అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇలా పరస్పర అవగాహనతో, కుమ్మక్కుతో ‘ముందుకు’ సాగడం దేశ చరిత్రలోనే ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇలా పరస్పర అవగాహనతో, కుమ్మక్కుతో ‘ముందుకు’ సాగడం దేశ చరిత్రలోనే ...

అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇలా పరస్పర అవగాహనతో, కుమ్మక్కుతో ‘ముందుకు’ సాగడం దేశ చరిత్రలోనే ...

Written By news on Thursday, April 11, 2013 | 4/11/2013

ఒక్క కరెంటు చార్జీల రూపంలోనే ప్రజల నెత్తిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్ల మేరకు పెను భారం మోపినా, ఆర్టీసీ చార్జీల పెంపుతో నడ్డి విరిచినా, వ్యాట్ పెంపు రూపంలో వాతలు పెట్టినా, భూముల విలువ పెంచి రిజిస్ట్రేషన్ల రూపేణా ఖజానా నింపుకున్నా, నిత్యవసర వస్తువుల ధరలు అక్షరాలా ఆకాశాన్ని అంటుతున్నా, కేంద్రం కూడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ఎడాపెడా పెంచేస్తున్నా... ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడేందుకు బాబు పొరపాటున కూడా ముందుకు రావడం లేదు. పైగా కరెంటు చార్జీల పెంపు, అన్ని రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా మిగతా పార్టీలు దానిపై అవిశ్వాసం తీర్మానం పెడితే.. టీడీపీ మాత్రం ‘తటస్థ’ నాటకాలతో మైనారిటీ కాంగ్రెస్ సర్కారును దగ్గరుండి మరీ గట్టెక్కించింది! ఆ క్రమంలో... తాను ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నానన్న వాస్తవాన్ని కూడా టీడీపీ ‘విస్మరించిన’ తీరు ఆ పార్టీ నేతలను కూడా విస్మయపరిచింది. కాంగ్రెస్‌తో మూడేళ్ల క్రితం మొదలైన టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్, తాజాగా అవిశ్వాస తీర్మానం ద్వారా తారస్థాయికి చేరింది. కిరణ్ ధీమాకు ఈ నేపథ్యమే ప్రధాన కారణంగా మారింది. 

కానీ మరో ఏడాదిలో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన తరుణంలో, ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమాలు చేయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు... వాటి ఊసయినా ఎత్తకపోగా కాంగ్రెస్‌కు ఎందుకిలా అడ్డంగా సాగిలపడిపోతున్నారన్న దానిపై కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. స్వప్రయోజనాలతో పాటు, వెంటాడుతున్న కేసుల బారి నుంచి బయటపడేందుకు ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఇంటా బయటా జోరుగా వినిపిస్తోంది. వీటికి తోడు... తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏం చేసైనా అడ్డుకోవాలన్న ‘ఉమ్మడి లక్ష్యం’ కూడా కాంగ్రెస్-టీడీపీ అక్రమ బంధాన్ని మరింతగా గట్టిపరిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇలా పరస్పర అవగాహనతో, కుమ్మక్కుతో ‘ముందుకు’ సాగడం దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో ఇది మాత్రమే సాధ్యమైందని వారు ఆశ్చర్యపోతున్నారు! 
Share this article :

0 comments: