చంద్రబాబు హయాంలో ఇచ్చిన సున్నపురాయి గనుల లీజులు, లీజు బదిలాయింపుల్లో కొన్నింటి వివరాలివి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు హయాంలో ఇచ్చిన సున్నపురాయి గనుల లీజులు, లీజు బదిలాయింపుల్లో కొన్నింటి వివరాలివి..

చంద్రబాబు హయాంలో ఇచ్చిన సున్నపురాయి గనుల లీజులు, లీజు బదిలాయింపుల్లో కొన్నింటి వివరాలివి..

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

చంద్రబాబు హయాంలో ఇచ్చిన సున్నపురాయి గనుల లీజులు, లీజు బదిలాయింపుల్లో కొన్నింటి వివరాలివిగో...

గుంటూరు జిల్లాలో అంబుజా సిమెంట్స్‌కు 1999లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2500 ఎకరాల సున్నపురాయి గనుల లీజులు ఇచ్చింది. ఇదే జిల్లాలో 2003లో పరాశక్తి సిమెంట్స్‌కు 300 ఎకరాల సున్నపురాయి గనులను లీజుకిచ్చింది. 

ఒక్క కర్నూలు జిల్లాలోనే 8112 ఎకరాలు...
కర్నూలు జిల్లాలో ఎన్.సి.ఎస్. శివారెడ్డి నుంచి 1600 హెక్టార్ల (4000 ఎకరాల) సున్నపురాయి గనులకు సంబంధించిన లీజును మద్రాస్ సిమెంట్‌కు 2000 - 2001లో చంద్రబాబు సర్కారు బదలాయించింది. 

ఇదే జిల్లా ప్యాపిలి మండలంలో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకి 1995 నవంబరు 3న చంద్రబాబు సర్కారు 1260.33 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాల లీజును మంజూరు చేస్తూ జీవోఎంఎస్ నంబరు 170 జారీ చేసింది. ఇదే లీజును 2001 ఆగస్టు 29వ తేదీన ప్రియదర్శిని సిమెంట్స్‌కు బదలాయిస్తూ జీవోఎంఎస్ 465 జారీ చేసింది. 

ఇదే జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీకు కొలిమిగుండ్ల మండలం తుమ్మల పెంట, పెట్నికోట గ్రామాల్లో 844.988 హెక్టార్ల భూమిని లీజుకు కేటాయించింది. 

ఇదే కొలిమిగుండ్ల మండలంలో 205.212 హెక్టార్ల భూమిని లీజుకు కేటాయిస్తూ 2003 ఆగస్టు 19న ప్రభుత్వం జీఓ ఎంఎస్.నం.242 జారీ చేసింది. 

మద్రాస్ సిమెంట్‌కు కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం నాయనూనిపల్లె, చింతలాయపల్లె, కనకాద్రిపల్లె, కొలిమిగుండ్ల గ్రామాల్లో మొత్తం 1960.36 హెక్టార్ల భూమికి సంబంధించిన లీజులను 2000 ఫిబ్రవరి 15న మంజూరు చేసింది.

గ్రాసిం ఇండస్ట్రీస్‌కు కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామంలో 951.848 హెక్టార్ల భూమికి సంబంధించి 2003 జూలై 22న లీజు మంజూరు చేసింది. 

దక్షిణ్ సిమెంట్ లిమిటెడ్ కంపెనీకి కొలిమిగుండ్ల మండలం గొరివి మాని పల్లెలో 395 హెక్టార్ల సున్నపురాయి గనిని 1999 సెప్టెంబర్ 30న లీజుకిచ్చింది. 

ప్రిజమ్ సిమెంట్స్‌కు కొలిమిగుండ్ల మండలం కల్వతాల, కోటపాడు గ్రామాల్లో 663.46 హెక్టార్లను 2002 ఫిబ్రవరి 5న కేటాయించింది. 

ఈశ్వర్ సిమెంట్స్‌కు కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామంలో 234.032 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలకు సంబంధించిన భూమిని లీజుకిస్తూ 2000 జనవరి 12 అప్పటి చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఒక్క కర్నూలు జిల్లాలోనే 8112 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజులను చంద్రబాబు సర్కారు మంజూరు చేసింది.

నల్గొండ జిల్లాలో రాశి సిమెంట్స్‌కు చెందిన 1800 ఎకరాల సున్నపురాయి గనుల లీజును ఇండియా సిమెంట్స్‌కు చంద్రబాబు సర్కారు బదలాయించింది. 

ఇదే జిల్లాలో ప్రియా సిమెంట్స్‌కు కేటాయించిన వేయి ఎకరాల సున్నపురాయి గనుల లీజును రెయిన్ ఇండస్ట్రీస్‌కు బాబు ప్రభుత్వమే బదలాయింపు ఉత్తర్వులు జారీ చేసింది. 

నల్గొండ జిల్లాకు చెందిన సెజ్ సిమెంట్ నుంచి 300 ఎకరాల సున్నపురాయి గనుల లీజును అంజనీ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్‌కు బదిలీ చేసేందుకు అప్పటి బాబు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గుంటూరు జిల్లాలో పార్థసారథి సిమెంట్స్‌కు చెందిన 500 ఎకరాల సున్నపురాయి గనుల లీజును శ్రీ చక్ర సిమెంట్స్‌కు బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Share this article :

0 comments: