చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా: షర్మిల

చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా: షర్మిల

Written By news on Friday, April 5, 2013 | 4/05/2013

 సీబీఐ విచారణతో నెలల తరబడి జగనన్నను వేధిస్తున్నారని షర్మిల ఆరోపించారు. కావాలనే జగన్‌కు బెయిల్ రాకుండా ఆలస్యం చేస్తోందని షర్మిల అన్నారు. ఇన్నాళ్ల విచారణలో సీబీఐ ఒక్క ఆధారాన్ని సంపాదించలేకపోయిందని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తే 1000 పడగలతో కాటేస్తుందని ములాయం ఒప్పుకున్న విషయాన్ని సభలో తెలిపారు. 

రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ తప్ప మూడో పార్టీ ఉండకూడదనే ఆరెండు పార్టీల లక్ష్యమన్నారు. అందుకే కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై జగన్‌పై అబద్ధపు కేసులు పెట్టించారన్నారు. చంద్రబాబు, చిరంజీవి, బొత్సలు నిర్దోషులని ఏ కోర్టు చెప్పలేదని షర్మిల అన్నారు. చంద్రబాబు అవినీతి సీబీఐకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని, చంద్రబాబు మద్దతు ఇస్తున్నారనే ధీమాతోనే కిరణ్‌ 30 వేలకోట్ల రూపాయల భారాన్ని మోపారని షర్మిల విమర్శించారు. ఓ పక్క రైతులు నీళ్లులేక, కరెంట్ లేక నానా అవస్థలు పడుతుంటే..లేని కరెంట్‌కు మూడింతలు బిల్లులు వేసి పేదలపై భారం మోపారన్నారు. ప్రజలంతా విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ చేపట్టిన ప్రజాబ్యాలెట్‌లో పాల్గొనాలని షర్మిల పిలుపునిచ్చారు. 
Share this article :

0 comments: