రియల్ లీడర్ ఎలా ఉంటాడో...ఆరోజు నేను జగనన్నలో చూశాను! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రియల్ లీడర్ ఎలా ఉంటాడో...ఆరోజు నేను జగనన్నలో చూశాను!

రియల్ లీడర్ ఎలా ఉంటాడో...ఆరోజు నేను జగనన్నలో చూశాను!

Written By news on Sunday, April 21, 2013 | 4/21/2013

 ర్నూలు ఓదార్పు యాత్రలో జగనన్న ఒక మాట చెప్పాడు... ‘‘వీళ్లు నా కాళ్లు విరగ్గొట్టొచ్చు. లేదా నా వెన్నెముక విరగ్గొట్టొచ్చు. ఇంకేమైనా చేయొచ్చు. ఏం చేసినా నేను మాత్రం మళ్లీ కెరటంలా ఎగిరి పడతాను’’ అని! ఈ మాటలు విన్న తర్వాత నేను జగనన్న వీరాభిమానిని అని చెప్పుకోవటానికి ఎంతో గర్వపడ్డాను.

నా పేరు విజయ్. మాది కనిగిరి దగ్గర పెద్దగొల్లపల్లి అనే ఒక మారుమూల గ్రామం. నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటాను. మా ఊరికొచ్చిన మొట్టమొదటి రాష్ట్రస్థాయి నాయకుడు జగనన్న. పేదల దేవుడు వైయస్సార్ చనిపోయిన తర్వాత అంతటి భరోసా ఇవ్వగలిగిన నాయకుడు ఆయన తనయుడు మాత్రమేనని నా నమ్మకం. జగనన్నని నేను ఎన్నో సార్లు దగ్గరగా చూసాను. కాని కలిసింది మూడేసార్లు. ఒకసారి కడప, పులివెందుల ఉపఎన్నికల ముందురోజు కలిసాను. ఆ ఎన్నికలు ఆయన జీవితాన్ని, మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేసే ఎన్నికలు. దేశవ్యాప్తంగా అందరి కళ్లూ ఆ ఎన్నికలపైనే. అయినా కూడా జగనన్న మమ్మల్ని నిరాశ పరచకూడదు అన్న ఉద్దేశంతో సాయంత్రం అయిదు గంటలకు కలిసే అవకాశం ఇచ్చారు. 

ఒక సాధారణ ఎమ్మెల్యే కూడా ఎన్నికల ముందు రోజు సాయంత్రం సొంత మనుషులను సైతం కలిసేందుకు ఇష్టపడని ఈ రోజుల్లో జగనన్న మాకు పదిహేను నిముషాలపాటు మాట్లాడే అవకాశం ఇచ్చారు. కలిసిన ప్రతిసారి మన కాబోయే ముఖ్యమంత్రి ఇంత సింపుల్‌గా ఉంటాడా... జనంతో ఇంతగా మమేకమై మాట్లాడతాడా అనిపిస్తూ ఉండేది. ఇంటర్నెట్‌లో కలిసిన జగనన్న అభిమానులం (సునీల్, నవాజ్, చైతన్య, నేను) బెంగళూరులో వైయస్సార్ ‘ఇంటలెక్చువల్ ఫోరం’ పేరుతో ఒకవేదికను ఏర్పరచుకొన్నాం. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే పన్నెండు వందల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో బెంగళూరులో ఒక భారీ మీటింగ్ పెట్టి, కర్ణాటకలో ఉన్న ప్రతి వైయస్సార్ అభిమానిని ఆ వేదిక మీదకి తీసుకొచ్చాం.

వైయస్సార్ కుటుంబం మీద మా అభిమానానికి ఎన్నో కారణాలున్నాయి. జగనన్నను ఓదార్పుయాత్ర చేయమని ఎవరూ కోరలేదు. అయినా తండ్రికోసం చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చేందుకు బయలుదేరాడు. ఎండనక వాననక చలిని లెక్కచేయకుండా రేయింబవళ్లు ఊరూరా తిరుగుతూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఒక్కరోజు మండుటెండలో తిరిగొస్తేనే రెండు రోజులు రెస్ట్ తీసుకుంటాం. అలాంటిది ఆయన నెలల తరబడి రోజుకు 18 గంటల పైగా ప్రజల మధ్య తిరుగుతున్నాడంటే అతను అందరిలాంటి మనిషి కాదని అర్ధమైపోతుంది. అలా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజాభిమానం అనే సంపదను రోజురోజుకు కూడబెట్టుకుంటున్న ప్రజానాయకుణ్ణి జైలులో కూర్చోబెట్టిన వారి కుటిల నీతిని అర్థం చేసుకోవటం ఆంధ్రరాష్ట్ర ప్రజలుగా మాకు పెద్ద కష్టమేమీ కాదు. 

అతను దమ్మున్న నాయకుడు కాబట్టే జైలులో ఉండి కూడా పార్టీని నడిపించాడు. గెలిపించాడు. కాంగ్రెస్, టి.డి.పీల చెంప చెళ్లుమనిపించాడు. జగనన్న తాను నమ్మిన సిద్ధాంతాల కోసం భారీ శక్తులను ఎదుర్కోవటానికి సిద్ధమయ్యాడు. దేశంలోనే అత్యంత శక్తిమంతురాలైన సోనియా ముందు తల వంచినట్టైతే ఈరోజు ఐటీ దాడులు ఉండేవి కాదు. సీబీఐ విచారణ ఉండేది కాదు. కేసులూ ఉండేవి కాదు. అసలు జైలులోనే ఉండేవాడు కాదు. వైయస్సార్‌ని అప్రతిష్టపాలు చేయటానికి ఎన్నోశక్తులు అహర్నిశలు శ్రమించాయి. మిత్రులే శత్రువుల పంచన చేరారు. ప్రజలు మాత్రం ఆ కుటుంబం వైపే గట్టిగా నిలబడ్డారు. జగన్‌ని ఒక్కడిని చేసి ఇంతమంది రాబందుల్లా పీడిస్తున్నారనే కోపంతో రాబోయే ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. 

కర్నూలు ఓదార్పుయాత్రలో జగనన్న ఒకమాట చెప్పాడు... ‘‘వీళ్లు నా కాళ్లు విరగ్గొట్టొచ్చు. లేదా నా వెన్నెముక విరగ్గొట్టొచ్చు. ఇంకేమైనా చేయొచ్చు. ఏం చేసినా నేను మాత్రం మళ్లీ కెరటంలా ఎగిరి పడతాను’’ అని! ఈ మాటలు విన్న తర్వాత నేను జగనన్న వీరాభిమానిని అని చెప్పుకోవటానికి ఎంతో గర్వపడ్డాను. జగన్‌ని నిర్బంధించామని రాష్ట్ర నాయకులు రాక్షసానందం పొందినా, పచ్చపత్రికలు పైశాచిక ఆనందం పొందుతున్నా అది నీటిమీద బుడగ లాంటిది మాత్రమే. ఈ దానవ మానవ యుద్ధంలో ప్రస్తుతానికి చెడు గెలిచినట్టు అనిపించినా చివరకు మంచే గెలుస్తుంది. 

కష్టపడకుండా వాయిలార్ రవి చుట్టూ, ఆజాద్ చుట్టూ, అహ్మద్‌పటేల్ చుట్టూ, సోనియమ్మ చుట్టూ తిరిగి అందలం ఎక్కేవారు ఎక్కుతూనే ఉంటారు. కాని అలాంటి వాళ్లు పేదవాడి హృదయాలలో స్థానం దక్కించుకున్న దాఖలాలు చరిత్రలో లేవు. సహనంతో కూడిన సాహసంతో, గుండె ధైర్యమే ఊపిరిగా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే నాయకుడినే ప్రజలు ఆదరిస్తారనేది సత్యం. అలా ఆదరింపబడినవాడే లీడర్. ఆ లీడరే జగన్. ఆల్ ద బెస్ట్ జగనన్న. వైయస్సార్ గారు బతికుంటే రాష్ట్రంలో వెనుకబడిన మా కనిగిరి ప్రాంతాన్ని వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కచ్చితంగా అభివృద్ధి చేసేవారు. అలాగే జగనన్న కూడా కనిగిరి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాడని ఆశిస్తున్నాను. 

- విజయ్, ఎలక్ట్రానిక్స్ సిటీ, బెంగళూరు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: