రాష్ట్రంలో జగనే నంబర్ వన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో జగనే నంబర్ వన్

రాష్ట్రంలో జగనే నంబర్ వన్

Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013

రాష్ట్రంలో వివిధ రంగాల నుంచి పది మంది శక్తిమంతుల జాబితా 
అగ్రస్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ 
రెండో స్థానంలో కేసీఆర్.. మూడో స్థానంలో దినేశ్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అప్రతిహత ప్రభావశీల వ్యక్తుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారని ప్రముఖ జాతీయ రాజకీయ వారపత్రిక ‘ఇండియా టుడే’ వెల్లడించింది. పత్రిక తాజా సంచికలో (30 ఏప్రిల్ 2013) రాష్ట్రం నుంచి పది మంది అప్రతిహత ప్రభావశీల వ్యక్తులను ఎంపిక చేసింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించినట్లు ‘ఇండియా టుడే’ పేర్కొంది. ప్రాంతీయ స్థాయిలో తమదైన ముద్ర వేసుకున్న తొలి పది మందిలో జగన్ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఉన్నట్లు ‘ఇండియా టుడే’ పేర్కొంది. జాబితాలో మూడో స్థానంలో రాష్ట్ర డీజీపీ వి.దినేశ్‌రెడ్డి నిలవటం విశేషం. 

వైఎస్ అసలైన వారసుడు... 

జగన్ జైలులో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు బలమైన సవాలుగా మారటం.. ఎమ్మెల్యేలు, నేతలు ఆయనను కలిసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించటం.. జగన్‌ను జైలులో పెట్టిన తీరు అక్రమమని ఆయన పార్టీ ఆధ్వర్యంలో కోటీ 56 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించటం.. తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ వారసత్వానికి అసలైన వారసుడినని బలంగా చాటటమే కాకుండా.. తండ్రి కలల ఎజెండాను పూర్తి చేయటం వంటి కోణాల్లో జగన్ శక్తిసామర్థ్యాలను ‘ఇండియా టుడే’ విశ్లేషించింది. 

రాష్ట్రంలో పది మంది శక్తిమంతులు వీరే... 

‘ఇండియా టుడే’ జాబితాలో జగన్ తర్వాత రెండో స్థానంలో కె. చంద్రశేఖర్‌రావు (టీఆర్‌ఎస్), వి.దినేశ్‌రెడ్డి (డీజీపీ), జి.వి.ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్), బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి (ఇన్ఫోటెక్), సి.పార్థసారథి (కార్వీ), మండలి బుద్ధప్రసాద్ (అధికార భాషా సంఘం), డాక్టర్ జి.సురేందర్‌రావు (యశోద హాస్పిటల్స్), ఘట్టమనేని మహేశ్‌బాబు (సినీ నటుడు), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్)లు రాష్ట్రం నుంచి శక్తి సంపన్నుల జాబితాలో చోటు లభించింది. 

విజేతలకు ఎన్నో అవరోధాలు ఎదురుకావచ్చు... 

‘‘అసాధారణ కృషికి తోడు సమకాలికుల్లో అత్యధికులను ప్రభావితం చేయగలిగిన వారే ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు. విజేతలెప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. వారు విజేతలుగా మారే క్రమంలో ఎన్నైనా అవరోధాలు ఎదురుకావచ్చు. కానీ.. చివరకు అవన్నీ వారి ధాటికి తునాతునకలు కావలసిందే. విజేతలెప్పుడూ విజయం గురించి ఆలోచించరు. ఎందుకంటే.. వారు చేపట్టే పనులన్నీ కూడా విజయమే తుది లక్ష్యంగా ఉంటుంటాయి. తోటివారి అవసరాలనూ, ఆకాంక్షలనూ, ఆవేదనలనూ అర్థం చేసుకోవటమే కాకుండా నిజాయితీతో అందుకు అనుగుణంగా ప్రతిస్పందించగల వ్యక్తులు ప్రత్యేక ప్రయత్నమేదీ అవసరం లేకుండానే చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయగల శక్తిని సంతరించుకుంటారు. ఆ క్రమంలో వారు మిగిలిన వారితో పోలిస్తే శక్తిమంతులుగా ఆవిర్భవిస్తారు. గడచిన ఏడాది కాలంలో రాష్ట్రంలోని రాజకీయ, పారిశ్రామిక, వినోద, సాంస్కృతిక రంగాలన్నింటిలోనూ చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే.. విజేతల గురించి చెప్పిన పై మాటలన్నీ అక్షర సత్యాలుగా కళ్లముందు నిలుస్తాయి. ఎందుకంటే ముందు వరుసలో నిలిచిన వారంతా కూడా తమ రంగాల్లో విశేష కృషి చేసిన వారే’’ అని ‘ఇండియా టుడే’ ఈ జాబితా ఎంపిక గురించి వివరించింది. 
Share this article :

0 comments: