అసలిక్కడ క్విడ్ ప్రో కో అనేదానికి అవకాశమేమైనా ఉందా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసలిక్కడ క్విడ్ ప్రో కో అనేదానికి అవకాశమేమైనా ఉందా?

అసలిక్కడ క్విడ్ ప్రో కో అనేదానికి అవకాశమేమైనా ఉందా?

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

ముఖ్యమంత్రికేం సంబంధం?
ఈశ్వర్ సిమెంట్స్ పేరిట ఉన్న లీజును దాల్మియా సిమెంట్స్‌కు బదలాయించటమే ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసిన తప్పిదమని, అందుకు ప్రతిఫలంగానే ఆయన తనయుడికి చెందిన రఘురామ్ సిమెంట్స్‌లో దాల్మియా సంస్థ రూ.95 కోట్ల పెట్టుబడి పెట్టిందనేది సీబీఐ 5వ చార్జిషీటు సాక్షిగా చేసిన ప్రధానారోపణ. అసలిక్కడ క్విడ్ ప్రో కో అనేదానికి అవకాశమేమైనా ఉందా? నిజంగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ కనుక దాల్మియా సంస్థకు మేలు చేయాలనుకుంటే నేరుగా ప్రభుత్వ భూముల్లో ఉన్న సున్నపురాయి గనులనే కేటాయించేవారు కదా? ప్రైవేటు భూముల్లో ఉన్న... అది కూడా అప్పటికే వేరొక సంస్థకు కేటాయించిన లీజును ఈ సంస్థకు బదలాయించటమెందుకు చేస్తారు? అప్పటికే అక్కడ ఎల్ అండ్ టీ సంస్థకు ఎకరా రూ.4 వేల చొప్పున చంద్రబాబునాయుడు కేటాయించిన మాదిరిగా వైఎస్సార్ కూడా ప్రభుత్వ భూమినే దాల్మియాకు ఇచ్చి ఉండేవారుగా? ఒకవేళ అనుబంధ సంస్థ నుంచి మాతృసంస్థకు లీజు బదలాయించారనే విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినా అదేదో తప్పు అని ఆయన భావించే అవకాశం ఎందుకుంటుంది? భావించాల్సిన అవసరం ఎందుకొస్తుంది? కడప జిల్లా వాసి కాబట్టి... జిల్లాలో ఒక పరిశ్రమ వస్తోంది కాబట్టి ఆయన పునాదిరాయి వేయాలన్న ఉద్దేశంతో అధికారులు ఆ ఒక్క ఫైల్‌నూ ఆయన దృష్టికి తీసుకెళ్లటాన్ని వేరే విధంగా ఎలా అర్థం చేసుకుంటారు? దీన్లో సీబీఐ రంధ్రాన్వేషణ చేస్తే తప్పెవరిది? 
Share this article :

0 comments: