కానీ ఈ సర్కారు బలం 146 మాత్రమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కానీ ఈ సర్కారు బలం 146 మాత్రమే

కానీ ఈ సర్కారు బలం 146 మాత్రమే

Written By news on Monday, May 20, 2013 | 5/20/2013

* అధికారంలో ఉండాలంటే ప్రభుత్వానికి 148 మంది ఎమ్మెల్యేలు ఉండాలి
* కానీ ఈ సర్కారు బలం 146 మాత్రమే 
* బాబు మద్దతుతోనే ఈ ప్రభుత్వం కొనసాగడం లేదా?
* చంద్రబాబు ఓవైపు తనపై కేసులు, విచారణలు లేకుండా మేనేజ్ చేసుకుంటూనే మరోవైపు అవినీతిపై పోరాటం అంటున్నారు
* ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన పార్టీని ఇప్పుడు అదే కాంగ్రెస్‌కు రాసిచ్చారు
* బోనులో ఉన్నా సింహం.. సింహమే.. 
* జగనన్న వస్తారు.. రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారు

‘‘ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే కనీసం 148 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారుకు ఉన్న ఎమ్మెల్యేల బలం 146 మంది మాత్రమే. మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎలా ఉంది? ఎవరి మద్దతుతో కొనసాగుతోంది.. చంద్రబాబు మద్దతుతో కాదా..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. 

ఒకవైపు తనపై కేసులు లేకుండా, విచారణ జరగకుండా మేనేజ్ చేసుకుంటూనే .. మరోవైపు అవినీతిపై పోరాటం చేస్తానంటున్న చంద్రబాబును ఏమనాలని అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు వైఖరికి నిరసగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో సాగింది. నల్లజర్ల మండల కేంద్రంలో భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

ఈ చార్జీల మోత.. కరెంటు భారం తప్పేది..
ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాసానికి... చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన నిలబడి మద్దతిచ్చి ఉంటే ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయి ఉండేది. ప్రభుత్వం పడిపోయి ఉంటే ఈ చార్జీల మోత, ఈ కరెంటు భారం ప్రజల నెత్తిన పడేదే కాదు. ఇంత దుర్మార్గపు పాలనకు, కరెంటు చార్జీల మోతకు కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎంత బాధ్యత ఉందో, చంద్రబాబు నాయుడుకు అంతే బాధ్యత ఉంది. చంద్రబాబు పోరాటం చేస్తోంది.. కరెంటు చార్జీలు పెంచినందుకు కాదు. ఎఫ్‌డీఐతో రైతులకు, చిన్న వ్యాపారులకు నష్టం వస్తుందని కాదు. ప్రజలు చూస్తున్నార న్న విషయం కూడా పట్టించుకోకుండా... ఐఎంజీ, ఎమ్మార్ కేసుల్లో తన మీద విచారణ జరగకుండా ఉండటానికి నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడిన చంద్రబాబును చరిత్ర హీనుడు అనకుంటే మరేమంటారు?

టీడీపీని కాంగ్రెస్‌కు రాసిచ్చేశారు..
చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు రాసిచ్చేసినట్టుగానే.. చంద్రబాబు కూడా టీడీపీని కాంగ్రెస్‌కు రాసిచ్చేశారు. ఆయన పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయారు కాబట్టే... ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు బాబుపై విశ్వాసం లేక, నియోజకవర్గంలోని ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, మనస్సాక్షిని చంపుకోలేక, ఈరోజు టీడీపీని వీడే పరిస్థితి వచ్చింది. ఇక్కడున్న కృష్ణబాబుగారైనా, బొడ్డు భాస్కరరామారావుగారైనా, వనిత అయినా ఈరోజు వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారంటే దానికి కారణం జగన్‌కు ఉన్న విశ్వసనీయత. చంద్రబాబు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. 

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి పదవి పోయాక, అధికారం కోసం టీడీపీలోకి వచ్చి చేరారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు విలువలకు కట్టుబడిన మనుషులు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు చేరారు. ఎన్టీఆర్ ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారో, అదే కాంగ్రెస్‌తో ఈరోజు చంద్రబాబు కుమ్మక్కయ్యారు. ప్రతి విషయంలో కుమ్మక్కయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, అవి శ్వాసం పెట్టిన మొదటిసారి, అవిశ్వాసం పెట్టిన రెండోసారి... ఇలా ప్రతిసారీ చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్కక్కయ్యారు.

పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ప్రచారం చేస్తున్నారు. నిజంగా వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఉంటే ఈ రోజు జగనన్న జైల్లో ఉండేవారా? అని అడుగుతున్నాం. నిజంగా కుమ్మ క్కై ఉంటే ఈపాటికి జగన్ ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయిపోయి ఉండేవారు. నిజానికి ఈ రెండు పార్టీలు కుమ్మక్కై చేతిలో చెయ్యి వేసుకొని అబద్ధపు కేసులు పెట్టి, సీబీఐని వాడుకొని జగనన్నను జైలు పాలు చేశాయి. కానీ బోనులో ఉన్నా సింహం...సింహమే.. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు.. జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు. ఒకరోజు త్వరలోనే వస్తుంది.. ఆరోజున జగనన్న మనందరిని రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తారు.
Share this article :

0 comments: