మంత్రి ఆనం వ్యాఖ్యలపై ఎంపి మేకపాటి ఆగ్రహం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మంత్రి ఆనం వ్యాఖ్యలపై ఎంపి మేకపాటి ఆగ్రహం

మంత్రి ఆనం వ్యాఖ్యలపై ఎంపి మేకపాటి ఆగ్రహం

Written By news on Friday, April 12, 2013 | 4/12/2013

హైదరాబాద్: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ ఆశీస్సుల కోసం మంత్రి ఆనం అలా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆనాడు మంత్రి ఆనం అన్నట్లు తెలిపారు. జగన్ 60 అడుగుల కటౌట్ పెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజు పొగిడి, ఈరోజు విమర్శించడం ఏమిటని ఆయన అడిగారు. రాజకీయ లబ్ది కోసమే అని అర్ధమవుతోందన్నారు. ప్రజలు కూడా ఇదంతా గమనిస్తున్నారని చెప్పారు. ఆనం సోదరులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరకొచ్చిందన్నారు. బయ్యారం గనులతో తనకు సంబంధంలేదని బ్రదర్ అనీల్ ఎప్పుడో చెప్పారన్నారు.

ఆనం సొంత సోదరుడు జయకుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకపాటి తెలిపారు


Share this article :

0 comments: