జగనన్నను విడిపించుకోవలసిన తరుణం ఆసన్నమైంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్నను విడిపించుకోవలసిన తరుణం ఆసన్నమైంది

జగనన్నను విడిపించుకోవలసిన తరుణం ఆసన్నమైంది

Written By news on Wednesday, April 10, 2013 | 4/10/2013

సాహసమే నా ఊపిరి అంటూ రాజకీయంగా దూసుకుపోతూ వున్న జగన్‌కు న్యాయంగా అందవలసిన ‘న్యాయం’ సర్వోత్తమ న్యాయస్థానం నుండి కూడా అందే పరిస్థితులు లేవని గత ఏడాది అక్టోబర్ 5న జగన్ బెయిల్ కేసులో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తేటతెల్లమైంది.

భూ కేటాయింపుల మూలాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో పుట్టుకొచ్చినవేనని తెలిసినా హైకోర్టుగాని, సుప్రీంకోర్టుగాని ఆ మూలాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఎందుకనో ఇష్టపడడం లేదు! కేంద్రప్రభుత్వం 2జీ, బొగ్గు కుంభకోణం వంటి అనేక స్కాములలో మునిగి తేలుతున్నా,

ప్రధానమంత్రికి మాత్రం ఆ అవినీతి మరకలు అంటవు!! కాని మన ఆంధ్రరాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, నిరుద్యోగ సమస్య నిర్మూలించాలని, పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలనీ సదుద్దేశంతో భూకేటాయింపులు జరిపిన దివంగత ముఖ్యమంత్రిని మాత్రం అవినీతిపరునిగా చిత్రిస్తూ, సొంత సంస్థ అయిన సి.బి.ఐ. సహాయంతో కేంద్ర ప్రభుత్వం వై.ఎస్.కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తోంది.

కనుక ఇక వైయస్సార్ పార్టీ జూలు విదిల్చి తక్షణ కర్తవ్యదిశలో ప్రయాణం సాగించి పార్టీని ఇంకా ఇంకా బలోపేతం చేసి జగనన్నను ప్రజాకోర్టు ద్వారా విముక్తుడిని చేయవలసిన తరుణం ఆసన్నమైంది. తక్షణమే ఈకింది చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని నాకు అనిపిస్తోంది...
- మురళీరాం, సికింద్రాబాద్
Share this article :

0 comments: