్యక్రమానికి ఆకర్షితుడనై 2005 నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రతినెలా రెండు వందల రూపాయలు పంపిస్తున్నాను. 

కానీ చంద్రబాబునాయుడి దుష్టపాలన తర్వాత, ప్రజలకు మేలు జరుగుతున్న సమయంలో రాజశేఖరరెడ్డి అకాల మరణంతో మళ్లీ చీకటిరాజ్యం అయిపోయింది మన రాష్ట్రం. ఇప్పుడు ఆ చీకటి తొలగిపోవాలంటే జగన్ ముఖ్యమంత్రిగా రావాలి. ఆయన కార్యదీక్ష, ఆయనకున్నంత మనోనిబ్బరం ఏ నాయకుడిలోనూ కనిపించవు. పది నెలలుగా జైల్లో ఉన్నా ఆయన చిరునవ్వు చెక్కుచెదరలేదు. అందుకే ఆయన్ని ఎంత అభినందించినా తక్కువే. జగన్ త్వరగా బయటికి రావాలి. పేదల కష్టాలు తొలగిపోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ప్రజారాష్ట్రంగా గుర్తింపుపొందాలి. 

- బదరీనారాయణ, రాయదుర్గం, అనంతపురం
Share this article :

0 comments: