ఎన్నికల గుర్తును సైకిల్ కాకుండా వెన్నుపోటుకు సంకేతంగా కత్తి గుర్తును పెట్టుకుంటే మంచిదని.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికల గుర్తును సైకిల్ కాకుండా వెన్నుపోటుకు సంకేతంగా కత్తి గుర్తును పెట్టుకుంటే మంచిదని..

ఎన్నికల గుర్తును సైకిల్ కాకుండా వెన్నుపోటుకు సంకేతంగా కత్తి గుర్తును పెట్టుకుంటే మంచిదని..

Written By news on Saturday, April 6, 2013 | 4/06/2013

మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు తెలుగుదేశం పట్ల, చంద్రబాబుపైన విశ్వాసం కోల్పోయే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పారు. అందుకే షర్మిల పాదయాత్రలోనూ పాల్గొంటున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెక్సీల్లో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు పెట్టడంపై టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడాన్ని రమేష్ ఖండించారు. శుక్రవారం పులువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విజయమ్మ దీక్ష వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ను పదవినుంచి దించేసి,ఆయన మానసిక క్షోభతో చనిపోవడానికి కారణం చంద్రబాబేనని ఆయన అభిమానులు తెలుసుకున్నారు కాబట్టే వాళ్లు ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకొని, ఆయనతో ప్రచారం చేయించుకొని ఇప్పుడు అతడిని వదిలివేయడం మీకు తెలియదా అని రేవంత్‌ను ప్రశ్నించారు. జూ.ఎన్టీఆర్ విజయవాడ వస్తే టీడీపీ నాయకులే కాదు కార్యకర్తలు కూడా అక్కడకి వెళ్లవద్దని స్వయంగా చంద్రబాబు ఫోను చేశాడా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తమపార్టీ ఎన్నికల గుర్తును సైకిల్ కాకుండా వెన్నుపోటుకు సంకేతంగా కత్తి గుర్తును పెట్టుకుంటే మంచిదని ఆ పార్టీ నేతలకు సూచించారు. 
Share this article :

0 comments: