సుప్రీంకోర్టుతీర్పుకూ వక్రభాష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుప్రీంకోర్టుతీర్పుకూ వక్రభాష్యం

సుప్రీంకోర్టుతీర్పుకూ వక్రభాష్యం

Written By news on Saturday, April 20, 2013 | 4/20/2013

సరిహద్దు వివాదం కారణంగా సుప్రీంకోర్టు లీజులు
సస్పెండ్ చేసిన గనులు అసలు గాలి జనార్దన్‌రెడ్డివి కాదు
అవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన లీజులు అసలే కాదు
‘సుప్రీం’ తీర్పును వక్రీకరించి రాసిన వార్త పక్కనే
వై.ఎస్.జగన్ కార్టూన్ వేయటంలో ఔచిత్యం ఏమిటి?
ఇది ‘ఎల్లో మీడియా’ నీచ సంస్కృతికి నిదర్శనం
ఈ కుట్రలను జనం గమనిస్తున్నారు.. తగిన బుద్ధి చెప్తారు

 ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన జరిగినా దాన్ని గాలి జనార్దన్‌రెడ్డికి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆపాదించటం ‘ఎల్లో మీడియా’ దుర్మార్గానికి, నీచ సంస్కృతికి ప్రబల నిరద్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత శోభానాగిరెడ్డి విమర్శించారు. జననేతగా ప్రజల గుండెల్లో స్థానం పొందిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రజల మనిషిగా నిలిచిన ఆయన తనయుడు జగన్‌లపై బురద చల్లేందుకు ఆఖరుకు సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వక్రభాష్యం చెప్పే స్థాయికి ‘ఎల్లో మీడియా’ దిగజారిందని ఆమె ధ్వజమెత్తారు. శోభానాగిరెడ్డి ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘ఆంధ్ర - కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దు వివాదం ఉన్న ఏడు మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. అయితే వీటితో గాలి జనార్దన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా ‘సుప్రీం సస్పెండు చేసిన ఏడు మైనింగ్ లీజుల్లో ‘గాలి’కి చెందినవి నాలుగు ఉన్నాయని (ఈనాడు) బ్యానర్ వార్తలో పేర్కొంది. దాంతో మాకు సంబంధం లేదు. అయితే ఈ తప్పుడు వార్త పక్కనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పది తలలతో చూపుతూ కార్టూన్ వేయటం ద్వారా మా నేతకు, గాలి జనార్దన్‌రెడ్డికి మధ్య లింకు ఉందని చాటేందుకు ఈనాడు కుట్రపూరితంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు వార్త పక్కనే శ్రీరామనవమి పేరిట జగన్‌కు పది తలల ఉన్నట్లు కార్టూన్ ప్రచురించటంలో ఔచిత్యం ఏమిటో? ఈనాడు అధినేత చెప్పాలి. మరో తోక పత్రిక వైఎస్ అండతో గాలి చెలరేగిపోయారంటూ అడ్డగోలుగా వార్త రాసింది.

సుప్రీంకోర్టు తీర్పుకు వైఎస్ ప్రభుత్వానికి అసలు సంబంధం ఏమిటి? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన లీజులు అసలు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవే కాదు. అలాంటప్పుడు వాటిని వైఎస్‌కు ఆపాదించటం ఎల్లో మీడియా కుట్రకాదా?’’ అని ఆమె నిలదీశారు. ‘‘కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్ లీజులు తీసుకున్న కొందరు నేతలు అక్రమాలకు పాల్పడ్డారని తేల్చిన సుప్రీంకోర్టు 49 గనుల లీజులను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఉన్న మరో ఏడు లీజులను సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకూ సస్పెన్షన్‌లో ఉంచాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇవి పూర్తిగా కర్ణాటక రాష్ట్రం కేటాయించిన గనులు. వీటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.

పెపైచ్చు ఈ వివాదం ఉన్న గనుల్లో గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన గనులు లేవు. అయినా నాలుగు గాలి గనులను ‘సుప్రీం’ సస్పెండ్ చేసిందని ఎల్లో మీడియా దుష్ర్పచారం చేయటం, దీనికి మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కార్టూన్‌ను జత చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘గాలి జనార్దన్‌రెడ్డిపై ఎల్లో మీడియా రాసుకున్న అంశాలతో మాకు సంబంధంలేదు. అయితే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, మా పార్టీ నేత జగన్‌కు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు ఎల్లో మీడియా రాయటాన్ని మేం ఖండిస్తున్నాం. ఇది ఎల్లో మీడియా కుట్రకు నిదర్శనం. జనం వాస్తవాలు గమనిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వక్రభాష్యం చెప్పే ‘ఎల్లో మీడియా’కు, వాటిని వెనుకుండి నడిపిస్తున్న నేతలకు ప్రజలు త్వరలోనే తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు’’ అని ఆమె హెచ్చరించారు.

అవి మావి కాదు: గాలి సోమశేఖరరెడ్డి
సాక్షి, బెంగుళూరు: కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన ఏడు లీజుల్లో గాలి జనార్దన్‌రెడ్డికి చెందినవి లేవని ఆయన సోదరుడు, బళ్లారి శాసనసభ్యుడు గాలి సోమశేఖరరెడ్డి తెలిపారు. గాలికి చెందిన నాలుగు లీజులను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిందని మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తూ ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు రద్దు చేసిన కర్ణాటకలోని 49 మైనింగ్ లీజుల్లో తమకు చెందినది అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ ఒక్కటి మాత్రమే ఉందని, మిగిలిన 48 లీజులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

‘‘మాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల్లోని (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన) మైనింగ్ లీజులపై సుప్రీంకోర్టులో అసలు వాదనలు పూర్తికాలేదు. వీటికి సంబంధించి త్వరలో వాదనలు జరగనున్నాయి. అవి 2009 నుంచి సస్పెన్షన్‌లో ఉన్నాయి. వాస్తవాలివి కాగా గాలికి చెందిన నాలుగు గనులను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిందంటూ కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు’’ అని సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు.
Share this article :

0 comments: