అసలు మోసగాడు చంద్రబాబే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అసలు మోసగాడు చంద్రబాబే

అసలు మోసగాడు చంద్రబాబే

Written By news on Monday, April 29, 2013 | 4/29/2013

అంబటి రాంబాబు ధ్వజం
బాబుది చిత్తశుద్ధి లేని పాదయాత్ర
ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ మండుటెండలో నడిచారు
ఆయన కన్నా ఎక్కువ నడిస్తే సీఎం, ప్రధానో కావొచ్చని బాబు పాదయాత్ర చేశారు
అంతేగానీ ప్రజలపై ప్రేమతో కాదు...
తన తొమ్మిదేళ్ల పాలనను మళ్లీ తెస్తానని చెప్పుకునే ధైర్యం బాబుకు ఉందా?


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలైన, సిసలైన మోసగాడు చంద్రబాబేనని, తన తొమ్మిదేళ్ల పాలనలో చేసిన వాగ్దానాలేవీ నెరవేర్చకుండా ఆయన ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డిని మోసగాడని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖపట్నం సభలో అనడంపై మండిపడ్డారు. ‘‘బాబూ... దేనికి వైఎస్‌ను మోసగాడంటున్నావ్..? 5 ఏళ్ల 3 నెలల పాటు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించినందుకా? బృహత్తరమైన ఆరోగ్యశ్రీ పథకం పెట్టి లక్షలాది మందికి మెరుగైన వైద్యం చేయించినందుకా? నిరంతరం ప్రజల కోసమే ఆలోచించి, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేసినందుకా?’’ అని అంబటి సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. మద్యపాన నిషేధం అమలు వల్ల ఖజానాపై పెను భారం పడుతోందని, రెండు రూపాయల కిలోబియ్యం ధర పెంచారని, ఆ తర్వాత ఈ రెండింటినీ ఎత్తివేసి ప్రజలను దారుణంగా మోసగించారని విమర్శించారు. ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.5 వేలు డిపాజిట్ చేస్తానని నమ్మబలికిన బాబు.. తర్వాత ఆ ఊసునే ఎత్తలేదన్నారు. చంద్రబాబు రాజకీయం, ఆయన బతుకంతా మోసపూరితమని అలాంటి వ్యక్తి వైఎస్‌ను మోసగాడంటే రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం సహించరని హెచ్చరించారు. వైఎస్ మృతి తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 26 చోట్ల టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయన్నారు. బాబు చేసిన పాదయాత్ర ఏ మాత్రం చిత్తశుద్ధి లేనిదని, దేశ ప్రజల దృష్టిలో పాదయాత్రకు ఉన్న పవిత్రతను మంట గలిపిన ఘనత ఆయనదేనని మండిపడ్డారు. ‘‘వైఎస్ మండుటెండల్లో పాదయాత్ర చేస్తే.. చంద్రబాబు మాత్రం అర్ధరాత్రి దయ్యాలు, దొంగలు తిరగాడే సమయంలో చేశారు. 

అసలు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే కదా పగలు పాదయాత్ర చేసేది. ఇదంతా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉంది. వైఎస్ పాదయాత్ర చేసిన తర్వాత సీఎం అయ్యారు కనుక తానూ ఆయన కన్నా ఎక్కువ నడిస్తే ప్రధాని పదవో, ముఖ్యమంత్రి పదవో వరిస్తుందని భావించి పాదయాత్ర చేశారు. అంతేగానీ ప్రజలపై ప్రేమతో కాదు..’’ అని దుయ్యబట్టారు. పాదయాత్రను శ్రీకాకుళంలో ముగిస్తానని ఒకసారి, ఎర్రన్నాయుడు సమాధి వద్ద ముగిస్తానని మరోసారి తనకు తాను లక్ష్య నిర్దేశం చేసుకున్న చంద్రబాబు విశాఖపట్నంలో అర్ధంతరంగా ఆపేశారని ఎద్దేవా చేశారు. దీన్నిబట్టే ఆయన చెప్పిన దాన్ని ఎంత వరకు అమలు చేస్తారో అర్థం అవుతోందన్నారు.తొలుత రోజుకు 23 కిలోమీటర్లు నడుస్తానని చెప్పిన చంద్రబాబు.. కర్నూలుకు వచ్చేటప్పటికి 19 కిలోమీటర్లకు కుదించారన్నారు. తెలంగాణలో రోజుకు 13 కిలోమీటర్లు, కృష్ణా, గోదావరి జిల్లాలకు వచ్చేసరికి 10 కిలోమీటర్లు, ఇక విశాఖపట్నం చేరేనాటికి రోజుకు 6, 7 కిలోమీటర్లు నడిచారని అంబటి విమర్శించారు. బాబు సారథ్యంలో టీడీపీ పరిస్థితి కూడా ఇలాగే తయారవుతోందన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన వద్ద నుంచి అధికారం లాక్కునేటపుడు టీడీపీ ఓట్ల శాతం 42గా ఉంటే బాబు చేతిలో ఇప్పుడు 20 శాతానికి పడిపోయిందని అంబటి చెప్పారు. తన తొమ్మిదేళ్ల పాలనను మళ్లీ తెస్తానని చెప్పే ధైర్యం బాబుకు ఉందా అని ప్రశ్నించారు. 2,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత అయినా బాబులో మార్పు వస్తుందని ఆశించామని కానీ ఏ మాత్రం మారలేదని పేర్కొన్నారు.

బయట దూషించి.. అసెంబ్లీలో నెత్తిన పెట్టుకున్నారు
పాదయాత్రలో కాంగ్రెస్‌ను దూషించి శాసనసభలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పాదాలు కడిగి ఆ నీళ్లను చంద్రబాబు నెత్తిన చల్లుకున్నారని అంబటి అన్నారు. తన అన్న అంతటి మోసగాడు మరొకరు ఉండరని సాక్షాత్తూ బాబు రక్తం పంచుకు పుట్టిన నారా రామ్మూర్తినాయుడే విమర్శించిన సంగతిని అంబటి గుర్తు చేశారు. ఎన్టీఆర్ కుటుంబీకులను, జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికల్లో వాడుకుని కరివేపాకులా పడేసిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. జగన్ తప్పు చేసి జైలుకు వెళ్లలేదని, సోనియాను ఎదిరించి పార్టీని స్థాపించినందుకు ఆయన్ను జైల్లో పెట్టారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి గులాంనబీ ఆజాదే చెప్పినట్లు గుర్తుచేశారు.
Share this article :

0 comments: