గ‘లీజు’ చార్జిషీటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గ‘లీజు’ చార్జిషీటు

గ‘లీజు’ చార్జిషీటు

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

మైనింగ్ లీజు బదలాయించటమూ ప్రభుత్వ నేరమేనట!
వైఎస్సార్ హయాంలో జరిగింది కాబట్టి జగన్‌మోహన్‌రెడ్డికి అంటగట్టే యత్నం
1997లోనే కడపలో మైనింగ్ లీజుకు జయా మినరల్స్ దరఖాస్తు
1998లోనే దానికి ఎన్‌ఓసీ జారీ; పోటీదారులెవరూ లేని తీరు
2008లో నిబంధనల ప్రకారం లీజు మంజూరు
ఫ్యాక్టరీ కోసం ఈశ్వర్ సిమెంట్స్‌ను ఏర్పాటు చేసిన జయా మినరల్స్
తరవాత తన మాతృసంస్థ దాల్మియాకు లీజు బదలాయించాలని అభ్యర్థన
అనుబంధ సంస్థ లీజును బదలాయించడానికి సరేనన్న వైఎస్సార్ ప్రభుత్వం
ఇదే నేరమన్న సీబీఐ... దీన్నే క్విడ్ ప్రో కోగా పేర్కొంటూ ఛార్జిషీట్
ఇలా చేసినందుకే రఘురామ్‌లో దాల్మియా 95 కోట్ల పెట్టుబడి పెట్టిందట
ఆ వెంటనే రఘురామ్‌లో వాటాను రూ.150 కోట్లకు పైగా విక్రయించిన దాల్మియా
స్వల్పకాలంలోనే రూ.55 కోట్లకుపైగా లాభం....క్విడ్ ప్రో కోకు ఎక్కడైనా లాభాలొస్తాయా? 


రంధ్రాన్వేషణ అంటే...? రంధ్రం ఎక్కడుందో వెదకటమా... లేక రంధ్రం చేసి దాన్లోంచి దేన్నో మరొకదాన్ని వెదకటమా...? ‘క్విడ్ ప్రో కో’ అంటూ సీబీఐ సాగిస్తున్న దర్యాప్తును చూసినవారికెవ్వరికైనా ఇలాంటి సందేహమే వస్తుంది. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో సీబీఐ తన దర్యాప్తును ఎక్కడ మొదలుపెట్టిందో... ఎక్కడ ముగించాలని అనుకుంటోందో తెలియని పరిస్థితి. ఆద్యంతాలు తెలియని గందరగోళంలో అసలు తాను దేనికోసం వెదుకుతున్నానన్నది సీబీఐకయినా తెలుసా? లేదా? అన్నదే ఇపుడు ప్రధాన ప్రశ్న. ఎందుకంటే దర్యాప్తులో రానురాను సరిహద్దు గీతలన్నీ చెరిగిపోతున్నాయి. అనుకున్నది సాధించటానికి ఏం చేయటానికైనా తెగించే ఫ్యాక్షనిస్టు మాదిరిగా సీబీఐ ఎంతదూరమైనా వెళ్లిపోతానని చేతల్లో చెప్పకనే చెబుతోంది. ఐదవ చార్జిషీటంటూ మైనింగ్ లీజుకూ సిమెంట్ కంపెనీకీ ముడిపెట్టి... భారతి సిమెంట్‌లో పెట్టుబడుల్ని దర్యాప్తు భూతద్దంలో చూస్తూ దానిపై వచ్చిన లాభాలను మాత్రం విస్మరించేసిన తీరు విస్మయకరమే. అసలు పెట్టుబడి అనే పదానికే అర్థం మార్చేసిన ఈ ఆరోపణల చిట్టాలో నిజానిజాలు వివరిస్తున్న ‘ఏది నిజం?’ ప్రత్యేక కథనం ఇదిగో...

వైఎస్సార్ కడప జిల్లా ఏమంత అభివృద్ధి చెందినది కాదన్నది ఆంధ్రప్రదేశ్‌లో గడప గడపకూ తెలుసు. వ్యవసాయం గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. వర్షాలూ తక్కువే. ఒక్క కడప అనే కాదు. రాయలసీమంతటా కూడా పడితే ఒక వర్షం... ఒక పంట. లేదంటే ఏడాదంతా ఖాళీ. అలాంటి చోట సున్నపురాయి గనుల్ని లీజు పద్ధతిన మైనింగ్ చేయటానికి అనుమతివ్వాలంటూ 1997లో జయా మినరల్స్ అనే సంస్థ దరఖాస్తు చేసుకుంది. దీనికి సంబంధించి 1998లో ఎన్‌వోసీ జారీ అయింది. నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబే. పెపైచ్చు జయా మినరల్స్‌లో ఉన్నది జియాలజిస్టులు. తరవాత ఈ భూముల లీజు కోసం ఎలాంటి దరఖాస్తూ రాలేదు. అంటే ఒకే ఒక దరఖాస్తుదారు పోటీ లేకుండా బరిలో ఉన్నట్టన్న మాట.

ఇంకా ఇక్కడ గమనించాల్సిన అంశమేంటంటే జయా మినరల్స్ అడిగిన భూమి కూడా ప్రైవేటు భూమే తప్ప ప్రభుత్వ భూమి కాదు. అది పూర్తిగా రైతుల చేతుల్లోనే ఉంది. పూర్తి వర్షాభావంతో పండితే ఒక పంట.. లేదంటే ఖాళీ అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో రైతులు కూడా తమకు మంచి ధర వస్తే విక్రయించడానికి వెనకాడే పరిస్థితి ఉండదు. పెపైచ్చు తమలాంటి జిల్లాలో వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక కర్మాగారం వస్తే బాగుంటుందని, వేలమందికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తారు కనక వారు కూడా సరైన ధర కోసం పట్టుబడతారు తప్ప విక్రయించబోమని భీష్మించే పరిస్థితి ఉండదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... పోటీదారులు ఎవరూ బరిలో లేకపోవటంతో 2008లో 1005 ఎకరాల సున్నపురాయి గనుల్ని లీజును ప్రభుత్వం చట్టబద్ధంగా నిబంధనల ప్రకారం కేటాయించింది. దీన్లో ఏమైనా తప్పుందా? ఇందులో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా?

ఏటా వెయ్యికి పైగా లీజులు...
నిజానికి రాష్ట్రంలో ఏటా దాదాపు వెయ్యికి పైగా మైనింగ్ లీజుల్ని ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంటుంది. వాటిలో 20 శాతానికి పైగా ఉండేవి సున్నపురాయి లీజులే. దీనికోసం గనుల శాఖ పేరిట ఒక ప్రత్యేక శాఖే ఉంది. నిబంధనల ప్రకారం వచ్చే దరఖాస్తుల్ని పరిశీలించి, పోటీదారులున్నారో లేదో చూసి, లేకుంటే రొటీన్‌గా అనుమతి మంజూరు చేయటం ఈ శాఖ పని. వీటిలో ఏడాదికి వంద వరకూ లీజు బదలాయింపులు కూడా ఉంటుంటాయి. అంటే ఒకరి పేరిట మంజూరైన లీజును వేరొకరికి బదలాయించటమన్న మాట. ఇవన్నీ నిబంధనలకనుగుణంగా రొటీన్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఏవో ఒకటి రెండు చాలా అరుదైన కేసులు మాత్రమే ముఖ్యమంత్రి వద్దకు వస్తుంటాయి. మిగిలినవన్నీ ముఖ్యమంత్రికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. దీంతో ఆ శాఖ పరిధిలోనే మంజూరైపోతూ ఉంటాయి.

ఈశ్వర్ సిమెంట్స్‌కూ రొటీన్‌గానే...
నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయటం, పోటీదారెవరూ లేకపోవటంతో జయా మినరల్స్‌కు లీజు మంజూరయింది. తరవాత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం జయా మినరల్స్‌లో ఉన్నవారే ఈశ్వర్ సిమెంట్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. రుణాలు వగైరా రావాలంటే సిమెంటు ఫ్యాక్టరీ పేరిట లీజు ఉండాలని భావించి లీజు బదలాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఉండటంతో బదలాయింపుకు ప్రభుత్వం సరేనంది. అన్నీ రొటీన్‌గా జరిగిపోయాయి. ఇలా లీజు పొందిన ఈశ్వర్ సిమెంట్స్... కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి మరిన్ని పెట్టుబడులు అవసరమని భావించి అందుకోసం ముందుకొచ్చిన కొందరు వ్యక్తుల్ని సంస్థలోకి తీసుకుంది. అలా... అది దాల్మియా సిమెంట్స్‌కు అనుబంధ సంస్థగా మారింది. తదనంతరం తమ అనుబంధ సంస్థ ఈశ్వర్ సిమెంట్స్ నుంచి లీజును తమకు బదిలీ చేయాలని, దీనికి తమ రెండు సంస్థల అనుమతీ ఉన్నదని పేర్కొంటూ దాల్మియా సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. నిజానికి ఏడాదికి ఇలా వంద వరకు లీజుల్ని ఒకదాని నుంచి మరొకదానికి ప్రభుత్వమే రొటీన్‌గా బదిలీ చేస్తూ ఉంటుంది. పెపైచ్చు రెండు అనుబంధ సంస్థల మధ్య జరిగే ఈ వ్యవహారంలో అభ్యంతరం చెప్పటానికి ఎలాంటి కారణాలూ కనిపించకపోవటంతో ప్రభుత్వం సరేనంది. ఎలాంటి చట్ట ఉల్లంఘనలు గానీ, చట్ట సవరణలు గానీ లేకుండా... 1960 మినరల్ కన్సెషన్ రూల్స్‌ను అనుసరిస్తూ... ఈశ్వర్ సిమెంట్స్ నుంచి దాల్మియా సిమెంట్స్‌కు ప్రభుత్వం మైనింగ్ లీజును బదలాయించింది.

ప్రభుత్వానికెలా తెలుస్తుంది?
ఒక కంపెనీకి ఒక మైనింగ్ లీజును కేటాయించాక ఆ కంపెనీలోకి కొత్త వాటాదారులొచ్చినా, వాటాదారులు మారినా అది ప్రభుత్వానికెలా తెలుస్తుంది? ‘‘ఈశ్వర్ సిమెంట్స్-దాల్మియా సిమెంట్స్ రెండూ మావే. కన్సాలిడేషన్‌లో భాగంగా మా మాతృసంస్థ దాల్మియా సిమెంట్స్‌కే మా లీజును బదిలీ చేయండి’’ అని ఈశ్వర్ సిమెంట్స్ అడిగితే తప్పేముంది? అయినా వెనకబడిన కడప లాంటి జిల్లాలో... వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సిమెంట్ ఫ్యాక్టరీ వస్తున్నప్పుడు ప్రభుత్వమైనా అక్కడ అది రావాలని కోరుకుంటుందే తప్ప అడ్డుకోవాలని అనుకుంటుందా? పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు రాకూడదని ఏ మంత్రయినా, ఏ ముఖ్యమంత్రయినా ఎందుకనుకుంటారు? దీన్లో సీబీఐకి తప్పులు కనిపించటం ఎవరి లోపం?

క్విడ్ ప్రో కో పెట్టుబడికి లాభాలొస్తాయా?
లీజు పొందినందుకు ప్రతిగానే దాల్మియా సిమెంట్స్ సంస్థ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన రఘురామ్ సిమెంట్‌లో (ప్రస్తుతం భారతి సిమెంట్) రూ.95 కోట్ల పెట్టుబడి పెట్టిందని, ఇదంతా క్విడ్ ప్రో కో అని సీబీఐ చార్జిషీట్లో పేర్కొంది. అందులో భాగంగానే ఇష్టం వచ్చిన రేట్లకు షేర్లు కొన్నారని చెబుతోంది. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. రూ.95 కోట్లు పెట్టుబడి పెట్టిన దాల్మియాకు అతి తక్కువ కాలంలోనే చక్కని లాభం ముట్టింది. ఫ్రాన్స్‌కు చెందిన ‘వికా’ సంస్థ భారతిలో వాటా కొనుగోలు చేసినప్పుడు... వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన సహ వాటాదారులందరికీ వారివారి వాటాలను ముందు విక్రయించుకునే అవకాశం ఇచ్చారు. అలా విక్రయించిన సందర్భంగా దాల్మియాకు దక్కింది రూ.150 కోట్ల పైనే. దీంతో లాభాలతో ఆ సంస్థ భారతి నుంచి ఎగ్జిట్ అయ్యింది. మరి దీన్నంతటినీ విస్మరించి క్విడ్ ప్రో కో అనే నీచమైన సంస్కృతిని అంటగట్టే ప్రయత్నాలనేమనాలి? ఒక వాటాదారు తాను పెట్టిన పెట్టుబడికి లాభం పొందాడంటే అది తెలివైన ఇన్వెస్ట్‌మెంట్ కాదా? దాన్ని ఇతర ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాల్లో భాగంగానే తీసుకున్నట్టు భావించాల్సిన పనిలేదా? ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి విషయంలోనే సీబీఐ ఎందుకిలా చేస్తోంది? రొటీన్‌గా జరిగే ప్రభుత్వ పనులను కూడా భూతద్దంలో చూసి తప్పులు వెదకటం... జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి వచ్చిన ప్రతి పైసాకూ దురుద్దేశాలు అంటగట్టడం... నెలల తరబడి ఆయనకు బెయిలు రాకుండా మొండి వాదన వినిపిస్తుండటం... దానికోసం న్యాయస్థానాలను సైతం ధిక్కరిస్తూ ఉండటం వెనక సీబీఐ అసలు ఉద్దేశమేంటి? దాని వెనక ఎవరున్నారు? జగన్‌మోహన్‌రెడ్డిపై ఎందుకింత వ్యక్తిగత ద్వేషం? జనం మనిషి కావటమే ఆయన చేసిన తప్పా? జనంలో ఉండటమే అన్నిటికన్నా పెద్ద నేరమా?

ఇది తెలివైన నిర్ణయం కాదా?
నిజానికి దాల్మియా సంస్థ రఘురామ్ సిమెంట్స్‌లో పెట్టుబడి పెట్టడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే దాల్మియా ఫ్యాక్టరీ కూడా రఘురామ్‌కు కాస్త దగ్గర దగ్గరగానే ఉంటుంది. రఘురామ్‌లో గనక వాటా తీసుకుంటే భవిష్యత్తులో ఎప్పుడయినా రఘురామ్ కంపెనీ వ్యవహారాలు అన్నీ కూడా తమకు తెలిసే జరుగుతాయనేది దాని నమ్మకం. దీనికి తోడు భవిష్యత్తులో ఎప్పుడైనా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్బంది పడి ఆ కంపెనీని అమ్మాలనో, లేదో మరొకటో చేయాలని అనుకుంటే వీళ్లే ఆ అవకాశం తీసుకోవచ్చు. నచ్చకపోయినా లాభమే తప్ప నష్టం ఉండదు. పెపైచ్చు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి సహజంగా ఏ పెద్ద వ్యాపార సంస్థ అయినా ఈ తరహాలోనే ఆలోచన చేస్తుంది. దాల్మియా విషయంలో కూడా... వికా సంస్థకు వాటా విక్రయించేటప్పుడు దానికన్నా ముందు దాల్మియానే సంప్రదించారు. వాళ్లు కాదన్న తరవాతే బయటి వాళ్లకు విక్రయించారు. వాటా విక్రయించాక భారతిలో మిగిలిన వాటాదారులంతా లాభాలతో ఎగ్జిట్ కాగా... జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే మిగిలారు. మరి వారందరిదీ తెలివైన నిర్ణయం అనకుండా... కేవలం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినందుకే ఈ పెట్టుబడులు పెట్టారనటం ఎంతవరకూ సమంజసం? దర్యాప్తు సంస్థ ఈ దిశగా ఆలోచన ఎందుకు చేయదు? చేయాలన్న ఆలోచన దానికెందుకు రాదు?
Share this article :

0 comments: