ఈ విజయనామ సంవత్సరం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ విజయనామ సంవత్సరం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ...

ఈ విజయనామ సంవత్సరం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ...

Written By news on Thursday, April 11, 2013 | 4/11/2013

ఈరోజు ఉగాది. ఈ కొత్త సంవత్సరం ప్రజలకు దేవుని దయ, సుఖసంతోషాలు, సిరిసంపదలు, సకలవిధములైన సౌభాగ్యాలు చేకూరునుగాక అని జగన్, నేను ప్రార్థిస్తున్నాము. ఈ సంవత్సరం విజయనామ సంవత్సరం. ఈ సంవత్సరం న్యాయానికి, వెలుగుకు, మంచితనానికి, మానవత్వానికి, నిజాయితీకి, విశ్వసనీయతకు విజయం చేకూరునుగాక అని మేము ఆకాంక్షిస్తున్నాము.

గత మూడున్నర సంవత్సరాలుగా అనగా సెప్టెంబర్ 2009 నుండి రాష్ట్రం అనుభవిస్తున్న విపరీత పరిస్థితుల నుండి ఈ సంవత్సరం రాష్ట్రానికి విడుదల కలుగును గాక అని జగన్, నేను కోరుకుంటున్నాము. 2004 నుండి 2009 వరకు రాష్ట్రం సుభిక్షంగా, సంతోషంగా, సస్యశ్యామలంగా, కళకళలాడుతూ ఉండింది. దీనికి ప్రజలే సాక్షి.

సరిపడా వర్షాలు, సమృద్ధిగా నీళ్లు, అవసరమైనంత కరెంటు, రైతులకు గిట్టుబాటు ధరలు, విద్యార్థులకు సమయానికి పరీక్షలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్, అందరికీ అందుబాటులో ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యం, పార్టీలకు అతీతంగా ఆరోగ్య అవసరాలు గలవారికి సిఎం రిలీఫ్ ఫండ్, 108, 104, ప్రతిఒక్క కుటుంబానికి సొంత ఇల్లు, వృద్ధులకు పెన్షన్, ఆడవాళ్లకు పావలా వడ్డీ, రైతులకు వడ్డీలేని రుణాలు, ఉచిత విద్యుత్తు, ప్రభుత్వ ఉద్యోగులకు కావలసిన భరోసా, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, అదుపులో వున్న ద్రవ్యోల్బణం నడుమ నడిచిన పాలన, నిజంగా రాజశేఖరరెడ్డి గారి పాలన దేవుని చేత సంపూర్ణంగా ఆశీర్వదించబడిన పాలన. అటువంటి నాయకుని పాలనలో పయనించడం రాష్ట్రం యొక్క సుసౌభాగ్యం.

మనందరి దురదృష్టవశాత్తు అటువంటి మహానేతని, ఆయన నాయకత్వాన్ని మనమందరం పోగొట్టుకున్నాం. ఆయన మరణవార్త ఇంకా కుదుటపడకముందే వరదలు, ప్రత్యేక, సమైక్య రాష్ట్ర ఉద్యమాలు, కరువులు, ఆందోళనలు, కరెంటు కోతలు, తాగునీటి, సాగునీటి కొరత... ఇలా రకరకాల సమస్యలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వీటిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో అవ్వ తాతల దగ్గర నుండి ఎల్‌కెజి పిల్లల వరకు ఈ నాయకత్వ వైఫల్యం యొక్క ఫలితాన్ని చవిచూడవలసి వచ్చింది. అటు వర్షాలు పడక, ఇటు కరెంటు లేక వ్యవసాయరంగం మూలుగుతూ వుంటే మరోవైపు పెరుగుతున్న ధరలు, రాజకీయ అనిశ్చితి, కరెంటు కష్టాలతోపాటు సీబీఐ కేసుల పేరుతో వ్యాపారవేత్తలను పీడించడంతో పారిశ్రామికరంగం ఇతర రాష్ట్రాలకు తరలివెళుతూ వుంది. దాంతో మన యువతకు వచ్చే ఉద్యోగాలు కూడా తరలివెళ్లాయి. 2009 నుండి నేటివరకు జరిగిన ఈ రాష్ట్ర తిరోగతికి ప్రజలే సాక్షి!

ఇదిలావుంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, దాని నాయకుడు చందబాబు... ప్రజలు తన మీద నమ్మకం ఉంచి ఇచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలను అవిశ్వాస సమయాలలో బేరానికి పెట్టి, ఈ ప్రభుత్వ వైఫల్యాలలో తన వంతు భాగం పంచుకుంటూ, సహాయసహకారాలు అందిస్తున్నారు. దీనికి ప్రజలే సాక్షి!

ఈ ఉగాది పర్వదినాన ప్రతి కుటుంబం ఆ దేవదేవుని ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ధనధాన్యాలతో దీవింపబడాలని, మన రాష్ట్రం అన్ని రంగాలలో మంచి నాయకత్వం కింద త్వరితగతిని అభివృద్ధి, సంక్షేమ పథంలో తిరిగి నడవాలని పూర్ణ మనస్సుతో, జగన్, నేను దేవుని వేడుకుంటున్నాము.


- వైఎస్ భారతి
w/
o వైఎస్ జగన్
Share this article :

0 comments: