మా అందరి ఆశీస్సులు జగన్‌కే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మా అందరి ఆశీస్సులు జగన్‌కే!

మా అందరి ఆశీస్సులు జగన్‌కే!

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013

‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అని అందరి మంచి కోరుకునేది ఒక్క మన బ్రాహ్మణ సామాజికవర్గం మాత్రమే అన్న నా అభిప్రాయాన్ని కాస్తా 2004లో డా॥వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక మార్చుకోవలసి వచ్చింది. ఎందుకంటే కుటుంబంలో పిల్లల కోసం తండ్రి తాపత్రయపడే రీతిలో మహానేత ైవైయస్ ఆంధ్రరాష్ట్ర ప్రజలకోసం పరితపించిన ఏకైక ముఖ్యమంత్రి. భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రజా ప్రయోజన పథకాలను అమలుపరుస్తూ ముందుకు సాగుతున్న సమయంలో అందరి మంచి కోరుకున్న ఆయన పంచభూతాల సాక్షిగా మహనీయుడయ్యాడు.

శత్రువులందరూ సంతోషపడే సమయాన, కుట్రదారులందరూ ఉలిక్కిపడేలా శోకతప్త హృదయంతో ఉండి కూడా తన తండ్రి స్మారకస్థలిలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఓదార్పుయాత్రకు సిద్ధమయ్యారు యువనేత జగన్. రాజన్న పాలన మళ్లీ వస్తుందని ప్రజలంతా ఆనందంతో ఉన్న సమయాన మళ్లీ కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో పది తలల రావణుడు కాంగ్రెస్ హైకమాండ్ రూపంలో నిద్రలేచాడు. ఈ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చివేయగల సత్తా ఉన్న ఏకైక యువ కెరటాన్ని నిర్బంధించాడు. ‘జగన్ రాజకీయంగా ఎదిగితే తమకు అథోగతే’ అన్న భయంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, ఎల్లో మీడియా కలసి పన్నిన కుట్రే జగన్ అక్రమ అరెస్ట్.

సాక్షి పేపరు, సాక్షి ఛానెల్ పెడుతుంటే చూస్తూ ఊరుకున్న హైకమాండ్ జగన్ ఓదార్పు యాత్రతో ఒక్కసారిగా ఆ పేపర్‌పై, ఛానెల్‌పై సి.బి.ఐ.చే దాడులు ఎందుకు చేయించింది? జగన్ ఆస్తులపై హడావిడిగా ఎందుకు సోదాలు చేయించింది? ఎందుకు అక్రమ అరెస్టులు కొనసాగిస్తోందో ఎవరైనా ఇట్టే ఊహించగలరు. ఏది ఏమైనా ఈ బ్రాహ్మణుడి ఆశీస్సులు, దీవెనలు, వై.ఎస్. జగన్ వెంటే! ఎందుకంటే రెడ్డి రాజులకాలంలో కనకాభిషేకం అందుకున్న శ్రీనాథుడు తర్వాతి కాలంలో వ్యవసాయాన్ని ఆశ్రయించవలసి వచ్చింది.

బ్రాహ్మణుడు ఈ రాష్ర్టంలో తను సుఖసంతోషాలతో ఉంటూ యితరుల సుఖ సంతోషాలు కోరుకుంటూ ఉండాలంటే జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన రావాలి. ఆయన త్వరలోనే విడుదల అవాలని కోరుకుంటున్నాను.

- పోతావఝల పురుషోత్తమ శర్మ, తెనాలి
Share this article :

0 comments: