విజయమ్మ దీక్షకు ఆర్ కృష్ణయ్య మద్దతు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ దీక్షకు ఆర్ కృష్ణయ్య మద్దతు!

విజయమ్మ దీక్షకు ఆర్ కృష్ణయ్య మద్దతు!

Written By news on Thursday, April 4, 2013 | 4/04/2013

రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ వైఎస్ఆర్ సీపీ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. మహానేత వైఎస్ఆర్ మరణంతో రాష్ట్రానికి శని పట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ సత్యగ్రహం సందర్బంగా వైఎస్ విజయమ్మను కలిసిన తర్వాత బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. సీఎం కిరణ్‌ పన్నుల ముఖ్యమంత్రి, ప్రజల్ని పీడించే సీఎం అని వ్యాఖ్యానించారు. 

వైఎస్ఆర్ సీపీ చేస్తున్న దీక్షకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దున్నపోతుమీద వాన కురిసిన చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీగా మారిందని, ఆ ఈర్ష్యతోటే ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నారన్నారు. కరెంట్ ఛార్జీలు బేషరతుగా ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజా ఉద్యమంలో కొట్టుకుపోతారని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. 
Share this article :

0 comments: