ప్రజలకు నిజాలు తెలిశాయి కాబట్టే..కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోతోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు నిజాలు తెలిశాయి కాబట్టే..కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోతోంది

ప్రజలకు నిజాలు తెలిశాయి కాబట్టే..కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోతోంది

Written By news on Tuesday, April 30, 2013 | 4/30/2013

రామబాణానికి ఎదురులేదు. రాజశేఖరుని మాటకు తిరుగులేదు. ఇచ్చినమాట నిలబెట్టుకోవడం, చేసిన వాగ్దానం చెల్లించుకోవడం వై.ఎస్. కుటుంబానికే చెల్లు. అందుకు ఆయన ఐదేళ్ల పాలనే నిలువెత్తు సాక్ష్యాల హరివిల్లు. అందుకే జగనన్నపై అంతులేని ప్రజాభిమానపు జల్లు! ప్రస్తుత పాలకులు కూడా ఎన్నో ‘విజయాలు’ సాధించారు. రాజన్న ద్వారా వచ్చిన అధికారం, పదవులు వీళ్లకి కావాలి. కానీ ఆ రాజన్న బిడ్డ మాత్రం వీళ్లకి శత్రువు. రాజన్న బతికుండగా వంగి వంగి సలాములు కొట్టిన కపటనాయకులు... నేడు ఆ వై.ఎస్. కుటుంబంపై నిందలేస్తున్నారు. వీళ్లు ఒక్క విషయం మరిచిపోతున్నారు. 

నిప్పును గుప్పిటతో పట్టుకుంటే చేతులు బొబ్బలెక్కుతాయి. అలాగే నిజాన్ని గుండెల్లో దాచిపెడితే గుండె పగులుతుంది. ప్రజలకు అన్ని నిజాలూ తెలుసు కాబట్టే, రాజన్నను కాదనుకున్న కాంగ్రెస్, ఈ మూడేళ్లుగా అంచెలంచెలుగా కనుమరుగైపోతూ, అపజయాల బాటలో నడుస్తూ కాలగర్భంలో కలిసిపోతోంది. ప్రజల కోసం నిజాయితీగా కష్టపడే నాయకుడు జగన్ అని వారంతా గ్రహించారు కాబట్టే, ఎవరెన్ని నిందలేసినా, చివరకు జైలుపాలు చేసినా గత ఉప ఎన్నికల్లో జగన్‌పార్టీకి బ్రహ్మరథం పట్టి పార్టీని విజయశిఖరాన చేర్చారు. శిశుపాలుని నూరు తప్పుల తర్వాత కృష్ణుడు విజృంభించాడు. 

అప్పుడు శిశుపాలుని గతి ఏమిటో అందరికీ తెలిసిందే. అలాగే కాంగ్రెస్‌పార్టీ తగిన మూల్యం చెల్లించుకోబోతోంది. తండ్రి ఆశయసాధన కోసం నిరంతరం శ్రమించే ఆ యువనేతను అణగదొక్కడం ఎవరికీ సాధ్యం కాదు. అంతులేని ప్రజాబలం అనే ఆయుధంతో, అవధుల్లేని ప్రజాభిమానం అనే ఆశీస్సులతో కుటిలనాయకులు అల్లిన కారుమబ్బుల్లాంటి పద్మవ్యూహాన్ని ఛేదించుకుని అరుణ సూర్యుడిలా వెలుగులు చిందిస్తాడు జగన్. ఇది సత్యం.

- పులివెందుల రమణ, సూరారం, హైదరాబాద్

‘అవిశ్వాసం’ అంటే ఒక కుటుంబాన్ని తిట్టడమా?!

పాలకపక్షం సరిగ్గా లేనప్పుడు, పరిపాలన కుంటుపడినప్పుడు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టితీరాలి. కాని ఇక్కడ మన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టకపోగా పెట్టిన పార్టీలపైన, వ్యక్తులపైన దుమ్మెత్తిపోస్తూ, శాసనసభలో వై.ఎస్. కుటుంబాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుంది. ‘నా ఇష్టమొచ్చినప్పుడు అవిశ్వాసం పెడతాను’ అని ప్రతిపక్ష నేత భావించినపుడు వేరే పార్టీలను విమర్శించకుండా హుందాగా వ్యవహరించాలి. కానీ చంద్రబాబు కనీస మర్యాదలకు భిన్నంగా మాట్లాడారు. అయినప్పటికీ విజయమ్మగారు ఎంతో సంయమనం పాటించారు. ఎవరి విజ్ఞతకు వారిని వదిలేశారు. పాలక, ప్రతిపక్షాలు వై.ఎస్.ఆర్.గారి కుటుంబంపై ఎంత విషం కక్కినా ఆ కుటుంబం పట్ల ప్రజల ఆదరణ, అభిమానం పెరుగుతూనే ఉన్నాయి. 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్సార్‌సీపీదే అధికారం. వై.ఎస్. కుటుంబాన్ని తిట్టినంత మాత్రాన తెలుగుదేశం నాయకులు వాగ్ధాటిగలవారనో, ప్రావీణ్యంగల వారనో, నిజాయితీపరులనో ప్రజలు భావించే అవకాశం లేదు. ఈ వాస్తవాన్ని వారు గ్రహించాలి. టీవీలలో ప్రసారమైన శాసన సభా సమావేశాలలో తెలుగుదేశం నాయకులు మాట్లాడిన తీరు చూసి సామాన్యులు సైతం అసహ్యించుకుంటున్నారు. వీధి రౌడీల్లా అలా గట్టిగా అరవడమేంటి? గట్టిగా మాట్లాడితే భయపడతారనా? అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం. దేశం నాయకులు గానీ, కాంగ్రెస్ వాళ్లు కానీ ప్రజలకు భయపడి పారిపోయి కొన్నిఏళ్లు రాజకీయాలకు దూరంగా ఉండేకాలం దగ్గర్లోనే ఉంది. ప్రతి పౌరుడు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నాడు. ఒక మహిళ పట్ల కనీస గౌరవాన్ని కూడా చూపడం లేదు. అందుకు వీరంతా త్వరలోనే తగిన శిక్ష అనుభవించక తప్పదు. 

- విద్యావతి, కర్నూలు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: