Jupudi press meet on Bayyaram mines issue - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » Jupudi press meet on Bayyaram mines issue

Jupudi press meet on Bayyaram mines issue

Written By news on Wednesday, April 24, 2013 | 4/24/2013

బయ్యారం గనులపై ఏపీఎండీసీ పిలిచిన గ్లోబల్‌ టెండర్లలో రక్షణ స్టీల్స్‌ సహా ఇద్దరు మాత్రమే పాల్గొన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ఈ టెండర్లలో నామా నాగేశ్వర్రావు, సీఎం రమేష్‌ గానీ, సుజనా చౌదరి గానీ ఎందుకు పాల్గొనలేదని జూపూడి ప్రశ్నించారు. మిరాకల్‌ కంపెనీ, రక్షణస్టీల్స్‌ ఒకే అడ్రస్‌లో ఉన్నాయని టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని జూపూడి అన్నారు. మిరాకల్‌ కంపెనీ అసలు చిరునామాను విడుదల చేసి, పరిశీలించుకోమని జూపూడి సవాల్‌ విసిరారు. షర్మిల చేసిన సవాల్‌పై ఎందుకు స్పందించడంలేదని టీడీపీ నేతలను జూపూడి నిలదీశారు. రద్దు చేసిన జీవో మీద ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నంబరు 64 వైఎస్‌ఆర్‌ జారీచేసింది కాదని, రోశయ్య హయాంలో ఈ జీవో జారీ అయ్యిందని జూపూడి తెలిపారు. రక్షణ స్టీల్స్‌కు గనుల కేటాయింపు రోశయ్య హయాంలో జరిగిందన్నారు. హైకోర్టులో ద్విసభ్య బెంచ్‌ ముందు ఈ కేసు విచారణలో ఉందని, రద్దు చేసిన జీవో మీద ఎవరు ఇష్టంవచ్చినట్టు వారు మాట్లాడటం పద్దతికాదని జూపూడి సూచించారు. తెలంగాణ ప్రాంతంలో స్టీల్‌ప్లాంట్‌ రావాలన్నది వైఎస్‌ ఆలోచన అని జూపూడి వ్యాఖ్యానించారు. రక్షణ స్టీల్స్‌, ఏపీఎండీసీ మధ్య ఒప్పందాన్ని పూర్తిగా చూడాలన్నారు. ఒప్పందం పూర్తిగా చదివే ఓపిక కూడా టీడీపీ నాయకులకు లేదని, వైఎస్‌ఆర్‌ అల్లుడు అయినంతమాత్రాన ఆయనపై దుమ్మెత్తిపోస్తారా అని జూపూడి అన్నారు. వైఎస్‌ఆర్‌ కుటుంబమే లక్ష్యంగా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: