వైఎస్ మా పెద్ద కొడుకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ మా పెద్ద కొడుకు

వైఎస్ మా పెద్ద కొడుకు

Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013

షర్మిల యాత్రలో వైఎస్‌ను గుర్తుచేసుకున్న వృద్ధులు
రాజన్న పథకాలు అమలుకావాలంటే జగన్ సీఎం కావాల్సిందేనని ఉద్ఘాటన
ఆఖరి ఓటు జగనన్నకే వేసి వెళ్లిపోతామని పండుటాకుల భావోద్వేగం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 121, కిలోమీటర్లు: 1,638.2

 ముడతలు పడిన చర్మం.. జనపనారలాంటి జుట్టు.. కాంతిలేని గాజు కళ్లు.. కాటికి కాలు చాపిన పండుటాకులు వారు.. వారి కళ్లలో మాత్రం ఓ సంకల్పం. రాజన్న బిడ్డను చూడాలి.. షర్మిలమ్మను కలవాలి.. మనవరాలిని ఆశీర్వదించాలి!! ఆ ఆకాంక్షే వారిని.. జనం మధ్యకు తోసుకొచ్చి ముందు వరుసలో నిలబడేలా చేస్తోంది. వయసు మళ్లి, ఒంట్లో సత్తువ లేకున్నా.. జవసత్వాలను కూడదీసుకొని శతాధిక వృద్ధులు సైతం ముందుకొచ్చి.. ఆప్యాయంగా షర్మిలను ముద్దాడి ఆశీర్వదిస్తున్నారు. షర్మిలతోపాటు నాలుగు అడుగులు నడిచి ‘అన్నను బయటికి తెచ్చే వరకు నీ నడక ఆపొద్దు బిడ్డా’ అని కోరుతున్నారు. బలం లేక తడబడుతున్న స్వరాన్ని సవరించుకుంటూ ‘‘మీ నాయన పెద్ద కొడుకులా నాకు నెల నెలా పింఛనిచ్చి ఆదుకున్నాడు. 

ఈ తనువు ఆఖరి దశకు చేరింది. మీ నాయినిచ్చిపోయిన రూ.200 పుణ్యాన మంచిగనే బతికినం. ఇక ఊరు పొమ్మంటోంది.. కాడు రమ్మంటోంది. ఆఖరి ఓటు అన్నకే వేసి పోతాం మనవరాలా’’ అంటూ షర్మిల చేతిలో చెయ్యేసి చెప్తున్నారు. షర్మిల ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏ ప్రాంతం వెళ్లినా ప్రతి పల్లెలోనూ పండుటాకులు ఇలా ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. అక్కున చేర్చుకుంటున్నాయి. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికీ నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం సహా మూడు రోజులుగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని పల్లెల్లో సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల వృద్ధులొచ్చి షర్మిలను కలిసి.. వైఎస్ తమకు చేసిన మేలు గురించి చెప్పుకొచ్చారు. మనవరాలా అంటూ హత్తుకొని ఆప్యాయంగా దీవించారు. రూ. 75 ఉన్న పింఛన్‌ను రూ.200 పెంచి ప్రతి నెల ఒకటో తారీఖున ఠంచన్‌గా అందించిన వైఎస్సార్‌ను మరవలేమని అన్నారు. వైఎస్ పథకాలు అమలు కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని, ఆ దేవుడు ఒక్క అవకాశం ఇస్తే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసి తీరుతామని వారన్నారు. 

‘‘మీ నాన్న పెద్ద కొడుకై నాకు సాయం చేశాడు. ఈడు మీదున్నపుడు పుట్టెడు కష్టం చేసినా రూపాయి మిగల్లేదు. పిల్లలకు రెక్కలొచ్చి ఎటోళ్లు అటు పోయారు. ఈ వయసులో మీ నాన్న పంపిన రూ. 200తో కాలం నెట్టుకొచ్చా. ఇక నా పని అయిపోయింది. ఎన్నికలొస్తే అన్నకు ఓటేసి పోతా..’’
- మందాడ సీతమ్మ (95), బత్తులవారిగూడెం

‘‘సాయం చేసిన దేవుడిని మింగేశారు... వైఎస్సార్ పోయినప్పుడే మా బతుకులు రోడ్డున పడ్డాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కి ఉన్న పింఛన్ తీసేశాడు. తిన్నా.. పస్తులు పడుకున్నా పట్టించుకునేవాళ్లే లేరు. మళ్లీ జగన్ రావాలి. మా ముసలోళ్లకు సాయం కావాలి.’’
- మంగమ్మ,(85) జి. కొండూరు

‘‘75 ఏళ్లు ఉంటాయి నాకు.. రూ.200 ఫించను వస్తోంది. ఆడ పిల్లవు.. మా కోసం ఎండల్లో నడుస్తున్నావు. నాకు నీతో పాటు నడవాలని ఉంది... ఒంట్లో బలం లేక నడవలేకపోతున్నా... ఆ ఓట్లు ఎప్పుడొస్తాయో.. అన్నకు ఓటేస్తేనే నా పాణానికి తృప్తి ఉంటుంది.’’
- రమణయ్య, చెవుటూరు.

‘‘నాకు 90 పైనే ... నా పని నేను చేసుకుంటా.. భర్త, ఇద్దరు పిల్లలు కాలంజేశారు. పొలం లేదు, పెట్టి పోసేటోళ్లు లేరు. వైఎస్ ముసలాయనకు పింఛన్ ఇచ్చాడు. రెండేళ్ల నుంచి నాకు పింఛను కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఏ అమ్మన్నా దయదలిచి ఇంత పెడితే తింటున్నా... లేకుంటే పస్తులు పడుకుంటున్నా. రావాలి బిడ్డా... నా మనవడు జగన్ బయటికి రావాలి.. ఇప్పటిదాక చెయ్యికే ఓటేసినా.... మళ్లీ ఓట్లు వచ్చేదాక నేను ఉంటానో.. ఉండనో... ఉంటే ఈ సారి అన్నకు ఓటేసి గెలిపిస్తా.’’
- ఏసమ్మ(90) జి. కొండూరు


పింఛన్‌ను జగనన్న రూ.700 చేస్తారు: షర్మిల

‘‘అమ్మా...! మా మీద ఇంత ఆప్యాయత చూపిస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం’’ అని షర్మిల.. తన కోసం ఎండల్లో ఎదురుచూస్తూ తనను ఆప్యాయంగా పలకరించిన వృద్ధులనుద్దేశించి అన్నారు. సోమవారం పాదయాత్రలో కలిసిన పలువురు వృద్ధులనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘పంట పొలాల్లో పనిచేస్తున్న అవ్వా తాతలు నన్ను చూసి ఒంట్లో సత్తువనంతా కూడదీసుకొని పరుగెత్తుకుంటూ నాకోసం వస్తున్నారు. ఈ వయసులో పని చేస్తున్నారా అమ్మా... అని అడిగితే ‘బతకాలి కదా బిడ్డా’ అని అంటున్నారు. అప్పుడు నాకు గుండెలు పిండేసినంత బాధ అనిపిస్తోంది. ‘మీ నాయన పుణ్యాన రూ. 200 వస్తున్నాయి. మూడు పూటలా తినడానికి ఇవి సరిపోవు కదా బిడ్డా ’ అని నాతో చెప్పారు. అవ్వా...త్వరలోనే జగనన్న వస్తారు. మళ్లీ రాజన్న రాజ్యం తెస్తారు. రాజన్న రాజ్యంలో ప్రతి అవ్వా, ప్రతి తాతకు ఇప్పుడున్న రూ. 200 పింఛన్‌ను జగనన్న రూ. 700 చేస్తారు’’ అని షర్మిల భరోసా ఇచ్చారు.

14.5 కి.మీ. మేర యాత్ర

పాదయాత్ర 121వ రోజు సోమవారం షర్మిల కృష్ణా జిల్లా మైలవరం నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కుంటుముక్కల అడ్డరోడ్డు, వెంకటాపురం, చెవుటూరు, జి.కొండూరు, గడ్డమణుగు వరకు యాత్ర సాగింది. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు ఆమె చేరుకున్నారు. సోమవారం మొత్తం 14.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,638.2 కి.మీ యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే జేష్ట రమేష్ బాబు, స్థానిక నాయకులు కాజా రాజ్‌కుమార్, అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, వేజెండ్ల శివకుమార్, కె. గురువయ్య తదితరులున్నారు.
Share this article :

0 comments: