జగన్ త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారు

జగన్ త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారు

Written By news on Tuesday, May 7, 2013 | 5/07/2013

వాళ్లు వాకింగ్, ఫ్లయింగ్ ఫ్రెండ్స్
కలసి కట్టుగా రాష్ట్రాన్ని ఆడిస్తున్నారు
జగన్ త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారు
వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ 

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కిరణ్ సర్కారుకు ముఖ్య సలహాదారుగా మారారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎద్దేవా చేశారు. ‘‘వారిద్దరూ వాకింగ్, ఫ్లయింగ్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. కలసికట్టుగా రాష్ట్రాన్ని ఆడిస్తున్నారు. తాము వెళ్లిన చోటల్లా పైలాన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. స్వతంత్ర ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తన అనుయాయులు, నేతలు, కార్యకర్తలతో కలిసి సోమవారం విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఇటీవలి చంద్రబాబు ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర, కిరణ్ హెలికాప్టర్ ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని విజయమ్మ చేసిన పై వ్యాఖ్యలకు సభికులు పెద్దపెట్టున చప్పట్లతో స్పందించారు. 

నాటి చంద్రబాబు పాలనకు, నేటి కిరణ్ పాలనకు ఏమీ తేడా లేదని ఆమె అభిప్రాయపడ్డారు. వెన్నుపోట్లు అనగానే గుర్తొచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబేనని గుర్తు చేశారు. ఆయన నిజాయితీపరుడని ఏ కోర్టు చెప్పిందని ప్రశ్నించారు. ‘ఈనాడు’ రామోజీరావు, ‘జయభేరి’ మురళీమోహన్, సత్యం రామలింగరాజు, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు తదితరులకు బాబు ఎన్నిరకాలుగా లబ్ధి చేకూర్చారో అందరికీ తెలుసన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నింటినీ కిరణ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ దుయ్యబట్టారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు.

మాయ హస్తమది: సర్కారు ప్రారంభించిన పథకం ‘అమ్మహస్తం’ కాదని, దాని పేరును మాయ హస్తమని మార్చుకుంటే సరిపోతుందని విజయమ్మ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి ప్రజలపై భారం పెంచుతున్నాయని విమర్శించారు. రైతులకు క్రాప్ హాలిడేలా కార్మికులు కూడా పవర్ హాలిడేలతో కుదేలవుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వైఎస్ హయాంలో ఒక్కసారి కూడా కరెంట్ చార్జీలు పెంచలేదని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులు మాత్రం పేద ప్రజలపై కేవలం కరెంట్ చార్జీల రూపంలోనే రూ.20 వేల కోట్ల పై చిలుకు భారం మోపారన్నారు. 

కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్కొక్కరికి ఒక్కోచోట ఒక్కో న్యాయం అన్న చందంగా వ్యవహరిస్తున్నాయని విజయమ్మ దుయ్యబట్టారు. బొగ్గు కుంభకోణం ఉదంతంలో సీబీఐ నివేదికనే కేంద్ర న్యాయ మంత్రి, ప్రధాని కార్యాలయ అధికారులు కలిసి తారుమారు చేశారని గుర్తు చేశారు. ఇక్కడ మాత్రం జగన్‌ను వాళ్లే దోషి అంటున్నారంటూ దుయ్యబట్టారు. వైఎస్ మరణానంతరం గత నాలుగేళ్లలో కాంగ్రెస్ పాలనలో ధరలు ఏకంగా 500 శాతం పెరిగాయన్నారు. కాంగ్రెస్‌తో పాటు దానికి తోక పార్టీగా వ్యవహరిస్తున్న టీడీపీ కూడా ఇందుకు కారణమేనని చెప్పారు. అవి రెండూ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారని అన్నారు. కానీ జగన్ త్వరలోనే వాటన్నింటినీ ఛేదించుకుని బయటికొస్తారని, వైఎస్ స్వర్ణయుగాన్ని ప్రజలకు అందిస్తారని చెప్పారు. ఏటా 10 లక్షల ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని అమలు చేస్తామన్న హామీని నిలబెట్టుకుంటారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో ప్రకటించిన ప్రతి పథకాన్నీ తప్పకుండా అమలు చేస్తామని ప్రకటించారు.

పార్లమెంటులో వైఎస్ విగ్రహం: కూన

కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అలాగే వైఎస్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ మాజీ వైఎస్ చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, ఏరియా, వార్డు కమిటీ సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, జోగి రమేశ్, పేర్ని నాని, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, పార్టీ నేతలు జనక్ ప్రసాద్, గట్టు రామచంద్రరావు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, విజయారెడ్డి, బి.జనార్దన్‌రెడ్డి, కొలన్ శ్రీనివాస్‌రెడ్డి, సిద్దేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

‘ప్రతి గ్రామానికీ 10 మంది మహిళా పోలీసులు’

గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం జరిగిన ‘మహిళా నగారా’లో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రతి పది వేల మంది జనాభాకు పది మంది మహిళా కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తారు’’ అని అన్నట్లుగా సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో పొరపాటున ప్రచురితమైంది. వాస్తవానికి..‘‘వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెయ్యి మంది నివాసం ఉంటున్న ప్రతి గ్రామ పంచాయతీకి జగన్ అదే గ్రామానికి చెందిన 10 మంది అక్కాచెల్లెళ్లను కానిస్టేబుళ్లుగా నియమిస్తారు. ఆ పంచాయతీ పరిధిలో బెల్టు షాపులు లేకుండా ఈ మహిళా కానిస్టేబుళ్లు చూస్తారు. వారికి మా పార్టీ అండగా నిలబడుతుంది’’ అని విజయమ్మ చెప్పారు.
Share this article :

0 comments: