జగన్ పై కేసు రాజకీయ కుట్రే: వైఎస్ భారతిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పై కేసు రాజకీయ కుట్రే: వైఎస్ భారతిరెడ్డి

జగన్ పై కేసు రాజకీయ కుట్రే: వైఎస్ భారతిరెడ్డి

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు రాజకీయ ప్రేరేపితమని ఎన్డీటీవీతో వైఎస్‌ భారతిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, పార్టీని వీడనంత వరకు జగన్‌ కూడా గౌరవనీయ వ్యక్తులని ఎన్డీటీవీతో వైఎస్‌ భారతిరెడ్డి వ్యాఖ్యానించారు. 

జగన్‌ కాంగ్రెస్‌ను వీడిన నెల తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పిల్‌ వేశారని..ఆ తర్వాత నెలలోపే ఆయన మంత్రి కూడా అయిన విషయాన్ని వైఎస్ భారతి ప్రస్తావించారు. జగన్‌కు బెయిల్‌ రాదంటూ ఇటీవలే రైల్వేమంత్రి కోట్ల కూడా చెప్పారని.. ఇక ఆజాద్‌ అయితే కాంగ్రెస్‌లో జగన్‌ ఉంటే మంత్రి అయ్యేవారని చెప్పిన విషయాన్ని ఎన్డీటీవీతో వైఎస్‌ భారతిరెడ్డి అన్నారు. జగన్‌ బెయిల్‌పై వస్తారు.. న్యాయం జరుగుతుందనుకున్నామని.. సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గడువు విధించడం సంతోషమని ఆమె అన్నారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోరిందన్నారు.

జగన్‌ జైలులో ఉన్నా జనం ఆయన వెంట ఉన్నారని.. జగన్‌పై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని వైఎస్‌ భారతిరెడ్డి తెలిపారు. జగన్‌ అరెస్టయ్యాక 18చోట్ల ఉపఎన్నికలైతే 15 గెలిచామని.. నెల్లూరు లోక్‌సభలోనైతే రికార్డు మెజార్టీతో గెలిచామన్నారు. ఉపఎన్నికల ఫలితాలు ప్రజాభిమానానికి నిదర్శనాలని.. కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటి తీర్పును ప్రజలు ఇస్తారని వైఎస్‌ భారతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

గత 21నెలలుగా సీబీఐ దర్యాప్తు చేస్తూనే ఉందని..గతంలో 3నెలల్లో దర్యాప్తు ముగించేస్తామని సుప్రీంకు చెప్పిన సీబీఐ 8నెలలైనా చేయలేదని..తాజాగా సుప్రీంకోర్టు 4నెలల గడువు విధించిందని ఎన్డీటీవీతో వైఎస్‌ భారతిరెడ్డి తెలిపారు. తీర్పు వెలువడ్డ కాసేపటికే మరింత గడువు కోరుతామన్నారు అశోక్‌భాన్‌ మీడియాకు తెలపడం ఇదీ సీబీఐ దర్యాప్తుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు.
Share this article :

0 comments: