ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వం

ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వం

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి,ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మోసపూరిత ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ విద్యుత్ విని యోగం తగ్గిందని, అందువల్ల విద్యుత్ కోతను నగరాల్లో 3 గంటల నుంచి ఒక గంటకు, జిల్లాలో నాలుగు గంటల నుంచి రెండు గంటలకు, చిన్నపట్టణాల్లో ఆరు గంటల నుంచి నాలుగు గంటలకు తగ్గిస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేసిందని గుర్తుచేశారు. ఆ విధంగా విద్యుత్ కోతలు తగ్గకపోగా ఈ రెండు రోజుల నుంచి విద్యుత్‌కోతలు మరింతగా పెరిగాయన్నారు.

వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తగ్గితే మిగిలిన వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్ సరఫరా సమయం పెంచాలని, దీనివల్ల దెబ్బతింటున్న పండ్లతోటల్ని కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ప్రభుత్వానికి పేదల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిలేదని చెప్పారు. విద్యుత్ కోతల విషయంలోనూ ప్రభుత్వం ఇదేరీతిగా వ్యవహరిస్తోందన్నారు. విద్యుత్ చార్జీల భారం 14 లక్షల ఇళ్లకు మాత్రమేనని ఒకరోజు, 4 లక్షల ఇళ్లపైనే భారం పడుతుందని మరోరోజు పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ సోనియాగాంధీ సలహా మేరకు పెట్టినవే ఆని చెప్పే కాంగ్రెస్ పెద్దలు నాలుగేళ్ల పరిపాలన తర్వాత బకాయిలున్నాయని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తోందన్నారు. 2011-12లో ఇన్‌పుట్ సబ్సిడీ రూ.357 కోట్లు, కరువు సాయం 1185 కోట్లు బకాయి ఉందని ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న ప్రకటనలు చూస్తే రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. 
Share this article :

0 comments: