సీబీఐ ‘రాజకీయ బందీ’ : సుప్రీం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ ‘రాజకీయ బందీ’ : సుప్రీం

సీబీఐ ‘రాజకీయ బందీ’ : సుప్రీం

Written By news on Wednesday, May 1, 2013 | 5/01/2013

కీయ జోక్యంతో సంస్థ నిష్పాక్షికతకు తూట్లు
ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేయాలి
అదే తమ తొలి కర్తవ్యమన్న ధర్మాసనం
బొగ్గు కుంభకోణం దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి
నివేదికను కేంద్రంతో పంచుకుంటారా?
సీబీఐ తీరు మా అంతరాత్మనే కుదిపేసింది
మా నమ్మకాన్ని వమ్ము చేశారు
సీబీఐని తలంటిన ధర్మాసనం
మే 6లోగా అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
తదుపరి విచారణ మే 8కి వాయిదా

‘‘రాజకీయ బాసుల నియంత్రణ నుంచి సీబీఐ నేటికీ బయటపడకపోవడం చాలా తీవ్రమైన అంశం’’
‘‘మీపై (సీబీఐ) మేం పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశారు. బొగ్గు కుంభకోణం నివేదికను మీరు కేంద్రం ముందు పరిచిన తీరుతో దర్యాప్తు పునాదులే భారీ కుదుపునకు లోనయ్యాయి.
ఈ ఉదంతం మా అంతరాత్మనే కుదిపేసింది’’
‘‘రాజకీయ ప్రభావాలు, జోక్యాలు, చొరబాట్లు, ఒత్తిళ్లు తదితరాల బారి నుంచి సీబీఐని విముక్తం చేయడమే మా తొలి లక్ష్యం. దర్యాప్తు సంస్థ నిష్పాక్షికతను పునరుద్ధరించాలంటే ముందుగా మేం చేయాల్సిందదే’’
‘‘మీకు రాజకీయ ఊతకర్రల అవసరం లేదు. స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండండి.’’

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. సీబీఐని జేబు సంస్థగా మార్చేసుకుని, అడుగడుగునా దాన్ని తన కనుసన్నల్లో ఆడిస్తున్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు తీరును తీవ్రంగా అభిశంసించింది. సునిశిత వ్యాఖ్యలు, ఆక్షేపణలతో దర్యాప్తు సంస్థకు, తద్వారా కేంద్రానికి అక్షరాలా పలుగు రాళ్లతో నలుగు పెట్టింది! బొగ్గు కుంభకోణంపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తులో కేంద్రం అనుచిత జోక్యం చేసుకుంటోందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థాయీ నివేదిక ముసాయిదాను సీబీఐ తమకు సమర్పించే ముందే కేంద్రం ముందు పరిచిన తీరుతో మొత్తం దర్యాప్తు ప్రక్రియ తాలూకు పునాదులే భారీ కుదుపుకు లోనయ్యాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘అత్యంత ఆందోళనకరమైన, తీవ్రమైన అంశమిది. ఈ ఉదంతం మా అంతరాత్మనే కుదిపేసింది. ఇలాంటి పరిస్థితిలో మేమేం చేయాలి?’’ అని వ్యాఖ్యానించడం ద్వారా పరిస్థితి తీవ్రతను కళ్లకు కట్టింది. ‘‘అత్యంత తీవ్రమైన అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన ఇలాంటి కేసులో నివేదికను ఇతరులతో ఎలా పంచుకుంటారు? మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను పాటించరా? దర్యాప్తును ఎలాంటి ప్రభావాలూ, జోక్యాలు, ఒత్తిళ్లకూ లోనవకుండా కొనసాగించాల్సిందిగా మిమ్మల్ని మేం సుస్పష్టంగా ఆదేశించాక కూడా ఇలా జరిగిందంటే.. పటిష్ట పునాది కాస్తా భారీ కుదుపునకు లోనవుతోందన్నట్టే. మిమ్మల్ని మేం విశ్వసించాం. కానీ మీరు మాత్రం మమ్మల్ని పూర్తిగా చీకట్లో ఉంచారు. మీ చర్య మీపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టేలా ఉంది’’ అని సీబీఐని కడిగి పారేసింది. అంతేకాదు... సీబీఐని రాజకీయ బాసుల కబంధ హస్తాల బారి నుంచి విముక్తం చేసి తీరతామంటూ ప్రతినబూనింది. సీబీఐని స్వతంత్ర సంస్థగా మార్చాలన్న వినీత్ నారాయణ్ తీర్పు వెలువడి 15 ఏళ్లయినా ఇప్పటికీ రాజకీయ ప్రభావం దాని నిష్పాక్షికతను దెబ్బ తీస్తూనే ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ, కార్యనిర్వాహక బాసుల నియంత్రణ నుంచి సీబీఐ నేటికీ బయట పడకపోవడం చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. ‘‘స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండండి. 


http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=589995&Categoryid=1&subCatId=32
Share this article :

0 comments: