ఎన్టీఆర్‌కు విలువలే లేవన్నావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్టీఆర్‌కు విలువలే లేవన్నావు

ఎన్టీఆర్‌కు విలువలే లేవన్నావు

Written By news on Thursday, April 11, 2013 | 4/11/2013

- ఇప్పుడు యుగపురుషుడని ప్రశంసిస్తున్నావు
- చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత జనక్ ప్రసాద్ ధ్వజం

 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్‌ను యుగపురుషుడు, కారణజన్ముడంటూ పాదయాత్రలో పొగుడుతున్న చంద్రబాబు 1995లో ఆయన గురించి ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బి.జనక్‌ప్రసాద్ సూచించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం నుంచి దించేసినప్పుడు మీరు మాట్లాడిన మాటలేంటి? వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన ఘటనలు తెలుగు ప్రజలు మరిచిపోయారని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తర్వాత ‘ఇండియాటుడే’ ప్రతినిధి అమర్‌నాథ్ కె.మీనన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఏం మాట్లాడారో బాబు గుర్తుచేసుకోవాలన్నారు. ‘ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవన్నావ్. తెలుగుదేశం పార్టీ అసలు ఎన్టీఆర్‌దే కాదన్నావ్. పార్టీతో సంబంధంలేద న్నావ్. ఆయనకు మతిస్థిమితం లేదంటూ పార్టీ సభ్యత్వ పుస్తకాల్లో ఎన్టీఆర్ బొమ్మను తొలగించింది నీవు కాదా?’ అని ప్రశ్నించారు. తండ్రిని జైల్లో పెట్టి అధికారం కోసం సోదరుల్ని చంపించిన జౌరంగజేబు కంటే నీచుడు చంద్రబాబని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను జనక్‌ప్రసాద్ గుర్తుచేశారు.

ఒక్క మంచి పనైనా చేశావా?
మహానేత వైఎస్ అందించిన సువర్ణ పాలన వల్ల పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, అది జీర్ణించుకోలేక చంద్రబాబు అనునిత్యం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బాబు తన హయాంలో ఒక్క మంచి పనైనా చేశారా? అని ప్రశ్నించారు.

‘ఒక్క ప్రాజెక్టు కట్టావా? ఆరోగ్యశ్రీ లాంటి పథకం తెచ్చావా? 108 సర్వీసులు పెట్టావా? మహారాష్ట్ర, కర్ణాటక ఇష్టమొచ్చినట్టు డ్యాములు కడుతుంటే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి నిద్రపోయిన మాట వాస్తవం కాదా? మీ నిర్వాకం వల్లే రాష్ట్రంలో 15వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటం వాస్తవం కాదా’ అని ఎండగట్టారు. ఇలాంటి వ్యక్తికి వైఎస్‌ను విమర్శించే అర్హతలేదన్నారు. నిత్యం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్న చంద్రబాబు కుమారుడు లోకేష్ బాగోతాలను బయటపెడితే మహిళలు చీపుర్లు పట్టుకొని వెంటపడి తరిమి కొడతారని హెచ్చరించారు. సంస్కారం ఉంది కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్లటం లేదన్నారు.
Share this article :

0 comments: