వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల దీక్షకు సంఘీభావం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల దీక్షకు సంఘీభావం

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల దీక్షకు సంఘీభావం

Written By news on Thursday, April 4, 2013 | 4/04/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న దీక్షకు సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. గురవారం వారు దీక్ష ప్రాంగణం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్, సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి ఇతర నేతలు దీక్షా స్థలికి వెళ్లి ఎమ్మెల్యేలను పరామర్శించారు. 

ఈ సందర్భంగా వామపక్ష నేతలు ముఖ్యమంత్రి కిరణ్ పాలనపై మండిపడ్డారు. తక్షణం విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని దీక్షలు చేస్తున్నా సీఎం పట్టించుకోకపోవడం దారుణమని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు.



ఆరోగ్యశ్రీని ఆపొద్దు: అంబటి

ఆరోగ్యశ్రీని అటకెక్కించే ప్రయత్నం చేయొద్దని, అలా చేస్తే ప్రజలు సహించరని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు హెచ్చరించారు. పేదలకు వైద్యాన్ని దూరం విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నామని ప్రైవేట్ ఆస్పత్రులు చేసిన ప్రకటనపై మంత్రులు స్పందించిన తీరును అంబటి రాంబాబు తప్పుబట్టారు. ప్రభుత్వం పంతానికి పోయి ఆరోగ్యశ్రీని కొనసాగించకుంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి తప్పా ఆరోగ్యశ్రీని ఆపొద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలను అంబటి కోరారు. సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు.



చంద్రబాబు పాదయాత్ర పచ్చిబూటకం, నాటకమని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. చీకటిపడిన తర్వాత బాబు పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అతనిదంతా చీకటి బతుకేనని అన్నారు. షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్న కొడాలి నాని మాట్లాడుతూ.. విశ్వసనీయత అంటే చంద్రబాబు దృష్టిలో నమ్మించి గొంతుకోయడమని అన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయివుండేదని, రైతులు బాగుపడివుండేవారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: