జిఓ ఇచ్చిన మంత్రులు బయట- జగన్ జైల్లో! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జిఓ ఇచ్చిన మంత్రులు బయట- జగన్ జైల్లో!

జిఓ ఇచ్చిన మంత్రులు బయట- జగన్ జైల్లో!

Written By news on Saturday, April 20, 2013 | 4/20/2013

జిఓలు ఇచ్చిన మంత్రులను బయటపెట్టి, వాటితో ఏ సంబంధం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని అరెస్ట్ చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. 26 జిఓలకు మొత్తం మంత్రి మండలి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. బయ్యారం గనుల విషయంలో ఎల్లోమీడియా అసత్యప్రచారం చేస్తోందని చెప్పారు. జగన్ కు, ఓఎంసి యజమాని గాలి జనార్దన రెడ్డికి సంబంధం ఉందని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈనాడు రాగం, సీబీఐ తాళం, ఈడీ పల్లవి పాడుతున్నాయని విమర్శించారు. విచారణ సంస్థలు ఎల్లో మీడియాతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. టీడీపీ ఆరోపణలనే ఈనాడు ప్రచురిస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. ఈనాడు ప్రచురించిన వార్తలనే సీబీఐ, ఈడీ అధికారులు సైతం వల్లిస్తున్నారన్నారు. 

జగన్ బయటకు రాకుండా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర మంత్రి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఇండియాటుడే సర్వే ఇచ్చిందని, ఆ సర్వేను ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో ఎందుకు ప్రచురించలేదని ఆయన ప్రశ్నించారు. టైమ్స్ నౌ సర్వేను మాత్రమే ఎందుకు ప్రచురించారని ఆయన అడిగారు. ఎల్లోమీడియాతో సర్వే నిర్వహించేందుకు సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. 

బయ్యారం గనుల లీజ్ రద్దు చేసింది తానేనని చెప్పారు. ఓబుళాపురం గనుల పర్మిట్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు. అందుకే వాటిని రద్దు చేశాం, దీనిపై టీడీపీ, కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. జిఓలు ఇచ్చిన మంత్రులను బయటపెట్టి, సంబంధం లేని జగన్ ను అరెస్ట్ చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే జగన్ ను అరెస్ట్ చేసేవారా? అని ప్రశ్నించారు. మంత్రులు చేతకానితనంతో మాట్లాడుతున్నారన్నారు. బయ్యారం గనుల విలువ 14 లక్షల కోట్ల రూపాయల విలువ ఉంటుందని టీడీపీ ప్రచారం చేస్తోందని, 7 లక్షల కోట్ల రూపాయలకు ఆ గనులను టీడీపీనే తీసుకోవచ్చు కదా అని ఆయన అన్నారు. జగన్ ఏ రోజు మంత్రులతో మాట్లాడింది లేదని ఆయన చెప్పారు. గాలి జనార్దన రెడ్డితో వైఎస్ జగన్ కు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. జగన్ ను ఇరికించేందుకు ఎల్లోమీడియా కుట్ర పన్నిందని చెప్పారు.
Share this article :

0 comments: