ప్రజా సమస్యలపై పోరాడడమే జగన్ చేసిన నేరమా?! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజా సమస్యలపై పోరాడడమే జగన్ చేసిన నేరమా?!

ప్రజా సమస్యలపై పోరాడడమే జగన్ చేసిన నేరమా?!

Written By news on Wednesday, May 8, 2013 | 5/08/2013

పెద్దల్లారా, రాజకీయ కోవిదుల్లారా... ఒక్కసారి ఆలోచించండి. జగన్ చేసిన తప్పేంటి? ప్రజాసమస్యలపై పోరాడటమా? తండ్రి ఆశయాల్ని నెరవేర్చాలనుకోవడమా? చట్టం, న్యాయం అందరికీ సమానమే అయినప్పుడు మరి ఒక్క జగన్‌నే బంధించడమేంటి? అవినీతి ఆరోపణలున్న అనేకమంది నాయకులు దర్జాగా దర్పంతో బయట తిరుగుతుంటే వారందరినీ వదిలేయడం ఏంటి?! ఏనాటికైనా ప్రజల మదిలో పాతుకుపోయిన ఈ ప్రశ్నలకు పాలకులు జవాబు చెప్పి తీరాల్సిందే. రాజన్న పాలన ఒక సువర్ణయుగం. అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో బతికారు. నాయకుడంటే ముందుండి నడిపించేవాడు కాదు, ప్రజల చూపు ఎటు ఉంటుందో అటు నడిచేవాడే అసలు సిసలైన నాయకుడు.

అలా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించాడు కాబట్టే ఆంధ్రదేశ చరిత్రలో రాజశేఖరరెడ్డిగారు ఒక గొప్ప నాయకుడిగా నిలిచిపోయారు. దమ్మిడీకి మారని నాయకులు, రాజకీయ బఫూన్‌లు ఎంతగా విమర్శించినా నిలువెత్తు ఆదర్శానికి నిదర్శనం రాజశేఖరరెడ్డిగారు. అటువంటి నాయకత్వ లక్షణాలను అణువణువునా పుణికిపుచ్చుకున్న జగన్‌లో ఈ రాష్ట్రప్రజలు తమ భవిష్యత్ నాయకుడిని దర్శించారనటంలో అతిశయోక్తి లేదు. భజనపరుల స్తోత్రాలతో కాలం వెళ్లదీసే కాంగ్రెస్ అధినాయకత్వానికి, రెండుసార్లు ప్రజల చేతిలో చావుదెబ్బ తిని అధికారం కోసం గుంటనక్కల్లా కాచుక్కూర్చున్న జిత్తులమారి చంద్రబాబుకి ఈ పరిణామం అశనిపాతంలా మారటంతో కుమ్మక్కు కుట్రలకు తెర లేపారు. దాని ఫలితంగానే జగన్‌పై అవినీతి ఆరోపణలు, జైలుపాలు చెయ్యటం!

అధికారాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాల్ని బట్టి, మనిషిని బట్టి, హోదాని బట్టి చట్టం, న్యాయం పనిచేస్తున్నప్పుడు జగన్ విషయంలో న్యాయం జరుగుతుందని ఆశించటం అత్యాశే అవుతుంది. కానీ ఏ నాయకుడికైనా రాజకీయ భవిష్యత్‌నిచ్చేది ప్రజలే. ఆ ప్రజలు జగన్‌ని, రాజశేఖరరెడ్డిగారి కుటుంబాన్ని అక్కున చేర్చుకుని, గుండెల్లో పెట్టుకుని చూస్తున్నప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాల్ని భవిష్యత్‌లో శాసించబోయే మహానాయకుడు జగన్ మాత్రమేనని ఇట్టే అర్థమవుతోంది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు నూరుమంది ఉన్నా, చివరకు పంచపాండవులే విజయం సాధించారు. చెడుపై మంచిదే ఎప్పుడూ విజయం. ఇది గడిచిన, నడుస్తున్న చరిత్ర చెప్పే నగ్నసత్యం.

- ఎం.శ్రీనివాసరావు, వల్లూరు, ప.గో.జిల్లా

ఈ ఒంటరి పోరాటంలో... అంతిమ విజయం జగన్‌దే!
నేను ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. మా కుటుంబాలన్నీ కాంగ్రెస్ వైపే కానీ, వైయస్సార్‌గారు రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు... పార్టీతో నిమిత్తం లేకుండా మమ్మల్ని పూర్తిగా వైయస్ అభిమానులుగా మార్చేశాయి. 2009 ఎన్నికలకు ముందే నేను మా పాఠశాలలో ఒక చిన్న సర్వే లాంటిది చేస్తే దాదాపు అరవై శాతం వరకు వైయస్ పథకాల వైపు పిల్లలు మొగ్గుచూపారు. అప్పుడే వైయస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని భావించాను. అలాగే వచ్చింది.

ఆ సంతోషం మిగలకుండానే వైయస్సార్ ఈ రాష్ట్రప్రజల్ని వదిలి వెళ్లారు. అయితే ఆ సమయంలో వైయస్ జగన్ నాయకత్వం ఉంది అన్న భరోసా కలిగింది. ఓదార్పుయాత్ర గురించి ఆయన అనౌన్స్ చేయగానే ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అనుకున్నాం. అదే సమయంలో జగన్ నాయకత్వంపై అనేక టీవీ చానళ్లల్లో చర్చలు, ఎస్.ఎం.ఎస్. పోల్స్ నిర్వహించినప్పుడు రాజకీయ పరిణామాలన్నీ ఆయనకు అనుకూలంగా మలుపు తిరగబోతున్నాయని ఆనందించాం. కానీ అది జరగలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ నుండి జగన్ బయటికి వచ్చిన రోజు మేమంతా ఎంతగానో సంతోషించాం. దురదృష్టం ... ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఆనాటి నుంచీ జగన్‌కు వేధింపులు మొదలయ్యాయి.

నలభై ఏళ్ల వయసు కూడా లేని ఒక కుర్రవాడిని, పెద్ద దిక్కులేని ఆ కుటుంబాన్ని అన్ని రాజకీయ పక్షాలు కలిసి వేధించడం ప్రపంచంలో ఒక వింతగా మాకు తోచింది. ఇలా ఎక్కడా జరగదేమో. ప్రజాస్వామ్య విలువల్ని మంట కలిపిన కాంగ్రెస్... ప్రజలు ఎంతగా జగన్‌ను కోరుకుంటున్నారో అంతగా అతడిని వేధించింది. సీబీఐని ఉసిగొల్పి ఆయన్ని జైలుకు పంపింది. అస్సలు కష్టం అంటే తెలియని ఒక ముఖ్యమంత్రి కుమారుడు, యువపారిశ్రామిక వేత్త ఇలా జరుగుతుందని ఊహించివుండరు. ఎల్లో మీడియా ఆయన్ని జైలుకు పంపేవరకు వదలలేదు. ఇప్పుడు ఆ మీడియానే చంద్రబాబును సీఎమ్ చెయ్యాలనుకుంటోంది. కానీ ఎవర్ని సి.ఎం.ని చెయ్యాలన్నది ప్రజల చేతిలో ఉంది. ప్రజలు జగన్‌వైపు ఉన్నారు. కాబట్టి ఆయన మన కాబోయే ముఖ్యమంత్రి.
- సీహెచ్‌కేపీఎల్, స్కూల్ అసిస్టెంట్ టీచర్,
ప్రగతినగర్, హైదరాబాద్ 


 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: