జగనన్న కోసం... ఎదురుచూపులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న కోసం... ఎదురుచూపులు

జగనన్న కోసం... ఎదురుచూపులు

Written By news on Saturday, May 18, 2013 | 5/18/2013

అయ్యా చంద్రబాబునాయుడుగారూ... ‘వస్తున్నా మీకోసం’ అంటూ మీరు పాదయాత్ర చేశారు. అందుకు ధన్యవాదాలు. అయితే మీరు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేశారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు ఏమీ చేయలేని నిస్సహాయుడిగా మిగిలిపోయారు. నీతి, నిజాయితీ గల వ్యక్తినని మీ గురించి మీరు చెప్పుకుంటున్నారు. ఆ మాటను సీబీఐ చెప్తే ఇంకా బాగుండేది కదా... మీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానంగా ఉండేది. ఏ అవినీతికీ మీరు పాల్పడనప్పుడు కాంగ్రెస్‌తో చేయికలిపి, సీబీఐ దర్యాప్తునుంచి ఎందుకు తప్పించుకున్నారు? మొన్నటి యాత్రలో కూడా మీరు ఎన్నో డాంబికాలు పలికారు. ‘నాకు మరొక్కసారి అవకాశమివ్వండి’ అన్నారు. 

ఎందుకివ్వాలి? సంక్షేమ పథకాలన్నింటినీ మరుగున పరచడానికా? మీరు సీఎంగా ఉన్నప్పుడు పేదవారి దగ్గర గవర్నమెంట్ ఆసుపత్రిలో యూజర్ ఫీజు రూ.10 వసూలు చేయాలి అనే ఐడియా వచ్చింది మీకే కదా! ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నది మీరు కాదా? నిరుద్యోగ సమస్యను సృష్టించింది మీరే కదా? ఎందుకయ్యా ఇప్పుడీ కొంగ జపాలు. చుక్కాని లేని నావలా పడి ఉన్న కాంగ్రెస్‌ను వైఎస్సార్ తన భుజస్కంధాలపై వేసుకుని జవజీవాలు నింపి, ముందుకు నడిపారు. 

అలాంటి మహానేత తనయుడిని దూరం చేసుకుని, అది చాలదన్నట్లు జగనన్నపై నిందారోపణలు చేసి, కాంగ్రెస్‌వాళ్లు తప్పుచేశారు. కాంగ్రెస్, మీరు ఒక్కటై, జగనన్నను జైల్లో బంధించి, బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఇందుకు త్వరలోనే మీరు ప్రతిఫలం అనుభవిస్తారు. మీరు, మీకు వంత పాడుతున్న ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోతారు. అలాంటి సునామీని సృష్టించేందుకు ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగనన్న రాక కోసం నిత్యం ఎదురు చూస్తున్నారు.

- పి.బాపూజీరావు, తేలప్రోలు, కృష్టా


జగన్‌కు సాటి రాగలవారెవరు?

దివంగత వైఎస్సార్‌ని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ బురద జల్లితే, పాలకుల మెప్పు పొంది... రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీ టికెట్లు పొందవచ్చని పాలక, ప్రతిపక్ష నేతల ఆశ. అయితే ఈ విధంగా వైఎస్సార్‌ని విమర్శించే వాళ్లందరూ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు.

ఒక మనిషి... ఎదుటి మనిషిని విమర్శించాలి అంటే అందుకు సాటి రాగల వారు ఉండాలి. అందుకే మన పెద్దలు ‘సమాన వియ్యం - సమాన కయ్యమ’ని అన్నారు. జగనన్నకు సాటి ఎవరు? చంద్రబాబునాయుడు కాదు కదా, రూలింగ్ పార్టీలో ఏ ఒక్కరూ సాటిరారు. అందుకే ఇరుపార్టీలు ఆయన్ని మరికొంతకాలం జైల్లో ఉంచటానికే చూస్తున్నాయి. అయితే వాళ్ల ఆటలు ఇక ఎంతోకాలం సాగవు. జగన్ కడిగిన ముత్యంలా త్వరలో బయటికొచ్చి, దివంగత వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చి, బడుగు బలహీన వర్గాల యువ నాయకుడిగా కొనసాగుతాడు. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే సమయం కనుచూపుమేరలోనే ఉన్నదని నా ప్రగాఢ విశ్వాసం. ఆయన జైల్లో ఉండి కూడా ప్రజలను, నాయకులను ఆకర్షించడానికి ముఖ్య కారణం అతనిలోని మొండిధైర్యం, ప్రజల గురించి అతని ఆలోచనావిధానమేనని ప్రస్ఫుటం అవుతోంది. ఈ తరం నాయకుల్లో ఇలాంటి తెగువ ఒక్క జగన్‌లోనే కనిపిస్తోంది. జగన్‌కి సాటి ఎవరూ లేరని, రారని ఇంకొక మారు నేను ఘంటాపథంగా చెప్పగలను. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు ఎండగట్టి, జగనన్నకు పట్టం గట్టడం ఖాయం.

ఎన్టీయార్‌ను టీడీపీ నుండి బహిష్కరించాక, ఆయన లక్ష్మీపార్వతితో రాష్ట్రంలో పర్యటించారు. లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైఎస్సార్ పార్టీలో ఉన్నారు. కాబట్టి చంద్రబాబుకి కాని, ఎన్టీయార్ పుత్రరత్నాలకి కాని ఆయన ఫొటోపై ఎటువంటి హక్కు లేదు. దివంగత మహానేతలైన ఎన్టీయార్, వైఎస్సార్ అందరివారు. వీళ్లపై ఒక జాతి, మతం, కులం ప్రభావం ఉండదు. వారిపై కుటుంబాలకూ ఎటువంటి హక్కులు ఉండవు. ఇద్దరిలోనూ సారూప్యాలు ఉన్నాయి. ఒకరు తెలుగుజాతి గౌరవం గూర్చి పాటుపడితే, ఇంకొకరు బడుగు బలహీన పేదసాదల గురించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కి ఆదర్శమూర్తులుగా కొనియాడబడుతున్నారు. 

దివంగత వైఎస్సార్‌ని, ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ బురద జల్లితే, పాలకుల మెప్పు పొంది... రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీ టికెట్లు పొందవచ్చని పాలక, ప్రతిపక్ష నేతల ఆశ. అయితే ఈ విధంగా వైఎస్సార్‌ని విమర్శించే వాళ్లందరూ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలు అటువంటి నాయకులను ఒక కంట కనిపెడుతూ, 2014 ఎన్నికల్లో ఓడించటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరేమన్నా యువనాయకుడైన జగన్‌కు సాటి ఎవరూ రారు. ఇటువంటి నాయకుడు దేశానికి, ప్రజలకు ఎంతైనా అవసరం. ఆంధ్ర ప్రజానీకం యావత్తూ ‘యువకెరటం - జగన్’ కోసం నిరీక్షిస్తోంది. 

- బి.కైలాసరావు పట్నాయిక్, పూణె, మహారాష్ట్ర

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: