పార్టీలో ఉంటే పదవులు...ప్రజల్లోకి వెళితే వేధింపులా!! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీలో ఉంటే పదవులు...ప్రజల్లోకి వెళితే వేధింపులా!!

పార్టీలో ఉంటే పదవులు...ప్రజల్లోకి వెళితే వేధింపులా!!

Written By news on Thursday, April 18, 2013 | 4/18/2013

జగన్ కోసం -327 రోజులు
జగనన్న ఎండనక, వాననక నిద్రాహారాలు మాని రేయింబవళ్లు ప్రజల కోసం, ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే ఇవాళ అధికార పార్టీ, సీబీఐ, టీడీపీ వాళ్లందరూ కలిసి ఆయనపై కేసులు పెట్టి జైలుపాలు చేశారు. జగనన్నతో పోటీపడలేక, ఆయన బయట ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే భయంతో దుర్మార్గంగా ఎత్తులు వేసి చివరికి బెయిలు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ దూతగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన గులాం నబీ ఆజాద్ ప్రసంగిస్తూ, జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే ముందు క్యాబినెట్ మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎదిగేవారని అన్నారు! అంటే నీతిమాలిన ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగనన్నకు పదవులు ఇస్తారు, పార్టీ బయటికి వచ్చి నిజాయితీగా ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే మాత్రం జైలు పాలు చేస్తారు!

ఇదేనా కాంగ్రెస్ నీతి? తన తండ్రి వైఎస్సార్ ఆశలు తీర్చటం కోసం ప్రజలకు తోడుగా ఉండాలని, వారికి చేయూతనివ్వాలని జగనన్న ప్రజల మధ్యకు వచ్చారే తప్ప... పదవులను ఆశించి రాలేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గమనించలేకపోయిందా?! జగనన్నపై పెల్లుబుకుతున్న ప్రజాదరణను చేసి చూసి ఓర్వలేక నేటికీ ఈ కాంగ్రెస్, టీడీపీలు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. కల్పిత కథలల్లి ప్రజలకు ఆయన్ని దూరం చేయాలని హైరానా పడుతున్నాయి. కానీ ప్రజాభిమానం ముందు ఏ ఆరోపణలూ నిలవలేవు. జగనన్నను సి.ఎం. కానీయకుండా ఏ ఎత్తులు, జిత్తులు ఆపలేవు. దేవుడు నీతికి నిజాయితీకి ఎప్పుడూ ఓటమిని ఇవ్వడు. నిజం గెలుస్తుంది, జగనన్న గెలుస్తాడు.

- కె.రాంకీ, నెల్లూరు

వై.ఎస్. కాంగ్రెస్‌కి మేలు చేస్తే...కాంగ్రెస్ జగన్‌కి కీడు చేస్తోంది!

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం వైఎస్సార్ అని అందరికీ తెలుసు. సి.ఎం.గా ఆయన ఉన్నన్నాళ్లూ సబ్సిడీలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్లు ఉన్నాయి. విద్యుత్ ధరలు ఏనాడూ పెరగలేదు. ఆర్టీసీ చార్జీలూ అదుపులోనే ఉన్నాయి. గ్రామీణ రైతాంగానికి ఉచిత విద్యుత్ లభించింది. వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయి. అప్పు తీర్చినవారికి ఇచ్చిన మాట ప్రకారం నిజాయితీగా ఐదు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేసిన ఘనత కూడా వై.ఎస్.కే దక్కుతుంది. రెండోసారి కూడా అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రాజన్న ఎంత కష్టపడ్డాడో ప్రజలందరికీ తెలుసు. ఆ మహనీయుడి హఠాన్మరణం మన రాష్ట్రానికే కాదు, యావత్ దేశానికే పెద్ద దెబ్బ.

ఆనాటి నుండే జగనన్నకూ ఎన్నో కష్టాలు. ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించి గెలిపించి, ప్రజాసంక్షేమం కోసం ఎవరికైతే ఆనాడు వై.ఎస్.గారు పదవులు కట్టబెట్టారో, వారే జగనన్న వైపు ఇప్పుడు కాలుదువ్వుతున్నారు. పదకొండు నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. బెయిలు కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్, తెలుగుదేశం, సి.బి.ఐ., ఎల్లో మీడియా పడనివ్వడం లేదు. అయితే ఈ దుష్ట కూటములు ఒక వాస్తవం గ్రహించాలి. జగనన్నకు బెయిల్ రాకుండా ఎన్ని రోజులు ఉంచుతారో ఆయనకు అంతగా ఇమేజ్ పెరుగుతుంది. జగనన్న ఇప్పటికే దేశంలోనే కీలక రాజకీయ నేతగా ఎదిగారు. ఆయనకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది.

- జైని రాజేశ్వర్ గుప్త, కాప్రా, హైదరాబాద్


 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: