సుప్రీంకోర్టు చెప్పిన గడువు పూర్తయినా సీబీఐ ఎందుకు తాత్సారం చేస్తోంది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టు చెప్పిన గడువు పూర్తయినా సీబీఐ ఎందుకు తాత్సారం చేస్తోంది?

సుప్రీంకోర్టు చెప్పిన గడువు పూర్తయినా సీబీఐ ఎందుకు తాత్సారం చేస్తోంది?

Written By news on Thursday, April 4, 2013 | 4/04/2013

* రుజువులు చూపించకుండా జగనన్నను నెలల తరబడి జైల్లో పెట్టే హక్కు ఎవరిచ్చారు?
* సుప్రీంకోర్టు చెప్పిన గడువు పూర్తయినా సీబీఐ ఎందుకు తాత్సారం చేస్తోంది?
* సీబీఐ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం మీదనే అనుమానాలు కలుగుతున్నాయి
* ఈ సీఎం పాలనలో రాష్ట్రంలో అన్నీ బంద్
* ఈ అసమర్ధ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే మద్దతివ్వకుండా చంద్రబాబు కాపాడారు

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. సీబీఐని వాడుకొని జగనన్నను 10 నెలలుగా జైల్లో బంధించారు. సీబీఐ మోపిన ఆరోపణలలో ఒక్క దానికి కూడా రుజువు చూపించకుండా ఒక ప్రజా నాయకుడైన జగన్‌మోహన్‌రెడ్డిని ఇన్ని నెలల తరబడి జైల్లో పెట్టే హక్కు ఎవరిచ్చారు? సీబీఐ ఏ మాత్రం విలువలు, విశ్వసనీయతలు లేకుండా కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మగా మారి పని చేస్తోంది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి, వేర్వేరు చార్జి షీట్లు కాకుండా అన్నిటినీ కలిపి ఒకే చార్జిషీటు ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.

ఆ గడువు పూర్తయినా సీబీఐ ఇప్పటి వరకు ఏమీ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తోంది?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. ‘‘సీబీఐ కేంద్రం చేతిలో.. కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మైపోయిందనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మన రాష్ర్టంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రజాస్వామ్యం మీదనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికీ, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికీ నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సాగింది. పెడన పట్టణంలోకి అడుగుపెట్టడంతోనే పాదయాత్ర 1,500 కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ఈ కిరణ్ పాలనలో అన్నీ బందే..
‘‘‘ఇప్పుడున్న కిరణ్ కుమార్‌రెడ్డి పాలనలో అప్పుల పాలైపోయినాం.. బతుకు భారమై అల్లాడిపోతున్నామమ్మా’ అని ప్రజలు చెప్తున్నారు. ఈయన గారి పాలనలో వ్యవసాయానికి నీళ్లు బంద్, ఇళ్లకు, పరిశ్రమలకు కరెంటు బంద్, విద్యార్థులకు చదువులు...కార్మికులకు పని.. మన ప్రజలకు మనశ్శాంతి... మన రాష్ట్రానికి అభివృద్ధి బంద్. అన్నీ... మన రాష్ట్రంలో బందైపోయాయి. లేని కరెంటుకు మన పాలకులు మూడింతలు బిల్లులు వసూలు చేస్తున్నారు. నేను పాదయాత్ర చేస్తూ గ్రామాల మీదుగా వస్తున్నప్పుడు ఓ మహిళ అడిగింది ‘అమ్మా.. కిరణ్‌కుమార్‌రెడ్డి గారింట్లో కరెంటు కోత ఉంటుందా? ఆయన కరెంటు బిల్లు కడుతాడా అమ్మా’ అని అడిగింది. లేదు.. కిరణ్‌కుమార్‌రెడ్డి గారింట్లో కరెంటు పోదూ.. ఆయన కరెంటు బిల్లు కట్టడు. కాబట్టే ఆయనకు ప్రజా సమస్యలు తెలియవు. ప్రజల గురించి అర్థం కాదు. ప్రజల నుంచి పుట్టిన నాయకుడైతే ప్రజల కష్టాలను అర్థం చేసుకునే వాడు. కానీ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి సీల్డు కవర్‌లో దిగిపడ్డారు. ప్రతి దాని మీదా చార్జీలు పెంచుకుంటూ పోతున్నారు.

బాబు అండతోనే కిరణ్ విర్రవీగుతున్నారు..
అయ్యా..! ముఖ్యమంత్రీ మీకు రైతులంటే, పేదలంటే ఎందుకంత నిర్లక్ష్యం? ప్రజల మీద కక్షగట్టినట్టు ఎందుకలా వ్యవహరిస్తున్నారు? అని ఈ ప్రజల సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. లేని కరెంటుకు బిల్లులు వసూలు చేసి ప్రజలను పీడించడం అమానుషం అనే విషయం కూడా అర్థం కాకపోతే ఈయనేం ముఖ్యమంత్రి? సర్‌చార్జీల పేరుతో కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.32 వేల కోట్ల భారం ప్రజల నెత్తిన మోపారు.

అది చాలదు అన్నట్లుగా కొత్తగా మరో రూ. 6,500 కోట్లు పెంచారు. వ్యాట్ రూపంలో మరో రూ.10 వేల కోట్ల కుంపటి ప్రజల నెత్తిన పెట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి ఒకటే ధైర్యం. ఏం చేసినా, చంద్రబాబు అండగా ఉంటాడనే ధైర్యంతోనే విర్రవీగుతున్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు బాధ్యత ప్రజల పక్షం నిలబడటం. ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉండి ఉంటే మొన్న అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేవారు. కానీ ఆయన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకూడదని తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేసి ఈ ప్రభుత్వాన్ని కాపాడారు అంటే చంద్రబాబును ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటారా? లేక దుర్మార్గుడు అంటారా?’’

18 అడుగుల వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 110వ రోజు బుధవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చిలకలపూడి సర్కిల్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి బోసువారితోట, పెసరిమిల్లి, హుస్సేనిపాలెం మీదుగా పెడన పట్టణంలోకి ప్రవేశించగానే పాదయాత్ర 1500 కిలో మీటర్లు పూర్తయింది. ఇక్కడే పి. మహంకాళిరావునాయుడు అనే వైఎస్సార్ అభిమాని ఇచ్చినస్థలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన 18 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. పార్టీ నేతలు కె. నాగేశ్వర్‌రావు, ఉప్పాల రాంప్రసాద్, ఖాజా రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో తెచ్చిన 100 ట్రైసైకిళ్లను షర్మిల వికలాంగులకు అందజేశారు.

అంతకుముందు మచిలీపట్నం చర్చిలో షర్మిల ప్రార్థనలు చేశారు, ఆ తరువాత వైకుంఠ రామాలయం వెళ్లి దేవుణ్ణి దర్శించుకున్నారు. వేద పండితులు ఆమెను ఆశీర్వదించారు. హుస్సేనీపాలెం గ్రామ సమీపంలో దర్గాను దర్శించుకున్నారు, ముస్లిం మతపెద్దలు ఆమెకు శాలువా కప్పారు. నడపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 13.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,503.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, నాయకులు ఆర్కే, తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, కుక్కల నాగేశ్వర్‌రావు, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు వాకా వాసుదేవరావు, ఉప్పాల రాంప్రసాద్ తదితరులున్నారు.

నాన్నే ఈ పాదయాత్రకు స్ఫూర్తి..
‘‘జగనన్న నాయకత్వంలో మొదలైన ఈ ‘మరో ప్రజాప్రస్థానం’ వైఎస్సార్, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, గుంటూరు జిల్లాలను దాటుకొని ఈ రోజు కృష్ణా జిల్లా పెడనలో 1,500 కిలో మీటర్లు దాటింది. ఈ పాదయాత్రకు స్ఫూర్తి వైఎస్సార్ చేసిన ‘ప్రజా ప్రస్థానమే’. చంద్రబాబు హయాంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్లకు భరోసా కలిగించడం కోసం, ధైర్యం సడలిన రైతన్నలకు మంచి రోజులు ముందున్నాయని ధైర్యం చెప్పడం కోసం, మండుటెండను సైతం లెక్క చేయకుండా వైఎస్సార్ ఆ మహాయజ్ఞం చేశారు. చంద్రబాబు నాయుడు పాలనకు కొనసాగింపుగా ఇప్పుడున్న కిరణ్ కుమార్‌రెడ్డి పాలన నడుస్తుంటే.. వైఎస్సార్ ప్రజా ప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపుగా.. మంచి రోజులు ముందున్నాయని చెప్పడం కోసమే ఈ ‘మరో ప్రజాప్రస్థానం’ సాగుతోంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈ పాదయాత్ర చేయడం లేదు.

ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది కాబట్టి, ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ప్రజలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాన్ని కాపాడుతోంది కాబట్టి, రైతులకు, చేనేతలకు, కార్మికులకు, విద్యార్థులకు, మహిళలకు మంచి రోజులు మళ్లీ వస్తాయని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని, జగనన్న దాన్ని సాధిస్తారని ధైర్యం చెప్పడం కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నా’’.

- షర్మిల
Share this article :

0 comments: