కాంగ్రెస్‌కు బలం లేదు..టీడీపీకి అధికారం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌కు బలం లేదు..టీడీపీకి అధికారం లేదు

కాంగ్రెస్‌కు బలం లేదు..టీడీపీకి అధికారం లేదు

Written By news on Monday, April 15, 2013 | 4/15/2013

‘రైతుకోసం’లో వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం

తిరుపతి: ‘‘కాంగ్రెస్‌కు బలం లేదు.. టీడీపీకి అధికారం లేదు. అందుకే ఒకరికొకరు మద్దతిచ్చుకుంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి దయాదాక్షిణ్యాలతో మంత్రులైన వారు ఆ కుటుంబాన్నే విమర్శిస్తుండటం చూసి జనం రక్తం మరిగిపోతోంది. వారు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అన్నా అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలనూ చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పనున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదివారం సాయంత్రం స్థానికంగా ‘రైతు కోసం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రగిరి మార్కెట్‌లో రైతు కూలీల తరఫున గేటు పన్ను టెండర్ మొత్తాన్ని చెవిరెడ్డే చెల్లించి, వారు తమ ఉత్పత్తులను ఉచితంగా విక్రయించుకునేందుకు వీలు కల్పించారు.

ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు నాయకుడు నాగిరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి పాల్గొని ప్రసంగించారు. చెవిరెడ్డిని అభినందించారు. జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే ఉనికి కోల్పోతామని భయపడే అధికార, ప్రతిపక్ష పార్టీలు కుట్రలు పన్నాయంటూ పెద్దిరెడ్డి మండిపడ్డారు. వైఎస్ దయాదాక్షిణ్యాలతో మంత్రులైన వారు ఇప్పుడు మహానేత కుటుంబాన్నే విమర్శిస్తున్నారంటూ ఆగ్రహించారు. జగన్ జైలు నుంచి బయటకు ఎప్పుడొస్తారని జనం అడుగుతున్నారని చెబుతూ కంటతడి పెట్టారు. వైఎస్ కుటుంబాన్ని విమర్శించిన మంత్రి ఆనం చరిత్రహీనుడంటూ నారాయణస్వామి దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లాలో జనం ఆయనను ఎప్పుడో ఉరి తీసేశారన్నారు. రైతును రాజు చేసే దిశగా వైఎస్ పాలన సాగిందని చెవిరెడ్డి అన్నారు. ‘‘రైతురాజ్యం కోసం పరితపించింది వైఎస్, ఆ తరవాత జగనే. ప్రభుత్వానికి రైతులు చెల్లించాల్సిన మొత్తాన్ని వారి తరపున నేను చెల్లించడానికి ఆ ఇద్దరు నాయకులే స్ఫూర్తి’’ అని వివరించారు.

వైఎస్, జగన్ స్ఫూర్తితో ‘రైతు కోసం’

చంద్రగిరిలో 200 మందికి పైగా రైతులు, రైతు కూలీలు తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్‌లో విక్రయించి జీవనోపాధి పొందుతున్నారు. మార్కెట్ అనుమతి కోసం పంచాయతీకి వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తట్ట, బుట్ట, బండి, అంగడి... ఇలా ఒక్కోదానికి ఒక్కో రేటు. పంచాయతీ వేలంపాటను పాడుకున్నవారు రైతు కూలీల నుంచి ఈ పన్ను (గేటు) వసూలు చేస్తుంటారు. అలా వీరు ఏటా రూ.1.5 లక్షలకుపైగా చెల్లించాలి. వారికి వచ్చే బొటాబొటి ఆదాయంలో కొంత భాగాన్ని ఇలా కోల్పోతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గేటు టెండర్‌ను రూ.1.53 లక్షలకు వేలంపాటలో తానే దక్కించుకున్నారు. రైతు కూలీలు గేటు కట్టకుండా ఉచితంగా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలు కల్పించారు. తద్వారా వారికి ఏటా రూ.10 నుంచి రూ.20 వేల ఆదాయమార్గాన్ని చూపారు.
Share this article :

0 comments: