చరిత్రహీనుడు చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చరిత్రహీనుడు చంద్రబాబు

చరిత్రహీనుడు చంద్రబాబు

Written By news on Sunday, April 28, 2013 | 4/28/2013

తొమ్మిదేళ్లు సీఎంగా చేశారు..ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా?
చెప్పుకొనేందుకు ఏమీ లేక ఎన్టీఆర్‌ను పొగుడుతూ పబ్బం గడుపుకొంటున్నారు
మీ పాలనలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు పెట్టి పేదల ప్రాణాలు తీశారు
అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించారు
స్కాలర్‌షిప్ అడిగిన విద్యార్థులను లాఠీలతో కొట్టించారు
ఈ ప్రభుత్వం వైఎస్ పథకాలకు తూట్లు పొడుస్తోంది

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు చరిత్రహీనుడిగా గుర్తింపు పొందుతారని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు.. ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. చెప్పుకునేందుకు ఏమీలేకపోవడంతోనే ఎన్టీఆర్‌ను పొగుడుతూ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, అంగడి చిట్టెంపల్లిల్లో ‘రచ్చబండ’ కార్యక్రమం అనంతరం వికారాబాద్‌లో నిర్వహించిన సభలో విజయమ్మ ప్రసంగించారు. ‘‘విద్యుత్ చార్జీలు పెంచి రైతులపై కేసులు పెట్టారు. రైతులు దొరక్కపోతే వారి భార్యలను జైల్లో పెట్టారు. మీ వల్ల 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

నష్టపరిహారం ఇవ్వాలని కోరితే.. పరిహారం కోసం చనిపోయారని రైతుల ఆత్మాభిమానం దెబ్బతీశారు’’ అంటూ బాబుపై నిప్పులు చెరిగారు. ‘‘ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు పెట్టి.. పేదల ప్రాణాలు తీశారు. వేతనాల కోసం పోరాడిన అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించారు. స్కాలర్‌షిప్‌లు అడిగిన విద్యార్థులను లాఠీలతో కొట్టించారు. రాష్ట్ర సీఎంలలో మీలాంటి చరిత్రహీనుడు మరొకరు ఉండ రు. వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు.. నిజం చెప్పని వారెవరంటే గుర్తొచ్చేదీ బాబే’’ అని విమర్శించారు. ఎల్‌అండ్‌టీ, రహేజా, ఎమ్మార్, ఐఎంజీలకు అడ్డగోలుగా భూసంతర్పణ చేసింది బాబేనని దుయ్యబట్టారు. కోట్లు పలికే భూములను చౌకధరలకే కట్టబెట్టారని, 54 పరిశ్రమలను అమ్మేసి.. నామా నాగేశ్వరరావు, రామోజీరావు, సీఎం రమేశ్, సత్యం రామలింగరాజుకు ధారాదత్తం చేశారన్నారు.

అవిశ్వాసం పెడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించారు..

‘‘ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి రారు. చిన్న పార్టీలన్నీ అవిశ్వాసం పెడితే ప్రభుత్వాన్ని రక్షిస్తారు. చీకట్లో ఒప్పందాలు కుదుర్చుకొని కేసుల నుంచి బయటపడ్డ మీదీఒక బతుకేనా..’’ అని చంద్రబాబుపై విజయమ్మ ధ్వజమెత్తారు. కాంగెస్ సర్కారుతో కుమ్మక్కై అక్రమంగా, అన్యాయంగా జగన్‌పై కేసు పెట్టారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సీబీఐ కీలుబొమ్మలా వ్యవహరిస్తోందని విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో నివేదికను న్యాయ మంత్రికి చూపి.. సుప్రీంకోర్టులో ఆఫిడవిట్‌ను దాఖలు చేసిందంటే ఆ సంస్థ విశ్వసనీయతను అర్థం చేసుకోవచ్చని అన్నారు. తమను వ్యతిరేకించే వారిని వేధించేందుకు కాంగ్రెస్ సర్కారు సీబీఐని ప్రయోగిస్తోందని, మాయావతి, ములాయం, జయలలితను కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టిన ప్రభుత్వం.. మంత్రులు సబిత, మోపిదేవి, ధర్మాన విషయంలో ఒక్కొక్కరికి పట్ల ఒక్కో రకంగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబును విచారించేందుకు సిబ్బంది లేరని చెప్పిన సీబీఐ.. జగన్ కేసులో మాత్రం ఆగమేఘాల మీద దాడులు చే సిందని గుర్తుచేశారు.

అమ్మహస్తంతో మభ్యపెడుతున్నారు!: ‘‘దివంగత నేత వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల్లో ఒక్కటైనా తీసేసినట్లు నిరూపించాలని బొత్స సవాల్ విసురుతున్నారు. గడప గడపను అడుగు.. వైఎస్ ఏం చేశారో.. మీరేం చేస్తున్నారో తెలుస్తుంది. ఈరోజు అనేక సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. రూ.40 వేల కోట్ల బడ్జెట్ అయినా... 1.06 లక్షల కోట్ల బడ్జెట్ అయినా వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, అడిగినవారికి కాదనకుండా ఇళ్లు, పింఛన్లు మంజూరు చేశారు. ఇప్పుడు రూ.1.60 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా.. అన్ని పథకాల్లో కోత విధించారు..’’ అని విజయమ్మ చెప్పారు. ‘‘వైఎస్ మానస పుత్రిక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో తెలంగాణలో 16 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలనుకున్నారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెల్లకార్డుదారులకు ప్రతినెలా 30 కేజీల బియ్యం ఇవ్వాలన్న వైఎస్ ఆలోచనను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. అమ్మహస్తం పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని దుయ్యబట్టారు. అమ్మహస్తం పథకంతో కొత్తగా ఒరిగిందేమీలేదంటూ.. ‘‘సంచిలో పసుపు, ఉప్పు, కారం పెట్టారు. అవి కూడా కొన్ని గ్రాములు. అరకిలో పప్పు, అరకిలో గోధుమలు ఇస్తూ కొత పెట్టారు. ఇవి నెల రోజులు ఎలా సరిపోతాయో సీఎం చెప్పాలి..’’ అని ప్రశ్నించారు. వైఎస్ అప్పుడే ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం నిధులిచ్చారని చెప్పారు. ఇప్పుడు సీఎం కిరణ్ సబ్‌ప్లాన్ అంటూ ఆర్భాటం చేస్తూ.. దళితబంధు బిరుదులతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రచారం కోసం రూ.కోట్ల లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

ఎన్నికలు పెట్టండి.. ప్రజలు ఎటువైపో తేలుతుంది: కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు వెలివేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విజయమ్మ చెప్పారు. ‘‘జగన్‌ను ఉరితీయాలని, వైఎస్ కుటుంబాన్ని వెలేయాలని కొందరు మంత్రులు అంటున్నారు. జనం ఆదరణ, అభిమానం ఉన్నన్ని రోజులు మమ్మల్ని ఎవరు వెలేయలేరు. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చిన ఎమ్మెల్యేలపై వేటువేసి ఉప ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరిని వెలేస్తారో తేలిపోతుంది..’’ అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనాయకురాలు శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, పిన్నెల్లి రామక ృష్ణారెడ్డి, పార్టీ సలహాదారు సోమయాజులు, నేతలు కొణతాల రామకృష్ణ, ఇంద్రకరణ్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రోజా, విజయారెడ్డి, సూర్యప్రకాశ్, పుత్తాప్రతాపరెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.
Share this article :

0 comments: