రైతులు అధైర్యపడవద్దు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులు అధైర్యపడవద్దు: షర్మిల

రైతులు అధైర్యపడవద్దు: షర్మిల

Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013

Photo: అధైర్యమొద్దు.. రాజన్న రాజ్యం వస్తుంది - రైతులకు షర్మిల భరోసా

రైతులు ఎవరూ అధైర్య పడొద్దని శ్రీమతి వైయస్ షర్మిల ధైర్యం చెప్పారు. కృష్ణా జిల్లా గంగినేని గ్రామంలో ఆమె మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన రచ్చబండలో పాల్గొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారానికి 122వ రోజుకు చేరింది. రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రయిన తరువాత రైతే రాజవుతాడని  షర్మిల భరోసా ఇచ్చారు. రైతులు భూములు అమ్ముకోవద్దని సూచించారు.  రైతులు, మహిళలు తమ బాధలను ఆమెకు చెప్పుకోవడంతో, వారికి ధైర్యం చెప్పారు. పావలా వడ్డీ రుణాలు అందడంలేదని మహిళల ఫిర్యాదు చేశారు. ఐదు లక్షల రూపాయల రుణానికి లక్షా 25 వేల రూపాయల డిపాజిట్ అడిగి రూపాయ పావలా వడ్డీ వేస్తున్నారని  మహిళలు తమగోడు వెళ్లబోసుకున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ఉన్నప్పుడు ఐదు వేల రూపాయలు పలికిన పత్తి ధర ఇప్పుడు మూడు వేల రూపాయలే పలుకుతోందని చెప్పారు. అప్పుడు 11 వేల రూపాయలు పలికిన మిర్చి ధర ఇప్పుడు 5 వేలకు మించడంలేదన్నారు. దళారులు రైతులను దోచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏపీ ధర కూడా బాగా పెరిగిపోయిందని చెప్పారు. పెట్టుబడి పెరిగిపోయి గిట్టుబాటు ధరలేక రైతు కుటుంబాలు అప్పులపాలైపోయాయని తెలిపారు. తిండి కోసం భూములమ్ముకోవలసిన పరిస్థితికి చేరుకున్నామని చెప్పారు.

ఎవరూ అధైర్యపడవద్దని, జగనన్న రాజ్యం వస్తుందని షర్మిల వారికి భరోసా ఇచ్చారు. రైతులకు, మహిళలకు మూడ వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని చెప్పారు. వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి ఆదుకుంటారన్నారు. రాష్ట్రంలోనే గుడిసె ఇళ్లే లేకుండా చేయలన్న మహానేత కలను జగనన్న నెరవేరుస్తారని చెప్పారు. గ్రామాల్లో బెల్టు షాపులు అనేవే లేకుండా చేస్తాడన్నారు. వృద్ధులకు 700 రూపాయలు, వికలాంగులకు 1000 రూపాయల పింఛన్ అందిస్తాడని శ్రీమతి షర్మిల చెప్పారు.

YSRCP Official Facebook Page : http://www.facebook.com/ysrcpofficial

Share this article :

0 comments: