కిరణ్ దళిత రాబందు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిరణ్ దళిత రాబందు

కిరణ్ దళిత రాబందు

Written By news on Tuesday, April 23, 2013 | 4/23/2013

దళితులకు మేలు జరిగింది వైఎస్ హయాంలోనే..

 ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి దళిత రాబందు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. దళితులకు ఏం చేశారని కిరణ్‌కు దళిత బంధు బిరుదు ప్రదానం చేశారని ప్రశ్నించారు. కిరణ్ పాలనలో దళిత బాలికలు, విద్యార్థులు ఫీజులు కట్టడానికి డబ్బు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దళిత స్త్రీలు హత్యలకు గురవుతున్నారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా దళితుల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారని, కిరణ్ సర్కారు చేసిందేమీ లేదని విమర్శించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తన రాజకీయ జీవితం మొత్తంలో ఎస్సీ, ఎస్టీలకు చేసిందేమీ లేదన్నారు. కిరణ్‌ను దళిత బంధు అంటున్నారంటే మరి ఆ వర్గాలు దేవుళ్లుగా భావించే అంబేద్కర్, బాబూ జగ్‌జీవన్‌రామ్ ఏమవుతారని సూర్యప్రకాశ్ ప్రశ్నించారు. 

అమలాపురం ఎంపీ హర్షకుమార్ తనకు కోపం వచ్చినప్పుడల్లా అంబేద్కర్ విగ్రహాలను పగులగొట్టించి కాలువల్లో పడవే యిస్తారని, కులాల మధ్య చిచ్చు రేపుతుంటారని.. అలాంటి వ్యక్తా ముఖ్యమంత్రికి దళిత బంధు బిరుదు ఇచ్చేదని ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలోని లక్ష్మీపేటలో దళితులను ఊచకోత కోసిన ఉదంతంలో వారికి ఏమాత్రం న్యాయం చేయలేకపోయిన దళిత మంత్రి కొండ్రు మురళీమోహన్ ఈ బిరుదు ప్రదానంలో భాగస్వామి కావడం విడ్డూరంగా ఉందన్నారు. దళిత శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న మరో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఎస్సీలకు శిరోముండనం చేయించి వారిని అవమాన పరిచిన ఘనత గలవారని సూర్యప్రకాశ్ చెప్పారు. ఎస్సీలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే విషయం తెలుసుకుని వారిని ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఈ సభ నిర్వహించిందే తప్ప వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో కాదని ఆయన విమర్శించారు. 

సబ్‌ప్లాన్ కొత్తదేమీ కాదు: రాజేష్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ‘దళిత రాబందు’ బిరుదుతో సత్కరిస్తే బాగుండేదని చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరిట కోరల్లేని చట్టం తెచ్చి సొంత పార్టీ నేతలతో సన్మానాలు చేయించుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సబ్‌ప్లాన్ కొత్తదేమీ కాదు. 1972-75 కాలంలోనే అప్పటి ప్రభుత్వాలు వీటిని అమల్లోకి తెచ్చాయి. అయినప్పటికీ అదేదో తమ ఘనతే అన్నట్లుగా చట్టం తెచ్చి సొంత పార్టీ నేతలతో, సబ్ ప్లాన్ నిధులతో మీటింగ్‌లు పెట్టుకుంటూ సీఎం సన్మానం చేయించుకుంటున్నారు’’అని విమర్శించారు. ఈ అంశంపై పత్రికల్లో ఇచ్చే ప్రకటనలకు అయ్యే మొత్తాన్ని కూడా సబ్‌ప్లాన్ నిధుల నుంచే విడుదల చేస్తున్నారని చెప్పారు. 
Share this article :

0 comments: