ఆనంను ఉరి తీసినా తప్పులేదు: నరేష్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆనంను ఉరి తీసినా తప్పులేదు: నరేష్

ఆనంను ఉరి తీసినా తప్పులేదు: నరేష్

Written By news on Tuesday, April 16, 2013 | 4/16/2013

అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఉరి తీసినా తప్పులేదని ప్రముఖ సినీనటుడు నరేష్ మంగళవారం అనంతపురంలో అభిప్రాయపడ్డారు. నాడు పదవుల కోసం వైఎస్ ను కీర్తించిన ఆనం నేడు అధికార దాహంతో మాట్లాడటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.


నెల్లూరు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించే అధికార కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం నెల్లూరులో వెల్లడించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఆనం సోదరులు ఓటమి తప్పదని నల్లపరెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు ప్రజలు ఆనం సోదరులను రాజకీయంగా ఉరి తీస్తారని ప్రసన్నకుమార్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.



హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిపై లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలైంది. నెల్లూరులో ఆనం మాట్లాడిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందంటూ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. 

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. కేసు విచారణలో ఉన్న వ్యక్తిని ఉరి తీయాలని మంత్రి మాట్లాడటం చట్టవిరుద్దమని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆజాద్ లోకాయుక్తను కోరారు .

'కుటుంబ సభ్యుల్ని కూడా కలవనివ్వరా?'

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులను కలవటాన్ని కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. అధికార పార్టీ నేతలే జగన్ ములాఖత్‌లపై విచారణ జరపాలంటున్నారని, జైలులో ఉన్నా జగన్‌ను కట్టడి చేయలేకపోతున్నామన్న అక్కసే ఇందుకు కారణమని ఆమె మంగళవారమిక్కడ అన్నారు. 

రాష్ట్రంలోనూ, కేంద్రంలోను అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని, అయితే కాంగ్రెస్ నేతలే ములాఖత్ లపై విచారణ జరపాలని కోరటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జైలర్‌ చేస్తున్న సవాళ్లను తెలుగుదేశం గానీ, కాంగ్రెస్‌ గానీ ఎందుకు స్వీకరించలేకపోతున్నాయని శోభా నాగిరెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. ములాఖత్‌లపై ఇప్పటికే జైళ్ళశాఖ అధికారి వివరణ ఇచ్చారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో ఎలాంటి సౌకర్యాలు, విలాసాలు అనుభవిస్తున్నారో చూపించాలని ఆమె టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరారు.

జగన్‌మోహన్‌రెడ్డి కనీసం విచారణలో ఉన్న వ్యక్తి కూడా కాదని, కేవలం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్‌, టీడీపీ గుర్తుంచుకోవాలని శోభా నాగిరెడ్డి అన్నారు. జగన్‌ను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించాక ఆయన ప్రజాదరణ అంతకంతకూ పెరిగిందే తప్ప తగ్గలేదని ఆమె పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్‌లు సగానికిపైగా నియోజకవర్గాల్లో డిపాజిట్లను సైతం నిలబెట్టుకోలేకపోయాయని శోభానాగిరెడ్డి విమర్శించారు.

Share this article :

0 comments: