బాబు-సీబీఐ బంధమే ఆశ్చర్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు-సీబీఐ బంధమే ఆశ్చర్యం

బాబు-సీబీఐ బంధమే ఆశ్చర్యం

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించేదేంటంటే... ఇంత రంధ్రాన్వేషణ చేస్తున్న సీబీఐకి... కృష్ణబిలాలను కూడా తలదన్నే బాబు అవినీతి గోతులు కనిపించకపోవటం. ఎమ్మార్ వ్యవహారాన్ని తీసుకున్నా, బోగస్ కంపెనీల పుట్ట అయిన ఐఎంజీ భారతను చూసినా ఫోర్ ట్వంటీ వ్యవహారాలన్నీ వాటిముందు బలాదూరే అనిపిస్తాయి. అప్పట్లోనే ఎకరా రూ.4 కోట్ల విలువ చేసే భూమిని, హైదరాబాద్ నగరం నడిబొడ్డున కేవలం ఎకరా రూ.29 లక్షల చొప్పున చంద్రబాబు కట్టబెట్టేయటం నేటికీ సీబీఐకి తప్పనిపించలేదు. పెపైచ్చు ఈ కేసులో చాలా చిల్లర కోణాల్ని శోధించి ఛేదించినట్టు చెప్పింది కానీ... టోకున 500 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టేసిన పద్ధతిని 
మాత్రం తప్పుబట్టలేదు. అది కూడా ఏ ఫ్యాక్టరీకో, వేలమందికి ఉద్యోగాలిచ్చే కంపెనీకో కాదు. ప్రజోపయోగమైన వేరొక పనికి కూడా కాదు. ఆయన కేటాయించినదల్లా శ్రీమంతులకు విల్లాల కోసం అమ్ముకోవటానికి, ఆ శ్రీమంతులు ఖుషీగా ఆడుకోవటానికి గోల్ఫ్ కోర్స్ కట్టడానికి!! మరి ఇంత దారుణానికి చంద్రబాబు ఒడిగడితే సీబీఐ ఆయన వైపు కన్నెత్తి చూడకపోవటాన్ని ఏ జన్మ బంధంగా భావించాలన్నది మానవ మాత్రులెవరికీ అర్థం కాదు. 

అంతకన్నా దారుణం ఐఎంజీ వ్యవహారం. ఐఎంజీ భారత అనే బోగస్ కంపెనీని తన బినామీలతో తనే ఏర్పాటు చేయించి... నగరం నడిబొడ్డున ఏ కేబినెట్ అనుమతీ లేకుండా 850 ఎకరాలు పప్పుబెల్లాల మాదిరిగా కట్టబెట్టేసిన తీరు నభూతో నభవిష్యతి. అంటే గతంలో లేదు... ఇక రాదు అన్నమాట. అసలు ఆ బోగస్ సంస్థతో తమకెలాంటి సంబంధమూ లేదని... దాని మాతృసంస్థగా వర్ణించిన ఐంఎజీ ఫ్లోరిడా చెప్పినప్పటికీ... ఇలాంటి బోగస్ సంస్థకు చంద్రబాబునాయుడు ఎకరా 50 వేల రూపాయల చొప్పున 850 ఎకరాలు ధారాదత్తం చేయటాన్ని సీబీఐ లైట్ తీసుకుంది. పెపైచ్చు దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే... ఇంత చిన్న విషయాన్ని దర్యాప్తు చేయటానికి తమవద్ద తగిన సిబ్బంది లేరని లిఖితపూర్వకంగా చెప్పి మరీ దులిపేసుకుంది. ఈ అధికారులనెలా అర్థం చేసుకోవాలి? రాజకీయాలనే కాక వ్యవస్థలను కూడా చంద్రబాబునాయుడు మేనేజ్ చేస్తారని దీన్నిబట్టి తెలియటం లేదా? ఈ నిజాలను దర్యాప్తు అధికారులు పట్టించుకునేదెప్పుడు?
Share this article :

0 comments: