ముగిసిన షర్మిల 143వ రోజు పాదయాత్ర! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగిసిన షర్మిల 143వ రోజు పాదయాత్ర!

ముగిసిన షర్మిల 143వ రోజు పాదయాత్ర!

Written By news on Thursday, May 9, 2013 | 5/09/2013

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల 143వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం ఖమ్మం జిల్లాలో విఎం బంజరా వద్ద ముగిసింది. గురువారం నాటి షర్మిల పాదయాత్ర 11.8 కిలోమీటర్లు సాగిందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు తెలిపారు. చండ్రుగొండ మండలంలోని రాంనగర్ శివారు ప్రాంతం నుంచి ప్రారంభమైన పాదయాత్ర మైబూబ్‌నగర్ క్రాస్ రోడ్, లింగన్నగూడెం క్రాస్ రోడ్, ఉప్పలచెలక, రంగారావు బంజర, ఎడ్ల బంజర మీదుగా వీఎం బంజర వరకు సాగింది.
Share this article :

0 comments: