వైఎస్ఆర్ రైతులకు అండగా నిలిచారు: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ రైతులకు అండగా నిలిచారు: షర్మిల

వైఎస్ఆర్ రైతులకు అండగా నిలిచారు: షర్మిల

Written By news on Tuesday, April 9, 2013 | 4/09/2013

కృష్ణా: వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పి రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నారని పుట్టగుంట గ్రామ మహిళలు కిరణ్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజాప్రస్థానం షర్మిల పాదయాత్ర పుట్టగుంట చేరుకుంది. గతంలో కంటే కరెంట్ బిల్లులు 600 రూపాయలు అదనంగా వస్తోందని షర్మిలకు పుట్టగుంట గ్రామ మహిళలు మొరపెట్టుకున్నారు.

గ్రామాల్లో బెల్ట్‌షాపులతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, మంచినీరు లేక వేసవిలో చాలా ఇబ్బందులు పడుతున్నామని షర్మిలకు పుట్టగుంట గ్రామ మహిళలు తెలిపారు. చంద్రబాబు రాక్షస పాలన సాగించారని, వ్యవసాయం దండగ అన్న మాటలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆ సమయంలో మహానేత వైఎస్ఆర్ పాదయాత్ర చేసి రైతులకు అండగా నిలిచారని షర్మిల తెలిపారు. ప్రజ సమస్య పరిష్కారం కోసం వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టి నేటికి పదేళ్లు పూర్తి అయిన విషయాన్ని గుర్తు చేశారు.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని, 1200 కోట్ల విద్యుత్ బకాయిలు వైఎస్ఆర్ మాఫీ చేశారని షర్మిల మహిళకు తెలిపారు. ప్రస్తుత కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన చంద్రబాబు మరిపించేలా ఉందన్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేక మహిళలు మంగళసూత్రాలు తాకట్టు పెడుతున్నారని..జగన్ సీఎం అయ్యాక రైతులకు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో గుడిసెల్లో ఉన్నవారందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపు లేకుండా నియంత్రిస్తామని మహిళలకు షర్మిల భరోసా ఇచ్చారు. 
Share this article :

0 comments: