ప్రజాదరణే జగన్‌కు శ్రీరామరక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాదరణే జగన్‌కు శ్రీరామరక్ష

ప్రజాదరణే జగన్‌కు శ్రీరామరక్ష

Written By news on Friday, April 19, 2013 | 4/19/2013

అప్పట్లో పెద్దలు సరదాగా ఒక విషయం చెప్పేవారు. ఒక తెగకు చెందిన కొందరు అమాయకులు ఎండుటాకులపై ఇసుకను జల్లి, తద్వారా వచ్చే గలగలల శబ్దంతో కిలకిలా నవ్వుకుని ఆనందపడేవారట. ఇదెందుకు చెప్పాల్సివస్తోందంటే... జగన్‌ను జైలుకు పంపించి, బెయిల్ రాకుండా చేస్తున్నామని కాంగ్రెస్, టీడీపీలు ఆనందపడటం కూడా అలాంటిదేనని. అయితే ఒక్క తేడా. పైన చెప్పుకున్నవారు నిజమైన అమాయకులు. 

ఈ రెండు పార్టీలవాళ్లు మాత్రం రాజకీయ కాలాంతకులు. మంత్రాలకు చింతకాయలు రాలవన్నది ఎంత సత్యమో, వీళ్ల నీచమైన కుట్రలకు కుతంత్రాలకు జగన్ తల వంచడన్నది అంతే నిజం. భవిష్యత్తులో జగన్ ఎదుగుదలను ఊహించి ముచ్చెమటలు పట్టి అరెస్ట్ అనే ఈ నీచపర్వానికి కాంగ్రెస్ తెరలేపితే, చంద్రబాబు తందానా అంటూ వంతపాడి జగన్‌ను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం ప్రజలు గమనించకపోలేదు. జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నవారికి, వై.ఎస్. భిక్షతో రాజకీయ జీవితం గడుపుతూ పదవులు వెలగబెడుతున్నవారికీ చిన్నమాట. 

మీరు మంత్రులో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఎమ్మెల్సీలో కావచ్చు. మనది ప్రజాస్వామ్యవ్యవస్థ అని మీరు నమ్మినట్లయితే, ఈ రాష్ట్రంలో ఏ నియోజక వర్గం నుండైనా సరే మీలో ఒక్కరు సోనియా, రాహుల్‌ల ఫొటోలు పెట్టుకుంటారో, మీవద్ద ఉన్న బ్లాక్‌మనీ వెదజల్లుతారో, మద్యం ఏరులై పారిస్తారో మీ ఇష్టం. మీ మీద ఒక అతిసామాన్యుడిని, రాజకీయానుభవం, ధనం లేని వ్యక్తిని నిలబెట్టి కేవలం స్వర్గీయ వైఎస్సార్ ఫొటో, జగన్ ఫొటోతో బరిలోకి దింపుదాం. గెలవగలరా? మీ వల్ల కాదు. తెలుగువాళ్లు ఒక్కసారి అభిమానం పెంచుకుంటే, ఎప్పటికీ బాసటగా నిలుస్తారు. అదే జగన్‌కు శ్రీరామరక్ష.

- ఆరిఫ్ బాషా షేక్, సూళ్లూరుపేట, నెల్లూరు


నీ రాక కోసం... రాష్ట్రం ఎదురుచూస్తోంది

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీనే అభిమానిస్తున్నాను. నేనే కాదు, మా తాత ముత్తాతల నుంచీ కాంగ్రెస్‌నే కొనియాడేవారు. జోడెద్దుల గుర్తు, తర్వాత ఆవు దూడ, ఆ తర్వాత హస్తం గురించి గొప్పగా చెప్పేవారు. త్యాగాలు చేసిన మహనీయులు, సంస్కరణవేత్తలు కాంగ్రెస్ నుండి పుట్టినవారని కథలు కథలుగా చెప్పేవారు. తరాలు అంతరిస్తున్నా, తరానికో యుగపురుషుడు అన్నట్లు వైఎస్సార్ ఆ పార్టీ ఉనికిని మనరాష్ట్రంలో బలోపేతం చేశారు. ప్రజల కోసమే ఆలోచించి, ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, అన్ని వర్గాల వారికీ వరాలు కురిపించిన ప్రజాబంధువు. 

తన పాలనా విధానం ఎప్పటికీ కుంటుపడకుండా ఉండడానికి ఆయన తన వారసుడు జగన్‌ని ప్రజల ముందు నిలిపి అతడి భుజాలపై బాధ్యతను మోపారనిపిస్తోంది! తండ్రి చేపట్టిన పథకాలు కొనసాగించడానికై ప్రజాహిత కార్యక్రమాల నిర్వహణనే జగన్ తన ఊపిరిగా భావించి, ప్రజల్లో మమేకమై తన పదవిని కూడా త్యాగం చేయగా, ‘కాదు కూడదు నువ్వే మా నాయకుడివి’ అని ప్రజలు మళ్లీ గెలిపించి, తమ ప్రేమాభిమానాలను వ్యక్తపరచారు. జగన్‌బాబు కోసం రాష్ట్రం అహర్నిశలూ ఎదురుచూస్తోంది. త్వరగా ఆయన కల్పిత అభాండాల నుండి బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. 

- కళ్యాణ్‌కర్ లక్ష్మీబాయి, సికింద్రాబాద్

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: