దోషులంతా బయట ఉన్నారు నిర్దోషి మాత్రం నిర్బంధంలో ఉన్నాడు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దోషులంతా బయట ఉన్నారు నిర్దోషి మాత్రం నిర్బంధంలో ఉన్నాడు!

దోషులంతా బయట ఉన్నారు నిర్దోషి మాత్రం నిర్బంధంలో ఉన్నాడు!

Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013


జగన్ ముక్కుసూటిగా వెళ్లే మనిషి. ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలియవు. ‘హి ఈజ్ వెరీ మచ్ ఓపెన్ మైండెడ్’. ఒకవైపు తన కంపెనీల మీద, తన ఇంట్లో దాడులు జరుగుతున్నా చెక్కుచెద రని ధైర్యంతో తన ఓదార్పు యాత్రను కొనసాగించారు. తప్పు చేసిన వాళ్లు తప్పకుండా భయపడి పారిపోతారు. కాని జగన్ ఎక్కడా కూడ భయడపడకుండా తన ఓదార్పు యాత్రను కొనసాగిస్తూ మరోవైపు సీబీఐకి సహకరించారు. ఇక్కడే తెలుస్తుంది. ఆయన ఏ తప్పూ చేయలేదని.

అయినా సరే ఈ లోకంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, వేధింపులు, అవమానాలు ఉన్నాయో అవన్నీ జగన్‌గారి మీద ప్రయోగించారు. ఎన్ని మాటల తూటాలు పేల్చారో కూడా జనం మర్చిపోలేదు. పెద్ద మనుషులు అనబడే వ్యక్తులా ఇలాగేనా మాట్లాడేది.? కేవలం జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, ఆయన్ని అణచివేయాలనే అసూయ ద్వేషాలతో అక్రమంగా జైలులో పెట్టారని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. జగన్ అంత బాధలో కూడ చిరునవ్వు చిందిస్తూ వుంటారు. ఆ చిరునవ్వును కూడ హేళనచేసి మాట్లాడారు. దీన్ని బట్టి వారికి ఎంత కక్ష ఉందో ఇట్టే అర్థమవుతుంది. అలాంటి వాళ్లు నవ్వరు. ఇతరులు నవ్వినా ఓర్చుకోలేరు.

సమాజానికి మంచిచేసే వాళ్లను చేయనివ్వాలి. జనంలోకి వెళ్లే వాళ్లను వెళ్లనివ్వాలి. అంతేగాని అడ్డుకొని ఇబ్బందులు పెట్టినంత మాత్రాన జనం గుండెల్లో నుండి అభిమానాన్ని ఎవరూ దూరం చేయలేరు. చాలామంది వృద్ధులు కూడా అనటం విన్నాను. ఏమని అంటే ‘‘మేం పుట్టి పెరిగాక, మా అనుభవంలో ఇలా ఒక వ్యక్తిని వేధించటం, హింసించటం, ఇబ్బంది పెట్టడం ఇంతవరకూ చూడలేదు’’ అని. నిజంగా జగన్‌కు జరిగిన అన్యాయానికి మాకు చాలా బాధగా ఉంది. ఇంత నిరంకుశత్వమా? జనం మనసులో ఉన్న అభిమానాన్ని అరెస్ట్ చెయ్యగలరా? జగన్‌ని ఎంతగా అణగదొక్కాలని ప్రయత్నిస్తే భగవంతుడు అతడిని అంతగా పెకైత్తుతాడు అని పాలక, ప్రతిపక్ష దుష్టకూటములన్నీ గ్రహించాలి.

- క్లెమెన్స్, హైదరాబాద్

దోషులంతా బయట ఉన్నారు నిర్దోషి మాత్రం నిర్బంధంలో ఉన్నాడు!

జగన్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, ప్రతిపక్షాలు, వైయస్సార్‌కి మిత్రులనుకున్నవారు కూడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. తనని కాదన్న వాళ్లను, తనకంటే ప్రజాభిమానం ఎక్కువగా ఉన్న వాళ్లను కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ... సీబీఐ, ఏసీబీ, ఈడీ, ఐటీ లాంటి సంస్థల ద్వారా అణగదొక్కాలనే ఒక దుస్సంప్రదాయానికి తెర తీశారు. ఇలాంటి సంప్రదాయం చివరికి తన కొంపే ముంచుతుందన్న వాస్తవం బహుశ ఆమెకు 2014 ఎన్నికల తర్వాత కానీ తెలిసిరాదు.

షేరు ధర ఎక్కువ చేసి చూపించాడు కనుక జగన్ మోసం చేశాడు అని సీబీఐ వాళ్లు పదే పదే చెపుతున్నారు. మరి ఇంతవరకు ఎవరైనా జగన్ వల్ల మోసపోయాం అని పోలీసు రిపోర్టు ఇవ్వడం కానీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించటం కానీ చేయలేదే! అలాగే షేరు ధర పెంచి అమ్మిన రామోజీరావు కూడా మోసం చేసినట్లే కదా. ఈ విషయం న్యాయస్థానాలకు, సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలవంటి ఉద్దండులకు అర్థం కాలేదంటే అర్థం ఏమిటి? ఎన్ని కోట్లు సంపాదించకపోతే ఒక విలేఖరి పత్రికా యజమాని అవుతాడు? ప్రజలలో ఎవరన్నా అలాగే పత్రిక పెడితే ఐటీ, ఈడీ అధికారులు ఊరుకుంటారా? తోకపత్రికలు, తోక ఛానల్స్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్లని ఆరా తీయవలసిన బాధ్యత ఈ దర్యాప్తు సంస్థల మీద లేదా? ఇప్పుడు కొత్తగా ఇన్‌కంటాక్స్ వాళ్లు ‘మాకు అన్ని విషయాలు తెలుసు.

మీరు టాక్స్ కట్టకపోతే మేమే నోటీసు ఇస్తాం’ అని టీవీలలో చెపుతున్నారు. మరి వాళ్లకు ఈ ‘తోక’ విషయాలు తెలిసే వుండాలి కదా! తెలిసీ ఊరుకున్నారా? ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని పెద్దలు, రాజకీయ నాయకులు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా ఏమిటి ప్రయోజనం? ప్రభూ! వీరి బుద్ధిని సవ్యంగా మార్చు.

- వి.వి. జె ప్రసాద్, దినకర్‌నగర్, వెస్ట్ వెంకటాపురం, అల్వాల్
Share this article :

0 comments: