జగన్‌ని, ప్రజల్ని జైలు గోడలు వేరుచేయలేవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ని, ప్రజల్ని జైలు గోడలు వేరుచేయలేవు

జగన్‌ని, ప్రజల్ని జైలు గోడలు వేరుచేయలేవు

Written By news on Friday, April 12, 2013 | 4/12/2013

యువనేత జగన్‌మోహన్‌రెడ్డిగారికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుగు ప్రజలందరికీ జరుగుతున్న అన్యాయంగా నేను భావిస్తున్నాను. రాజశేఖరరెడ్డిగారు ఈ లోకం విడిచివె ళ్లినప్పుడు చాలా బాధ అనిపించింది. ఆయన మరణం రాష్ట్రానికీ, రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని అంతా అనుకుంటున్న సమయంలో ఆ లోటును భర్తీ చెయ్యడానికా అన్నట్లు ఆయన తనయుడు జగన్ ప్రజల్లోకి వచ్చారు. ‘‘మీకు అండగా ఉంటాను’’ అని భరోసా ఇచ్చారు. ‘‘నాకు మానాన్నగారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తాను’’ అని నల్లకాల్వలో ఇచ్చిన మాట ప్రకారం జగన్‌గారు ప్రజల్లోకి వచ్చినప్పుడు, ఓదార్పుయాత్రలో ప్రతిచోటా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టడం చూసినప్పుడు పర్వాలేదు, రాష్ట్రానికి జగన్ అనే పెద్ద దిక్కు ఉంది అని సంతోషపడ్డాం. 

అయితే ఓదార్పుయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేని కాంగ్రెస్ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కుమ్మకై జగన్‌గారిని ఇబ్బంది పెట్టడం నాకు చాలా బాధను కలిగిస్తోంది. ఎలాగైనా జగన్‌ని అణచివేయాలన్న దుష్టసంకల్పంతో ఓదార్పుయాత్రను అడ్డుకొని, ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టడం కుటిల రాజకీయాలకు పరాకాష్ట. అక్కడితో ఆగారా అంటే లేదు. కాంగెస్ అధిష్టానం, చంద్రబాబు నాయుడు వ్యూహం పన్ని జగన్ కంపెనీపై, సాక్షి కార్యాలయంపై దాడులు జరిపించారు. జగన్‌ని అరెస్టు చేయించి, బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇలా ఎన్ని వేధింపులకు గురిచేసినా జగన్ ధైర్యంగా నిబ్బరంగా నిలబడడం చూస్తుంటే మనకొక మంచి నాయకుడు దొరికాడు అనే ధైర్యం కలుగుతోంది. 

గత పదినెలల్లో మేము ఒక్క పండుగ కూడా జరుపుకోలేదు. అన్ని పండగలను కలిపి ఒకేరోజు... జగన్‌గారు బైటికి వచ్చిన రోజు జరుపుకుంటాము. జగన్‌గారు ప్రజలకోసం నిరంతరం పోరాడుతూ రైతుదీక్ష, జలదీక్ష, ఫీజు పోరు దీక్ష, హరితయాత్ర చేసి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచారు. మా నుంచి ఆయన్ని ఏ జైలూ వేరు చేయలేరు. జగన్ వెంట మేము, మా వెంట జగన్ ఉంటాడు. జగన్ గారు జైలు నుండి ఎప్పుడొస్తారా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే ఆయన బయటికి వచ్చి ప్రజల సమస్యలు తీర్చాలని మా ఆశ, ఆకాంక్ష. ఇక ‘వస్తున్నా మీకోసం’ అంటూ బయల్దేరిన చంద్రబాబు నాయుడు గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అతడిని ప్రజలు ఎట్టి పరిస్థితులలో నమ్మరు కాక నమ్మరు. 

- రామకృష్ణారెడ్డి, కనిగిరి, ప్రకాశం జిల్లా

**********

నిన్నటితో సహా గత పదినెలల్లో మేము ఒక్క పండుగ కూడా జరుపుకోలేదు. అన్ని పండగలను కలిపి ఒకేరోజు... జగన్‌గారు బైటికి వచ్చిన రోజు జరుపుకుంటాము. జగన్‌గారు ప్రజలకోసం నిరంతరం పోరాడుతూ రైతుదీక్ష, జలదీక్ష, ఫీజు పోరు దీక్ష, హరితయాత్ర చేసి ప్రజల గుండెల్లో నిలిచారు. మా నుంచి ఆయన్ని ఏ జైలూ వేరు చేయలేరు. 

తండ్రి లేని లోటును తనయుడొక్కడే తీర్చగలడు

నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహించేటపుడు గ్రామస్థులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని అభిలాషతో, వారితో సన్నిహితంగా మెలిగేవాడిని. ఒకరోజు ఒక వ్యక్తిని కలిసినప్పుడు ‘‘చాలా రోజులైంది చూసి, బాగున్నావా’ అని అడిగాను. కొంత సంభాషణ తర్వాత ఆయన తన చొక్కా గుండీలు విప్పి, తన ఛాతీని చూపిస్తూ తనకు జరిగిన శస్త్ర చికిత్స గురించి చెప్పాడు. ‘‘సార్ నేను ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకొనే స్తోమత ఉన్నవాణ్ణి కాదు. కానీ ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ పథకంతో నాలాంటి పేదవారికి పెద్ద ఆస్పత్రిలో ఖరీదైన వైద్యం ఇప్పించింది. 

ఈ పథకమే లేకుంటే నేను ఈరోజు మీకు కనిపించేవాడినే కాదు’’ అంటూ రెండు చేతులు జోడించి, ఆకాశం వైపు చూపిస్తూ ‘‘ రాజశేఖరరెడ్డిలాంటి ముఖ్యమంత్రి ఉంటే నాలాంటి పేదవారికి కొండంత ధైర్యం’’ అని అన్నాడు. మాట్లాడుతున్నంత సేపు నేను ఆయన ముఖంలో వెలుగు చూశాను. ప్రజల్లో ఆ పథకం పట్ల ఎంత సంతృప్తికరమైన భావన ఉందో అర్థమైంది. ప్రస్తుతం ఆ పథకాన్ని నీరు కారుస్తున్నారు. పథకంలో కవర్ అయ్యే వ్యాధుల సంఖ్య తగ్గించారు. ఎన్నో ఆంక్షలు విధిస్తున్నారు. చివరికి ఆరోగ్యశ్రీని రద్దు చేసే దుస్థితి కూడా ఈ రాష్ట్రానికి దాపురించింది. నెలకు కచ్చితంగా జీతం పొందే వ్యవస్థీకృత రంగంలోని ప్రభుత్వ ఉద్యోగులే... ఉచిత వైద్యసదుపాయం కావాలని. 

సంవత్సరానికి కుటుంబానికి 5 లక్షలు కేటాయించాలని కోరుతూ కోరుతూ విజ్ఞప్తులు చేస్తున్నప్పుడు... పేదలకు ఉపయోగపడే ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని రద్దు చేయబోవడం ఎంత వరకు సబబు? ప్రజలందరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే రాజశేఖరెడ్డిగారి ఆశయాన్ని పూర్తిగా కొనసాగించగల నాయకుడు జగన్ ఒక్కరే. ఆయన రాక కోసం, ఆయన్ని ముఖ్యమంత్రి పదవిలో చూడడం కోసం ఎదురు చూసే ప్రజలలో నేనూ ఒకడిని. 

- షణ్ముఖ రెడ్డి, అనంతపురం
Share this article :

0 comments: